5.1 C
New York
Wednesday, March 29, 2023
HomeLifestyleLife styleమిన్నంటిన భక్త్యావేశాలు

మిన్నంటిన భక్త్యావేశాలు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

దక్షిణకాశిగా, హరిహర క్షేత్రంగా, రాష్ట్రంలో మిగుల ప్రాచుర్యం పొందిన సనాతన సాంప్రదాయాల సిరియైన పవిత్ర గోదావరి నదీ తీరస తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో మహా శివ రాత్రి ఉత్సవ వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి. మున్నెన్నడూ లేని విధంగా, పర్వదిన సందర్భంగా మంగళ వారం సుదూర ప్రాంతాలనుండి ఏతెంచిన అశేష భక్తజన సందోహంతో, సనాతన క్షేత్రం అపర కైలాస పురియై అలరారింది. రాష్ట్రం లోని సుదూర ప్రాంతాలనుండి తరతరాల వారసత్వ ఆచరణలో భాగంగా, శ్రీరామలింగేశ్వర దర్శనార్ధం ప్రత్యేక ప్రయివేటు వాహనాలలో, సోమ వారం రాత్రి నుండే క్షేత్రానికి చేరుకున్న భక్తులు, యాత్రికులు మంగళ వారం ఉదయాత్పూర్వం నుండి పవిత్ర గోదావరిలో మంగళ స్నానాలు ఆచరించారు. శ్రీరామలింగే శ్వర, అక్కపెల్లి రాజేశ్వర, మార్కండేయ, గౌతమేశ్వ రాలయాలలో మరియు శివ పంచాయతనాల ముందు దైవదర్శనార్ధం బారులుతీరి వేచి ఉండి భక్తి శ్రద్ధలతో అభయంకరుడు, అభిషేక ప్రియుడైన శంకరునికి ప్రత్యేక పూజలొనరించారు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు స్థాపించిన రామలింగేశ్వరునికి ఉదయాత్పూర్వంనుండే మహన్యాస పూర్వక ఏకా దశ రుద్రాభిషేకం, సకృతావర్తన, సహస్ర నామార్చన, అష్టోత్తర, అన్న పూజాది ప్రత్యేక కార్యక్రమాలను విధివిదానంగా నిర్వహించారు. దేవస్థానం ఎసి, ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, దేవస్థానం వేద పండితులు బొజ్జా రమేశ్ శర్మ, ముత్యాల శర్మ, ఆలయ అర్చకులు దేవళ్ళ విశ్వనాథశర్మ, పాలెపు ప్రవీణ్ శర్మ, స్థానిక వేదపండితులచే శ్రీరామ లింగే శ్వరాలయంలో సామూహక రుద్రాభిషేకాలు, మంత్రపుష్ప నీరాజనాది అర్చనలు, విధివిధాన పూజలు గావించారు. అత్యధిక సంఖ్యలో ముత్తయి దువలు శివాలయంలో ప్రత్యేక చండి ప్రదక్షిణలు ఆచరించారు. మండలంలో పలు గ్రామాలలో ఉత్స వాలు నిర్వహించిన కారణంగా, తగిన సంఖ్యలో లేక, పోలీసుల సహకారం కొరవడి, ఒకదశలో రద్దీ క్రమబద్ధీకరణ దేవస్థానం సిబ్బందికి తలకుమించిన భారంగా మారింది. క్షేత్ర సమీపస్థ అక్కపెల్లి రాజేశ్వర స్వామి ఆలయంలో దేవస్థానంలో అర్చకులు ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేద పండితుల ఆధ్వర్యంలో, ప్రత్యేక పూజాది క్రతువులు నిర్వ హించారు. పండితులు శివ మహాత్మ్యలను వివరిం చారు. రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, ధర్మపురి మున్సిపల్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సంగి సత్తమ్మ, రామయ్య, ఎంపీపీ చిట్టిబాబు, వైస్ ఎంపీపీ మహిపాల్, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శ్యాంసుందర్, ధర్మపురి దేవస్థానం మాజీ చైర్మన్లు దినేశ్ శర్మ, అక్కనపెల్లి రాజేందర్, అక్కపెల్లి మాజీ చైర్మన్ రాపర్తి నర్సయ్య, సుధవేని నర్సాగౌడ్, గంగారాం, ఆనంద్, శ్యామ్ సుందర్, నాయకులు తదితరులు ప్రత్యేక పూజాదులలో పాల్గొన్నారు. స్థానిక పురపాలక సంఘం చైర్ పర్సన్ సత్తమ్మ, వైస్ రామయ్య, కౌన్సిలర్లు, కమిషనర్, మేనేజర్ ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీటి, విద్యుత్ సౌక ర్యాలు ఏర్పాటు చేయగా, ఆర్యవైశ్య, వర్తక సంఘం అధ్యక్షులు మురికి శ్రీనివాస్, చౌడారపు సతీష్, జక్కు రవీందర్, రాజేందర్, శంకరయ్యల నేతృత్వంలో, మున్సిపల్ కార్యాలయ నంది విగ్రహ కూడలి నుండి రాజేశ్వరాలయానికి వాహనాలను ఉచితంగా ఏర్పాటు చేసి, ప్రయాణ సౌకర్యాలు కల్పించి, ప్రశంసాపాత్రులైనారు. గోదావరీ తీరస్థ మార్కండేయ మందిరాన పద్మశాలి సేవాసంఘం ఆధ్వర్యంలో బిల్వపత్ర, ప్రత్యేక పూజలొనరించారు. ఊహించని రద్దీ పెరిగి, దేవాలయ రోడు భక్తులతో నిండి, పోలీసుల కొరతతో రద్దీ క్రమబద్ధీకరణ కష్ట సాధ్యమైంది. ధర్మపురి సిఐ కోటేశ్వర్, ఎస్ఐ కిరణ్, సిబ్బంది బందోబస్తు చర్యలు చేపట్టారు.

అపర కైలాస పురియై అలరారిన ధర్మపురి

దక్షిణ కాశిగా, హరిహర క్షేత్రంగా, నవనారసింహ క్షేత్రాలలో నొకటిగా, గంభీర గౌతమీ తటమున వెలసి, వరదాయిగా, భక్తి ముక్తి ప్రదాయినిగా, నిత్య భక్తజన సందడితో అలరారుతున్న ధర్మపురి క్షేత్రం, శివరాత్రి ఉత్సవ వేడుకల సందర్భంగా, అపర కైలాస పురియై అలరారింది. రాష్ట్రంలోని మారుమూలల నుండేగాక, రాష్టేతర సుదూర ప్రాంతాల నుండి సనాతన వారసత్వ ఆచారంలో భాగంగా దైవ దర్శ నాభిలాషులై ఏతెంచిన భక్తజన బృందగానాలు, భగ వన్నామ స్మరణలు, జయజయధ్వనాలు, మంగళవా ద్యాలు, విధివిధాన వేదోక్త పూజలు, భక్తి సంగీతాలు మమేకమై క్షేత్రంలో భక్తి పారవశ్యం అంబరాన్ని చుంబించింది. పిల్లాపాపలతో, నెత్తిన మూటాముల్లె లతో, పవిత్ర గోదావరి స్నానాలాచరించి, దర్శనాలు చేసుకుని, తమ మొక్కులు చెల్లించడానికి ఒక రోజు ముందు రాత్రినుండే ఏతెంచిన భక్తుల, యాత్రికులతో శుక్రవారం ప్రాచీన క్షేత్రం అశేష జన సంద్రమైంది. సెలవు దినాన్ని పురస్కరింకుని క్షేత్రానికి అరుదెంచిన భక్తుల వెల్లువ పుష్కరాల సమయాన్ని తలపించింది. ప్రధాన రహదారి నిండి పోయి రాక పోకలు స్థంభించిన వేళ, క్యూలైన్లను శివాలయం వైపుకు మళ్ళించే చర్యలు చేపట్టడం శక్తికి మించిన భారమైంది. రద్దీని క్రమబద్ధీకరించడంలో తీవ్ర వైఫల్యం నెలకొంది.

వివిధ ఆలయాలలో శివరాత్రి వేడుకలు

ధర్మపురి క్షేత్రంలోగల పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న శ్రీరామ లింగేశ్వరాలయం, క్షేత్రస్థ మార్కండేయ మందిరం. శివారులోగల అక్కపెల్లి రాజేశ్వరాలయంలతోపాటు మహా శివరాత్రి సందర్భంగా మండలం లోని వివిధ ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రామలింగేశ్వరాలయంలో, ఉదయం 6గంట లనుండి సాయంత్రం 6గంటల వరకు భక్తుల అభిషేకం, రాత్రి 10 గంటల వరకు మహా లింగార్చన, మహన్యాస పూర్వక రుద్రాభిషేకాది పూజలు సాంప్ర దాయరీతిలో వేదపండితులచే నిశిపూజలు దేవ స్థానం ఎసి,ఈఓ శ్రీనివాస్, నేతృత్వంలో నిర్వహించారు. ధర్మపురి క్షేత్ర సమీపస్థ శ్రీఅక్కపెల్లి రాజేశ్వర దేవస్థానంలో, శివరాత్రి సందర్భంగా వేదోక్త రీతిలో ఉదయం 9గంటలకు వేద పండితులు మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, మద్యాహ్నం 12 గంటలకు మహామృత్యుంజయ జపం, సాయంత్రం 6గంటలకు శివకళ్యాణం, రాత్రి 9 గంటలకు భజనలు నిర్వహించారు. మార్కండేయ మందిరంలో క్షీరాభిషేకం, బిల్వపత్రాది ప్రత్యేక పూజలు పద్మశాలి సేవాసంఘం ఆధ్వర్యంలో జరిపారు. మండలంలోని నేరేళ్ళగ్రామ సమీపాన చట్టమైన అటనీ క్షేత్రంలోగల సాంబశివుని దేవాలయంలో శివరాత్రి సందర్భంగా వేదవిదులు భక్తజన సమక్షంలో రుద్రాభిషేకం అనంతరం కల్యాణం జరిపించారు. ప్రత్యేక కార్యక్ర మాలు నిర్వహించారు. అలాగే నేరేళ్ళ గ్రామంలోని రాజరాజేశ్వరాలయంలో పూజలు గావించారు. జైనాలో రుద్రాభిషేకాలు నిర్వహించారు.

వివిధ ఆలయాలలో మంత్రి ఈశ్వర్ పూజలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, ధర్మపురి నియోజకవర్గంలోని పలు శివాలయాలను రాష్ట్ర మంత్రి, ధర్మపురి శాసనసభ్యుడు చొప్పుల ఈశ్వర్ సందర్శించారు. ధర్మపురి నియో జకవర్గంలోని పలు గ్రామాలలో శివాలయాలలో పూజలలో పాల్గొన్న అనంతరం ధర్మపురికి విచ్చేసి, ప్రధానంగా అత్యంత ప్రాచీనమైన, మహి మాన్వితమైన అక్కపెల్లి రాజేశ్వరాలయంలో ఆయన ప్రత్యేక పర్వదిన పూజోత్సవాలలో పాల్గొన్నారు. ఆర్చకులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు మంత్రికి సాంప్రదాయ స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఘనంగా సత్కరించారు. అనంతరం నేరేళ్ళ సాంబశివాలయంలో పూజలు నిర్వహిం చారు.

దేవస్థానం పక్షాన పట్టువస్త్రాల సమర్పణ

ధర్మపురి క్షేత్రస్థ శ్రీరామలింగేశ్వరాలయంలో శివ రాత్రి సందర్భంగా నిర్వహించిన శివపార్వతుల కళ్యాణానికి దేవస్థానం పక్షాన ఈఓ సంకటాల శ్రీని వాస్ పట్టువస్త్రాలు సమర్పించారు. దేవస్థానం ఉప ప్రధానార్చకులు శ్రీనివాసాచార్య ముఖ్య ఆర్చకులు శ్రీనివాసాచార్య సూపరింటెండెంట్ కిరణ్, అలువాల శ్రీనివాస్ సిబ్బంది మేళతాళాలతో వెళ్ళి, ఆర్చక పురోహితులు ప్రవీణ్, విశ్వనాథ శర్మలకు పట్టు వస్త్రాలు అంద జేశారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments