ఎల్ ఎం కొప్పుల స్వచ్ఛంద సామాజిక దేవా సంస్థ అధ్వర్యంలో ధర్మపురి క్షేత్రంలో అయిదు రోజుల పాటు నిర్వహిస్తున్న ఉగాది సంబరాలు, సత్కారాల ప్రారంభ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి ప్రముఖ మి కళాకారుడు, సినీ నటుడు శివారెడ్డి చేసిన ధ్వన్యనుకరణ కార్యక్రమం అలరించింది.

ఆద్యంతం నవ్వుల పువ్వులను పూయించింది. చిన జీయర్ స్వామి తో .ప్రారంభించి, కేసిఆర్, జగన్, వై యస్ ఆర్, రోశయ్య, వి.హమ్మంత రావు. లాంటి నేతలు… ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, చిరంజీవి, కృష్ణం రాజు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రావు గోపాల్ రావు, జయప్రకాష్ రెడ్డి, బాబూ మోహన్, వేణుమాధవ్, పోల్సాని, ఎం ఎస్ నారాయణ లాంటి సినీ ప్రముఖులతో పాటు, చాగంటి కోటేశ్వరరావు తదితరుల గొంతులను అనుకరించి ప్రశంసలను అందుకున్నారు. ప్రధానంగా అరుంధతి చిత్రం లో బొమ్మాళి సంబంధిత డైలాగ్ ఒక్కక్క నటుడు, రాజకీయ నాయకుడు చెపితే ఎలా ఉంటుందో, వారి వారి గొంతులను అనుకరించి శభాష్ అని పించుకున్నారు.

ముఖ్యంగా ప్రేక్షకుల కరతాళ ధ్వనులే తనను ఇంతవాన్ని చేశాయని, చప్పట్లు ఓట్ల కన్నా శక్తివంతం మైనవని, కళాకారులకు కావలసింది చప్పట్లే నని పదే పడే నొక్కి చెప్పారు. ట్రస్టు పక్షాన మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయన సతీమణి స్నేహాలత దంపతులు, ముఖ్య అతిథి పెద్ద పెల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధులు శివారెడ్డిని ఘనంగా సత్కరించారు.
