5.1 C
New York
Tuesday, March 21, 2023
Homespecial Editionతెలుగు వారికి హస్త భూషణం శంకర నారాయణ నిఘంటువు

తెలుగు వారికి హస్త భూషణం శంకర నారాయణ నిఘంటువు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య సాధనే ఏకైక లక్ష్యంగా, అఖండ భారతావనిలో అడుగిడిన శ్వేత జాతీయులు, మొదటగా ప్రారంభించింది వ్యాపారమే. అయితే ముందు వ్యాపారం చేయడానికి, అనంతరం అధికారం చెలాయించడానికి. ఇక్కడి భాషలు రావు. స్థానికలకు భాష వారికి అర్ధమయ్యేది కాదు, అలాగే వారి భాష ఈ దేశస్తులకు బోధపడేది కాదు. వ్యాపారం, పరిపాలన అవసరాల దృష్ట్యా, ఆంగ్ల అధికారులు మెలమెల్లగా స్థానికుల భాషల పదాలను తమ భాషలోని తర్జుమా చేసుకోవడం ప్రారంభించారు. ఈ క్రమం లోనే తెలుగు పదాలను అర్థం చేసుకుంటూ, తర్జుమా చేసుకున్నారు. తద్వారా నిఘంటువులు తయారు చేశారు. అలా1818లో విలియం బ్రౌన్ తొలి తెలుగు – ఇంగ్లీషు నిఘంటువు తయారు చేశాడు. జాన్ కార్నిక్ మారిస్ అనే వ్యక్తి ఇంగ్లీషు తెలుగు నిఘంటువు తయారు చేశాడు. 1821లో క్యాంప్ బెల్ ఇలాంటిదే ఇంకో నిఘంటువు తయారు చేశాడు. తరువాత సీ.పీ. బ్రౌన్ దొర ఇంకో నిఘంటువు 1852 లో (ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి సరిగ్గా అయిదేళ్ల ముందు) తయారు చేశాడు. చాలా మంది తెల్ల అధికారులు ద్విభాషలను తెలిసిన వారినే పెట్టుకున్నారు.
అయితే అందరికీ రెండు భాషల్లో అంత ప్రావీణ్యం ఉండక పోవడం సహజమే. వారి అనువాదం అంత కచ్చితంగా ఉండేది కాదు. ఈ సమస్యను సాధ్యమైన రీతిలో అధిగమించడానికి ఆచార్య పాలూరి శంకరనారాయణ విశేష కృషి చేశారు. తొలి ఇంగ్లీష్, తెలుగు నిఘంటువును రూపొందించాడు. ఆచార్య పాలూరి శంకరనారాయణ భాషావేత్త, నైఘంటికుడు, సంస్కృతాంధ్ర పండితుడు, రాయల్ ఏషియాటిక్ సొసైటీ సభ్యుడు. శ్రీకాకుళంలో జన్మించి, మున్సిపల్ హైస్కూల్ లో చదివి, అక్కడే కొంతకాలం ఉపాధ్యాయునిగా పని చేశారు. తర్వాత మద్రాసులో ప్రెసిడెన్సీ కళాశాలలో గణిత శాస్త్ర ఆచార్యుని గా, మద్రాసు విశ్వవిద్యాలయంలో ప్రధాన పరీక్షల అధికారిగా కూడా పని చేశాడు. కొచ్చిన్ యువ రాజులు, యుక్తవయసులో ఉన్న పిఠాపురం రాజా వంటి వారికి విద్యాబోధన చేశాడు. శంకర నారాయణ రచించిన తెలుగు – ఇంగ్లీషు, తమిళం-ఇంగ్లీషు నిఘంటువు చాలా ప్రసిద్ధి చెందినది. శంకర నారాయణగా పేరొందిన ఆయన పూర్తిపేరు పాలూరి శంకరనారాయణ శ్రేష్ఠి. ఆయన
తయారు చేసిన తొలి ఇంగ్లీషు తెలుగు నిఘంటువు పేరే శంకర నారాయణ నిఘంటువు.

