సోషల్ మీడియా వారియర్స్ చాలా కీలకం. ఒక్క సోషల్ మీడియా వారియర్ వంద మందికి సమాధానం చెప్పే శక్తి సంపన్నులు. వేల మెదళ్ళు కదిలించే శక్తి మీ దగ్గరే ఉంటుంది. వార్డు వారీగా గ్రూపులు ఏర్పాటు చేయండి. 43 వార్డుల్లోనూ గెలిచే ప్రత్యేకతను తెలిపి మీ సత్తాను చాటాలని, సిద్ధిపేట మున్సిపాలిటీకి విక్టరీ క్రియేట్ చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని రెడ్డి సంక్షేమ సంఘ భవన్ లో శుక్రవారం మధ్యాహ్నం పట్టణ సోషల్ మీడియా వారియర్స్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు.
- రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు కామెంట్స్ :
- సోషల్ మీడియా వారియర్స్ క్రియాశీలకంగా వ్యవహరించాలని యువతకు పిలుపునిచ్చారు.
- సోషల్ మీడియా- అన్ సోషల్ మీడియాగా ప్రచారం చేస్తూ.., ఒక అబద్ధాన్ని పదే పదే చెబుతూ గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారు.
- దుబ్బాక ఎన్నికలప్పుడు వచ్చి ఎడ్చారనే అంశంపై వివరిస్తూ.. రాజకీయ లబ్ది పొందేలా విషం చిమ్మే ప్రయత్నం చేశారని వెల్లడించారు.
- సిద్ధిపేటలో జరిగిన అభివృద్ధి అక్కడ లేదని బండి సంజయ్, ఉత్తమ్ ఇతర రాజకీయ నాయకులు.. ఏం ముఖం పెట్టుకుని సిద్ధిపేటలో ఓటు అడుగుతారని ప్రశ్నించాలని సోషల్ మీడియా యువతకు అవగాహన కల్పించారు.
- అభివృద్ధికి చిరునామా సిద్ధిపేట, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ సిద్ధిపేటగా.. అభివృద్ధి అంటే ప్రజల అవసరాలు, ఆరోగ్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు.. ఇలా అన్నీ సిద్ధిపేటకు తెచ్చుకున్నాం.
- ఇంటిగ్రేటెడ్ మార్కెట్, రైతు బజారు, పట్టణంలో ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విద్య, వైద్యం అన్నింటా ముందున్నాం.
- లక్ష 50 వేల జనాభా ఉన్న పట్టణంలో యూజీడీ- అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ మన సిద్ధిపేట పట్టణంలోనే ఉన్నదని చెప్పారు.
- ఇర్కోడ్, పుల్లూరు, రంగీలాదాబా, రామంచ వరకూ పట్టణాన్ని ఆనుకుని ఉన్న రహదారులన్నీ 10 కిలో మీటర్ల రేడియల్ లో నాలుగు లేన్ల రహదారులుగా మార్చుకుంటున్నాం.
- సిద్ధిపేట -దుద్దేడ దగ్గర రూ. 40 ఐటీ టవర్, త్రీ స్టార్ హోటల్, 250 హెక్టార్లలో ఆక్సిజన్ పార్కు ఏర్పాటు చేసుకున్నాం. ఇలా పుట్టుక నుంచి చావు దాక అన్నీ రకాలుగా శ్రీరాముల కుంటను అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాం.
- కార్పోరేట్ ఆసుపత్రి తరహాలో సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రిని తీర్చిదిద్దినట్లు వెల్లడించారు.
- సకల సౌకర్యాలతో.. రెండు నైట్ షెల్టర్లు నిర్మాణం చేసుకున్నాం. ఓపెన్ ఏయిర్ ఆడిటోరియం నిర్మాణం చేసుకున్నాం.
- ఇండియాలోనే ఏక్కడా లేని విధంగా గ్లో గార్డెన్ ను మరో రెండు రోజుల్లో ప్రారంభిస్తాం.