5.1 C
New York
Saturday, March 25, 2023
HomeEntertainmentMovie Updatesఫిబ్రవరి 10న శర్వానంద్, రష్మిక మందన్నా, తిరుమల కిషోర్, ఎస్ఎల్‌వీసీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టీజర్

ఫిబ్రవరి 10న శర్వానంద్, రష్మిక మందన్నా, తిరుమల కిషోర్, ఎస్ఎల్‌వీసీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ టీజర్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆడవాళ్లు మీకు జోహార్లు. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. కేవలం పోస్టర్లు, ఒక పాటతోనే సినిమా మీద అంచనాలు పెంచేశారు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అవ్వడంతోనే ఇంత మంచి రెస్పాన్స్ వస్తోంది.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌‌గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఆలపించిన టైటిల్ సాంగ్‌ను ఈ మధ్యే విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. ఫిబ్రవరి 10న టీజర్ విడుదల చేయబోతోన్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో శర్వానంద్, రష్మిక మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి చూపించారు.

కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

మంచి అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు.  సుజిత్ సారంగ్ ఈ చిత్రానికి కెమెరామెన్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

ఈ చిత్రం ఫిబ్రవరి 25న థియేటర్లోకి రానుంది.

నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు

సాంకేతిక బృందం
దర్శకత్వం: తిరుమల కిషోర్
నిర్మాత : సుధాకర్ చెరుకూరి
బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్
సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్
సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
కొరియోగ్రఫర్: దినేష్
పీఆర్వో: వంశీ-శేఖర్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments