Saturday, November 26, 2022
Homespecial Editionబంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహరాజ్

బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్‌ మహరాజ్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

సంత్ సేవాలాల్ మహారాజ్‌ను లంబాడీలు దేవుడిగా భావించి కొలుస్తారు. ఆయన జ‌యంతిని పండుగలా జ‌రుపు కొంటారు. గిరిజ‌ నుల‌కు చైతన్యం కలిగించి, వారికి ద‌శ‌ – దిశ‌ను చూపి, హైందవ ధ‌ర్మం గొప్ప‌ద‌నం, విశిష్ట‌తల‌ను తెలియ‌ జేయడానికే సేవాలాల్ మ‌హారాజ్ జ‌న్మించారని పేర్కొంటారు.

బంజారా జాతి ఔన్నత్యాన్ని ప్ర‌పం చానికి చాటేలా అహింసా సిద్ధాం తానికి పునాదులు వేసి, సంత్ ‌సేవాలాల్ ఇత‌ర కులాల వారికి కూడా ఆదర్శ మూర్తిగా నిలిచారు.
1739 ఫిబ్ర‌వ‌రి 15న అనంత‌పురం జిల్లా రాంజీనాయ‌క్ తండాలో సేవాలాల్ మ‌హారాజ్‌ జన్మించారు. జ‌గ‌దాంబ మాత‌నే త‌న మార్గ‌ ద‌ర్శకురాలిగా, గురువుగా స్వీక‌రిం చి ఆమె ఆదేశానుసారం బంజారాల సేవ‌లో నిమగ్న ‌మ‌య్యారు. సేవా లాల్ ప్ర‌జ‌ల మూఢ విశ్వాస‌మైన జంతుబ‌లికి తీవ్ర వ్యతిరేకి. బంజా రాలు రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వ‌ర‌కు వివిధ రాజ్యాల‌కు అవ‌స‌రమైన యుద్ధ సామాగ్రిని చేర‌వేస్తూ సంచార జీవ‌నం సాగిస్తుండే వారు. రాజుల కాలం నుం చి బ్రిటిష్‌ కాలం వరకు బంజారాలు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగించే వారు. ఆ క్రమంలో బ్రిటిష్‌, ముస్లిం పాలకుల మత ప్రచారంతో బంజా రా సమాజం అనేక ఇబ్బందులకు గురయ్యింది. అలాంటి పరిస్థితుల లో బంజారాలను మంచి మార్గంలో నడిపించడానికి సేవాలాల్‌ అవత రించారని చెపుతారు.సాతీ భవానీ (సప్త మాతృకల)’ పూజా విధానా లు ఆచరించే బంజారాల జాతికి ఆయనే దార్శనికుడు. ఆయన బోధనల ద్వారా బంజారా జాతి నడచుకుంది. లిపిలేని బంజారాల భాషను ఒక పద్ధతిగా మార్చాడు.

సేవాలాల్ శివ పూజారి. ఆయ‌న తండ్రి, తాత‌లు తెగ పెద్ద‌లు. తొమ్మిది రోజుల పాటు పెళ్లికాని యువతులు తీజ్ ఉత్స‌వాల్లో పాల్గొని త‌మ‌కు వివాహం కావాల‌ని పూజ‌లు చేయడం తీజ్ ఉత్సవ సాంప్రదాయం.

సంత్ సేవాలాల్‌ మహారాజ్ ప్ర‌జ‌ల కోసం చేసిన ఉద్య‌మాలలో ధ‌ర్మ ప్ర‌చారం, ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు, మ‌త మార్పిడులను అరికట్ట‌డం వంటివి ఉన్నాయి. స‌న్మార్గంలో తన జాతిని న‌డిపించి భార‌త దేశంలోని దాదాపు 10 కోట్లకు పైగా బంజారా లకు ఆరాధ్య దైవంగా ఆయన నిలిచారు.

సేవాలాల్‌ మహరాజ్‌ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీరిలో ‘పెరిఫర్‌’ ఒకటి. ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడం, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం మొదలైనవి ముఖ్యమైనవి. అహింస మహా పాపమని, మద్యం, ధూమ పానం శాపమని హితవు పలికాడు. ఆ రోజుల్లో నే బంజారాల పరువు ప్రతిష్టల గురించి ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేశాడు.

సంత్‌ సేవాలాల్‌ మహరాజ్‌ మహి మలు అద్భుతమైనవిగా చెప్పు కుంటారు. మహిమల గురించి అనేక కథనాలు ఉన్నాయి. వాటిలో పురుషున్ని స్త్రీగా మార్చడం, ఒక ముంత బియ్యంతో 10,000 మందికి భోజనాలు పెట్టడం, చనిపోయిన వ్యక్తిని మూడు దినాల తరువాత బ్రతికించడం, విషం కలిపిన తీపి వంటకాలను నిర్వీర్యం చేయడం. ఉదృతంగా పారే ప్రవాహాన్ని ఆపి తమ తండా ప్రజలను, ఆవులను దాటించడం లాంటి మహిమలను ప్రదర్శించారని చెపుతారు.
బంజారాలు ఎవ‌రికీ హాని త‌ల‌పెట్టేవారు కాద‌ని, స‌హాయ గుణం విరివిగా క‌ల‌వార‌ని, ధైర్య‌ సాహ‌సాల‌కు ప్ర‌తీకలనీ చ‌రిత్ర ద్వారా స్పష్టం అవుతున్నది. బంజా రాలు రాజపుత్రుల వలె ధృఢ కాయు లని, చరిత్ర కారుడు క‌ల్న‌ల్‌ టాడ్ పేర్కొన్నాడు. మధ్య యుగంలో మ‌హ‌మ్మ‌ద్‌ ఘోరీకి వ్య‌తిరేకంగా పృథ్వీరాజ్ చౌహాన్ సైన్యంలో బంజారాలు వీరోచితంగా పోరాడి నట్లు చరిత్ర చెపుతున్నది. ద‌క్క‌న్‌ పీఠ‌భూమిలో లంబాడీలు కాక‌తీయుల కంటే ముందే ఉన్నా ర‌ని, సంచార జాతివారైనా వీరు రజాకార్ల‌తో పోరాడార‌ని, నవాబు లు వారి ధైర్య‌సాహసాల‌కు మెచ్చి భూముల‌ను ఇనాములుగా ఇచ్చా రని గ్రంథస్థం అయి ఉంది. సభ్య సమాజానికి బహు దూరంగా, అడవి తల్లి ఒడిలో ఉంటూ, అటవీ వనరులపై ఆధార పడుతూ, ప్రత్యేక జీవన విధానం కలిగి ఉన్న, అంతగా అభివృద్ధి చెందని తెగల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు ప్రణాళికా బద్ధ కార్యక్ర మాలు అమలు చేస్తున్నా, ఇంకా చేయాల్సిన అవసరం అనివార్యం గా ఉంది. త‌ర‌త‌రాలుగా జాతి వివ‌క్ష‌కు గుర‌వుతూ ఆర్థిక, సామాజిక‌, రాజ‌కీయ అభివృద్ధిలో వెనుక‌బ‌డి ఉన్న లంబాడాలను అభివృద్ధి చేయాల్సిన అవసరముంది.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments