Thursday, December 8, 2022
HomeLifestyleLife styleతెలుగు సినిమా స్వర్ణయుగ రారాణి కృష్ణకుమారి

తెలుగు సినిమా స్వర్ణయుగ రారాణి కృష్ణకుమారి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండికృష్ణకుమారి (మార్చి 6, 1933 – జనవరి 24, 2018) పాత తరం సినిమా కథానాయిక. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 25 సంవత్సరాలకు పైగా 150 పై చిలుకు చిత్రాల్లో నటించింది. మూడు జాతీయ పురస్కారాలు, రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు అందుకున్నారు.

సావిత్రికి సమకాలీన నటి అయిన ఆమె షావుకారి జానకికి సొంత చెల్లెలు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్,, కృష్ణ,శివాజీ గణేశన్ వంటి దిగ్గజాలతో ఆమె అనేక సినిమాల్లో నటించారు.

పశ్చిమ బెంగాల్ లోని నైహతిలో ఓ తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో 1933లో జన్మించారు కృష్ణ కుమారి. వెంకోజి రావు-సచీ దేవి ఆమె తల్లిదండ్రులు. ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి వీరి స్వస్థలం.
వేదాంతం జగన్నాథ శర్మ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు.

ఒకసారి ఆమె తల్లితో సహా స్వప్నసుందరి సినిమా చూడడానికి వెళితే అక్కడకి సౌందరరాజన్ గారి అమ్మాయి భూమాదేవి కూడా వచ్చింది. సినిమా హాల్లో కృష్ణకుమారిని చూసిన ఆమె నవ్వితే నవరత్నాలు సినిమా కోసం అమాయకంగా కనిపించే కథానాయిక కోసం వెతుకుతున్నట్లు చెప్పారు. తర్వాత రోజే వారు కృష్ణకుమారి ఇంటికి వచ్చి తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆమెకు ఆ పాత్రనిచ్చారు.

అలా తెలుగు సినిమా తెరకు 1951లో నిర్మించిన నవ్వితే నవరత్నాలు సినిమా ద్వారా పరిచయం అయ్యారు. కానీ దానికంటే ముందు మంత్రదండం అనే సినిమా విడుదలైంది. తొలి చిత్రంలో నటిస్తుండగానే ఆమెకు 14 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. తర్వాత 1953లో తాతినేని ప్రకాశరావు యన్.ఎ.టి.వారి పిచ్చి పుల్లయ్యలో కథానాయిక వేషం వేయించారు. అందులో మంచి నటన ప్రదర్శించిన కృష్ణకుమారికి పినిశెట్టిగారి పల్లె పడుచు, బంగారు పాప వంటి మంచి చిత్రాలతో పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జానపద చిత్రాల కథానాయికగా, అభినయ రాజకుమారిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు నటి కృష్ణకుమారి. అసమాన నటనతో ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసిన ఆమె తెలుగు చిత్రసీమలో విలక్షణ నటిగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. తరువాత ఇలవేల్పు, జయ విజయ, అభిమానం, దేవాంతకుడు మొదలైన చిత్రాలలో వివిధ కథానాయకుల సరసన నటించినా, తన నటనకు గుర్తింపుతెచ్చిన చిత్రాలు కె.ప్రత్యగాత్మగారి భార్యాభర్తలు (1961),కులగోత్రాలు (1962).

1963లో లక్షాధికారి, బందిపోటు, ఎదురీత, కానిస్టేబుల్ కూతురు చిత్రాల్లో వైవిధ్యం ఉన్న పాత్రలు వేశారు. ప్రభుత్వ బహుమతి పొందిన జగపతీ పిక్చర్స్ వారి అంతస్థులులో నాయికగా నటించారు. 1967-68 మధ్య కాలంలో ఉమ్మడి కుటుంబం, భువన సుందరి కథ, రహస్యం, చిక్కడు దొరకడు, స్త్రీ జన్మ వంటి చిత్రాలలో వైవిధ్యమున్న పాత్రలు పోషించారు. వరకట్నంలో నాయికగా గ్లామరస్ పాత్ర తర్వాత చిత్రాలు తగ్గి 1970 దశాబ్దంలో కొన్ని చిత్రాలలో నటించ.గలిగారు.
సుమారు రెండు దశాబ్దాల నటజీవితంలో ఈమె సుమారు 150 సినిమాలలో నటించారు. వాటిలో ఎక్కువగా తెలుగు సినిమాలైతే, 15 కన్నడ చిత్రాలు, కొన్ని తమిళ భాషా చిత్రాలు. మూడు భాషల చిత్రాల్లోనూ ఆమే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఆమె ఆనాటి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, కాంతారావు, కృష్ణంరాజు, జగ్గయ్య, హరనాథ్, అందరు మహానటులతోను నటించి మెప్పించారు. కాంతారావుతో కలిసి 28 జానపద చిత్రాల్లో నటించారు.1963 లో కృష్ణకుమారి 16 సినిమాల్లో కథానాయికగా నటించారు. ఒక్క ఏడాదిలో అత్యధిక సినిమాల్లో కథానాయికగా నటించడంలో ఆమె రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. ఇందుకోసం ఆమె మూడు నెలలపాటు మూడు షిఫ్టులు ఖాళీ లేకుండా పనిచేశారు. బాలీవుడ్ లో కిశోర్ కుమార్ తో ఒకే ఒక సినిమాలో కథానాయికగా నటించారు. అప్పటికి హిందీ చిత్ర పరిశ్రమలో కృష్ణకుమారి పేరుతో వేరే నటి ఉండటంతో రతి అనే పేరుతో పరిచయం అయినారు.

వద్దంటే పెళ్లి, గంగా గౌరీ సంవాదం, సతీ సుకన్య, రమా సుందరి, జయవిజయ, పెళ్లి కానుక, దేవాంతకుడు, వినాయక చవితి, ఇరుగు పొరుగు, అగ్గిపిడుగు, మర్మయోగి, ఉమ్మడి కుటుంబం, లక్షాధికారి, బందిపోటు, బంగారు భూమి, గుణవంతుడు, జేబుదొంగ, యశోద కృష్ణ, దేవదాసు, నేరము శిక్ష, మానవుడు దానవుడు, భార్య బిడ్డలు, తల్లా పెళ్లామా, శ్రీకృష్ణావతారం, అంతస్తులు, గుడి గంటలు, డాక్టర్ చక్రవర్తి, చదువుకున్న అమ్మాయిలు ఎదురీత, కులగోత్రాలు, భార్యాభర్తలు, శభాష్‌రాజా, దీపావళితో పాటు పలు సినిమాలు ఆమె నటనా ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి.

ఇండియన్ ఎక్స్ ప్రెస్ మాజీ ఎడిటర్, స్క్రీన్ మేగజైన్ వ్యవస్థాపకులు, బిజినెస్ మాన్ అయిన కర్ణాటకకు చెందిన అజయ్ మోహన్ కైతాన్ ను కృష్ణ కుమారి పెళ్లి చేసుకున్నారు. ఆమెకు చిన్నప్పటి నుండి భానుమతి అంటే చాలా ఇష్టం. ఆమెతో కలిసి కులగోత్రాలు, పుణ్యవతి సినిమాల్లో నటించినప్పుడు ఎంతో థ్రిల్ ఫీలయ్యానని, మహానటి సావిత్రి తనను స్వంత చెల్లెల్లా చూసుకొనేదని చేపుతుండే వారు.


ఆమెకు మూడుసార్లు జాతీయ అవార్డులు, రాష్ట్రస్థాయిలో నంది అవార్డులు వచ్చాయి. ఆమె కాంచనమాల, సావిత్రి, ఎన్టీయార్ అవార్డులు గెలుచుకున్నారు. బ్రిటన్ లోని బర్మింగ్ హాం సంస్థ వారి లైఫ్ టైం అచీవ్‍ట్ అవార్డు పొందారు.

కృష్ణకుమారి 2018, జనవరి 24 ఉదయం బెంగుళూరులో
అనారోగ్యంతో మరణించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments