Wednesday, November 30, 2022
HomeLifestyleLife styleసామాజిక ఉద్యమ కారిణి సావిత్రి ఫూలే

సామాజిక ఉద్యమ కారిణి సావిత్రి ఫూలే

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి



మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా
నినదించినది సావిత్రిబాయి ఫూలే. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం సల్పిన అభ్యుదయ వాది ఆమె. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ మూర్తి. సమాజపు కట్టు బాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారత దేశపు మొట్ట మొదటి ఉపాధ్యాయు రాలుగా పాఠశాలలు ప్రారంభించిన ధీశాలి. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సమ న్యాయవాది. మహిళా శిరోముండ నానికి వ్యతిరేకంగా పోరాడిన సాంప్రదాయ వ్యతిరేకి. భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపిన సంస్కరణ వాది. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇదే.

సావిత్రి ఫూలే (3 జనవరి 1831 – 10 మార్చి 1897) గొప్ప సంఘ సంస్కర్త, నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించారు. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమాజంలోని కులతత్వం, పురుషాధిక్యత ధోరణులకు వ్యతిరేకంగా సమష్టిగా పోరాటం చేసారు. కలిగిన చాలామందికి ఆమె కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారత దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.


సావిత్రీ బాయి మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో 1831 జనవరి 3 న ఒక రైతు కుటుంబంలో జన్మించారు. ఆమె కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. బంధువులు నిజామాబాద్ జిల్లా లో బోధన్, నాందేడ్ కొండల్ వాడి ప్రాంతంలో , అదిలాబాద్ ప్రాంతపు చుట్టుపక్కల మున్నూరు కాపులు వారికి చుట్టాలు. ఆమె తన 9వ యేట 12 ఏళ్ళ జ్యోతిరావు ఫూలెను 1840లో వివాహ మాడారు. నిరక్షరాస్యురాలిగా ఉన్న ఆమెకు భర్త జ్యోతిరావు పూలే మొదటి గురువు. భర్త ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతు రాలైనారు. అహ్మద్ నగర్ లో ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848 లో భర్త జ్యోతిరావుతో కలిసి క్రింది కులాల బాలికల కోసం పూణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఆ పాఠశాల నడపటం ఉన్నత, అగ్రవర్ణాలకు నచ్చలేదు. దీంతో ఆమెపై వేధింపులకు, భౌతిక దాడులకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలాన్ని వాడటం వంటివి చేశారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చే వారు. ఎవరైనా అడిగినప్పుడు ధైర్యంగా “నా విధిని నేను నిర్వహిస్తున్నాను” అని చెప్పే వారు. ఆమె సాగించిన విద్యా ఉద్యమానికి తక్కువ సమయం లోనే సహకారం గుర్తింపు లభించాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటా యించాడు. కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. 1851లో మరో పాఠశాల ప్రారంభించారు. ఉపాధ్యాయురాలిగా
అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు లాంటి హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, సనాతన సంప్రదాయాలను, ఆధిపత్య వర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయు రాలుగా పాఠశాలలు ప్రారంభించి,12 మే 1848న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యను అందించారు. దళితుల, స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. ఆమె జీవిత కాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొనడమే కాక, 1849లో పూలే, సావిత్రీబాయి దంపతు గృహ బహిష్కారానికి గురి అయినారు.

సామాజిక విప్లవకారిణిగా
ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్య పరచడానికి 1852లో మహిళా సేవామండల్‌ పేరున మహిళా సంఘాన్ని కూడా స్థాపించింది. లింగ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచి వేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఆ సంస్థ కృషిచేసింది.

కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో సత్యాన్ని శోధించడానికి 1873 లో తన భర్త మహత్మా పూలేతో కలసి “సత్యశోధక్ సమాజ్ “ను ప్రారంభించి బాల్య వివాహలకు, మూఢ నమ్మకాలకు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా, వితంతువు పునఃర్వివాహల కొరకు అసమాన వ్యవస్థకు వ్యతి రేకంగా బలమైన ఉధ్యమం నడిపారు. బాల్యం లోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దేవదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు. యశ్వంత్ గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్య పరిచి వితంతువులకు శిరో ముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు. తరువాత 1873 సెప్టెంబరు 24న ‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, ఉద్యమాన్ని నడిపారు. ఆ సత్యసోధక్‌ సమాజ్‌ మహిళా విభాగం సావిత్రీబాయి నేతృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభ కార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యసోధక్‌ సమాజ్‌ ఆధ్వర్యన సావిత్రీబాయి వివాహం జరిపించారు.1868 నుంచి సావిత్రీబాయి అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870లో ఒకసారి 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడి నప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం. కరువు వాతపడిన కుటుంబాల లోని అనాధ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాఠశాల ల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించా రు. సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా పేరెన్నిక గన్నా రు. 1854లోనే ఆమె తన కవితా సంపుటి ‘కావ్యఫూలే’ను, మరో కవితా సంపుటి ‘పావన కాశీ సుభోధ్‌ రత్నాకర్‌’ను 1891లో ప్రచురించారు. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తక రూపంలో వచ్చాయి.

జ్యోతీరావు పూలే 1890 నవంబరు 28న మరణించడంతో సావిత్రీబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగి పోయి కూడా, దుఃఖంలోనుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇదే. ఫూలే మరణాంతరం సత్యసోధాక్ సమాజ్ భాద్యతను స్వీకరించి నడిపించారు. 1897 లో ప్లేగు వ్యాధి, పూణే నగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రీబాయి పూలే కొడుకు యశ్వంత్ తో కల్సి వ్యాధి గ్రస్తులకు సేవ చేసారు.

1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని దళితులు పేదలకు జోలెపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగువ్యాధి సోకిన పేదలకు దగ్గరుండి సేవలందించారు. 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించారు. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించారు. ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి కులాలకి చెందిన దళిత చిన్న పిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడారు. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకు సోకి మార్చి 10, 1897 లో మరణించారు. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్‌ అంత్యక్రియలు జరిపించాడు. సావిత్రి బాయి జయంతిని భారతదేశ “మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం”గా జరుపు కుంటారు. 1997లో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా స్టాంపును విడుదల చేసింది. పూణే విశ్వ విద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments