సంగీత త్రిమూర్తులలో మూడవ వాడైన శ్యామశాస్త్రి (ఏప్రిల్ 26, 1763 – ఫిబ్రవరి 6, 1827) ప్రసిద్ధ కర్ణాటక సంగీత విద్వాంసులు. దాక్షిణాత్య కర్ణాటక సంగీత రత్న త్రయంలో వయసురీత్యా పెద్దవారు శ్యామశాస్త్రి (క్రీ. శ. 1763 -1827). శ్యామ శాస్త్రి కన్నా త్యాగరాజు కొద్దిగా చిన్నవారు (క్రీ.శ.1767 -1847). వీరు ఇరువురి కన్నా చిన్నవారు ముత్తుస్వామి దీక్షితులు (క్రీ. శ. 1776-1835). శ్యామశాస్త్రి తండ్రి విశ్వనాథ శాస్త్రి. ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని గిద్దలూరుకు సమీపంలోగల కంభం ప్రాంతీయు లు. మహమ్మదీయుల దండయాత్ర లకు బెదిరి వారి కుటుంబీకులు 17వ శతాబ్దంలో తమిళనాడుకు వలస వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. శ్యామశాస్త్రి అసలు పేరు వేంకట సుబ్రహ్మణ్యము. అయితే, చిన్న తనంలో ముద్దుపేరుగా శ్యామకృష్ణ గా పిలుస్తూ, ఆ పేరే చివరకు వ్యవ హరికంలో సార్ధకమైందని ఆయన శిష్యులు పేర్కొంటారు. పుత్రుడు కలుగునని” చెప్పినట్లే ఇతనితల్లి గర్భవతిఅయి క్రీ.శ1763లో చిత్ర భాను సంవత్సరంలో మేష రవి కృత్తికా నక్షత్రమునందు శ్రీనగరమ ను తిరువారూరిలో శ్యామశాస్త్రిలు జన్మించినట్లు పేర్కొంటారు.
తండ్రి విశ్వనాధ శాస్త్రి సంస్కృత, తెలుగు భాషలలొ పండితుడు కావడంతో, శ్యామశాస్త్రి చిన్న తనంలో తండ్రి దగ్గరే సంస్కృతాంధ్ర భాషలు అభ్యసించాడు. సంగీతం లో తన మేనమామ దగ్గర స్వరపరి చయం కల్గినా, ఆ పిదప తంజా వూరులో ‘సంగీత స్వామి’ అనబడే ప్రముఖ తెలుగు సంగీత విద్వాంసు ని దగ్గర, తంజావూరులోని రాజాస్థానంలో సంగీత విద్వాంసు డైన శ్రీ పచ్చిమిరియము ఆది అప్పయ్య సహకారంతో సంగీత శాస్త్రాలలో మర్మములు ఎన్నో అధ్యయనం చేశాడు. శ్యామ శాస్త్రి రచించిన అనేక కీర్తనలు ఉల్లాసం కలిగించేవి, చక్కని లయ, తాళ ప్రదర్శనలకు అనుగుణంగా ఉండేవి. నాదోపాసన ద్వారా ఆత్మా నందం సాధించ వచ్చని ఆయన అభిప్రాయ పడేవారు. శ్యామశాస్త్రి తెలుగు, తమిళ, సంస్కృత భాషల లో అనేక కృతులు, కీర్తనలు రచించినా అధికభాగం తెలుగులోనే వ్రాశారు. అయితే, త్యాగరాజు తన కీర్తననలో భావ రాగలకు అధిక ప్రాధాన్యత ఇవ్వగా, శ్యామశాస్త్రి కీర్తనలలో క్లిష్టమైన ‘తాళ’ రచన చేసినట్లు సంగీతాభిమానులు అంటారు. శ్యామశాస్త్రి కీర్తనలలో క్లిష్టమైన రచనతోపాటు, ఆయనకు శిష్యులు అధిక సంఖ్యలో లేక పోవడం వల్ల కూడా, ఈయన కీర్తనలు అధిక ప్రాచుర్యం పొంద లేదని వారు భావిస్తారు. శ్యామశాస్త్రి రచించిన “ప్రోవవ మ్మ” , “మాంజిరాగం” అలాగే ‘కల్లడ ’(కలగడ ), ‘చింతామణి ’ రాగాలు, “హిమాద్రిసుతీ ” అనే కీర్తన, ఒకే స్వరంతో సంస్కృతం,తెలుగు భాషలలొ వేరు వేరుగా రాసిన ఆయన కీర్తనలు సంగీత కళాకారు లందరికి సుపరిచతమే.. త్యాగరాజాదులచే కొనియాడ బడిన ఆయన లయ జ్ఞానము శ్లాఘనీయమైనది. ఆనంద భైరవి రాగమన్న ఆయనకు చాల యిష్ట మని చెప్తారు. ఆయన మదురైకు వెళ్లినపుడు మీనాక్షి దేవిని స్తుతిం చుచూ తొమ్మిది కృతులు (“నవరత్న మాలిక”) గానం చేశాడు.
శ్యామశాస్త్రి ప్రసిద్ధి చెందిన ఆనంద భైరవీ, ధన్యాసి, కల్గడ, కళ్యాణి, కాంభోజి, కాపి, చింతామణి వంటి రాగాల్లో కృతులు స్వర పరిచాడు. సంగీత పాఠాల్లో సరళీ స్వరాలు, జంట స్వరాలు, గీతాలు, స్వర జతులు, వర్ణాలు, కృతులు అనేవి ఒక పద్ధతిలో నేర్పుతారు. వీటిలో స్వరజతి రూపకర్త శ్యామశాస్త్రి. తోడి రాగంలో “రావే హిమగిరి కుమారి”, భైరవి రాగంలో ‘కామాక్షీ అనుదినము’వంటివి కొన్ని ప్రసిద్ధి జెందిన స్వరజతులు.
ఈ స్వర జతులే కాకుండా విలోమ చాపు తాళాన్ని కూడా శ్యామశాస్త్రి బహుళ ప్రాచుర్యం లోకి తెచ్చాడు. సాధారణంగా చాపు తాళం గతి 3 + 4 పద్ధతిలో ఉంటుంది. ఇలా కాకుండా 4 + 3 రీతిలో తాళ గతిని మార్చి కొన్ని కీర్తనలు స్వర పరిచా డు. పూర్వి కళ్యాణి రాగంలో ‘నిన్ను వినగ మరి’, ఫరజ్ రాగంలో ‘త్రిలోక మాత నన్ను’ అనేవి ఈ విలోమ చాపు తాళంలో ప్రసిద్ది చెందిన కీర్తనలు.
తంజావూరు జిల్లాలో తిరువా యూరులో ఉన్న కామాక్షి దేవాల య అర్చకత్వం చేసుకుంటూ, తన గాన కళా పాండిత్యంలో కామాక్షి అమ్మవారి సేవలో, ఆమె సన్ని ధానం లోనే ‘ శ్యామకృష్ణ’ అనే ముద్రతో అనేక కీర్తనలు, కృతులు రచించాడయన.
శ్యామశాస్త్రి ఇంటి ఇలవేల్పుగా కామాక్షిదేవిని కీర్తిస్తూ, తమ ఇంటి ‘ఆడపడుచుగా’ అమ్మవారిని భావిస్తూ – అపూర్వం, అనన్య సామాన్య కృతులెన్నింటినో శ్యామ శాస్త్రి రచించాడని ఆయన శిష్యులు, సంగీత కళారాధకులు పేర్కొంటారు. అందువల్లనే, శ్యామ శాస్త్రి తన కీర్తనలలో కొన్నింటిని “శ్యామకృష్ణ – సహోదరి” అని పేర్కొన్నట్లు వారు చెపుతారు.
శ్యామశాస్త్రి కుమారుడు సుబ్బరాయ శాస్త్రి కూడా ప్రముఖ వాగ్గేయకారిడిగా ప్రసిద్ది చెందాడు. శ్రీ అలసూరు కృష్ణయ్య , శ్రీ తలగం బాడి పంచనాదయ్య తదితరులు శ్యామశాస్త్రి శిష్యులలో ప్రముఖులు.