తన జీవిత కాలంలో ఆయన తమిళనాడు రాజధాని మద్రాసు, ఒరిస్సాలోని గంజాం, జయపురం, మన రాష్ట్రంలోని విజయనగరం, పిఠాపురం, నూజివీడు, నెల్లూరు, కేరళలోని కొచ్చి లను సందర్శించాడు. రాచబిడ్డలకు చదువులు చెబుతున్నప్పుడే ఆయన వారి సౌలభ్యం కోసం ఇంగ్లీషు పదాలు, వాటి తెలుగు అర్థాల జాబితాను తయారు చేశాడు. తరువాత దాన్నే వ్యవస్థీకరించి, ఇంగ్లీషు తెలుగు నిఘంటువుని తయారు చేశాడు. అంతే కాదు, ఆయన తమిళ – ఇంగ్లీషు, ఇంగ్లీషు – తమిళ నిఘంటువులను కూడా తయారు చేశాడు. 1900 ప్రాంతంలో తెలుగు – ఇంగ్లీషు నిఘంటువు కూడా తయారు చేశాడు. ఆయన తయారుచేసిన తెలుగు నిఘంటువు 1897లో ప్రచురితమైంది. ఆయన బతికుండగానే అయిదు ముద్రణలకు నోచుకుంది. ప్రతి ముద్రణకీ కొత్త పదాలను కలిపారు. ఆయన 1924-25 ప్రాంతంలో చని పోయాడు. ఆ తరువాత 1927 లో గిడుగు సీతాపతి, 1951 లో చిలుకూరి నారాయణ రావు, తరువాత వేదం లక్ష్మీనారాయణ కొత్తకొత్త పదాలను జోడించారు. 1953 లో నారాయణ అయ్యర్ దీనిని పరిష్కరించారు. ఇలా 1897 నుంచి 1953 వరకూ పదకొండు సార్లు పునర్ముద్రణ పొందింది ఈ నిఘంటువు. ఇప్పటికీ ఈ నిఘంటువుయే చాలా చోట్ల ప్రామాణికం. తరతరాల విద్యార్థులకు ఇది హస్త భూషణంగా నిలిచింది. 2004 అక్టోబరులో విజయవాడకు చెందిన విక్టరీ పబ్లిషర్స్ దీన్ని మళ్లీ ముద్రించారు. ఆగస్టు 2005 నాటికి మలి ముద్రణ అవసరమైంది. మళ్లీ 2006, 2007లలో పునర్ముద్రించాల్సి వచ్చింది. కోస్తా, తమిళనాడుల్లో ఆంగ్ల భాష నేర్చు కోవడంలో ఆయన పాత్ర అనన్య సామాన్యం. ఆయన పేరుతోనే ఆయన వ్రాసిన నిఘంటువు పేరొందింది. ఇప్పటికీ శంకరనారాయణ నిఘంటువు అంటే ప్రామాణికమే. ఎస్.రామానుజం చెట్టియార్ ప్రోత్సాహంతో రూపొందిన ఈ తెలుగు – ఇంగ్లీషు నిఘంటువు మొదటి సారిగా 1900 సంవత్సరంలో మద్రాసు నుండి ప్రచురించ బడింది. తరువాతి కాలంలో అంటే 1927 వరకు చివరి సారిగా ముద్రించారు. దీనిని వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రులు 1953లో తిరిగి ముద్రించ తల పెట్టగా, ఎస్.నారాయణ అయ్యం గార్, వేదం లక్ష్మీ నారాయణ శాస్త్రి అశేష కృషి చేశారు. అలా సదరు సమగ్ర ప్రచురణ 31 జనవరి, 1953లో ప్రచురించ బడింది. ఇది
“ఆసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్” వారు 2003 సంవత్సరంలో మద్రాసు, న్యూఢిల్లీ నుండి ప్రచురించ బడింది.

రామ కిష్టయ్య సంగన భట్ల.... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల…. 9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments