5.1 C
New York
Saturday, March 25, 2023
HomeEntertainmentMovie Updatesశ్రియా సరన్, శర్మాన్ జోషి ‘మ్యూజిక్ స్కూల్’ మూడో షెడ్యూల్ పూర్తి..

శ్రియా సరన్, శర్మాన్ జోషి ‘మ్యూజిక్ స్కూల్’ మూడో షెడ్యూల్ పూర్తి..

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

ఇళయరాజా సంగీత సారథ్యంలో రాబోతోన్న `మ్యూజిక్ స్కూల్` సినిమా మూడో షెడ్యూల్ పూర్తయింది. శర్మాన్ జోషి శ్రియా శర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ హైద్రాబాద్‌లో ప్రారంభమైంది. కరోనా థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ నిర్వహించారు. దీని కోసం సెపరేట్‌గా స్టూడియో, లొకేషన్లు అన్నింటిని కూడా శానిటైజ్ చేశారు. సెట్‌లో అందరూ కూడా భౌతిక దూరాన్ని పాటించారు. కొత్త వారికి కరోనా పరీక్షలు నిర్వహించేవారు. ప్రతీ వారం అందరికీ కరోనా పరీక్షలు చేయించారు.
ఇక సెట్‌లో ప్రతీరోజూ జనరల్ ఫిజీషియన్ అందుబాటులో ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ సినిమాను పూర్తి చేసి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని దర్శకుడు పాపరావు బియ్యాల ఎంతో కష్టపడి తెరకెక్కించారు. మేరీ డిక్రూజ్, మనోజ్ (శియా సరన్, శర్మాన్) పాత్రలు కళలు, సంగీతం, కల్చర్ విద్యల మీద ప్రభావం చూపించేలా ఉంటాయి.
దర్శకుడు పాపారావు బియ్యాల మాట్లాడుతూ..  ‘మ్యూజిక్ స్కూల్ సినిమా రెండో షెడ్యూల్ అద్భుతంగా జరిగింది. టీం అంతా కూడా ఎంతో ఎంజాయ్ చేశాం. ఇక ఈ మూడో షెడ్యూల్‌ను కొత్త ఏడాదిలో కొత్త ఎనర్జీతో ప్రారంభించాం. అదే సమయంలో అందరి రక్షణ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. ఎవరైతే అవసరమో వారినే సెట్ మీదకు రానిచ్చాం. ఇక శానిటైజేషన్ టీం మాత్రం ఈ షెడ్యూల్ జరిగినన్నీ రోజులు ఎంతో జాగ్రత్తగా అందరినీ చూసుకుంది’ అని  అన్నారు.
యామినీ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు రచయిత దర్శకుడు పాపా రావు బియ్యాల. హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు ఇళయరాజా సంగీత దర్శకుడు. కిరణ్ దియోహన్స్ కెమెరామెన్. 
ఈ చిత్రంలో శర్మాన్ జోషి, శ్రియా సరన్, షాన్, సుహాసిని ములై, ప్రకాష్ రాజ్, బెంజమిన్ గిలాని, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్ వర్మ, మోనా అంబెగోయెంకర్, గ్రేసీ గోస్వామి, ఒజు బరువా, బగ్స్ భార్గవ, మంగల భట్, ఫని ఎగ్గోటి, వక్వర్ షైక్ తదతరులు నటిస్తున్నారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments