Thursday, December 8, 2022
Homespecial Editionసంప్రదాయ సంగీత సంపదను పరిరక్షించాలి

సంప్రదాయ సంగీత సంపదను పరిరక్షించాలి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి


ప్రాచీన ఆర్ష విద్యలకూ, సనాతన సాంప్రదాయాలకూ, అనాదిగా పట్టుకొమ్మగా నిలిచియున్న ధర్మపురి క్షేత్రంలో శాస్త్రీయ సంగీతాన్ని పరిరక్షించే గురుతర బాధ్యత ప్రతి ఒక్క సంగీతాభిమానిపై ఉందని సాహితీవేత్త, కవి పండితులు, విశ్రాంత ప్రాచార్యులు డాక్టర్ సంగన భట్ల నర్సయ్య అన్నారు. ధర్మపురి క్షేత్రంలో దేవస్థానం ఎసి,ఈఓ శ్రీని వాస్ ఆధ్వర్యంలో, శేషప్ప కళా వేదికపై స్థానిక నాట్యమండలి సౌజన్యంతో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న నాదబ్రహ్మ త్యాగరాజ ఆరాధనోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో, శనివారం డా.నర్సయ్య మాట్లాడుతూ, మహామహుల జీవితాలను ఆదర్శంగా గైకొని, అనుసరించడం అవసరమని అన్నారు. హిందూ ధర్మాన్ని, సంస్కృతిని కళాకారులే కాపాడు కోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. స్థానిక విద్వాంసులు తెలంగాణ త్యాగయ్య గా ప్రసిద్ధులు చాచం కిష్టయ్య గొప్పతనాన్ని ఆయన వివరించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు శ్యామ శాస్త్రి సంగీత రత్న బిరుదాంకితులు శ్రీమాన్ వైద్య నాథన్ బాల సుబ్రహ్మణ్యన్ సద్గురు త్యాగ రాజ జీవిత చరిత్ర, వాగ్గేయ విశేషాలను సోదాహరణంగా వివరించారు.
వాగ్గేయ కారుల సంగీత సంపద వేదాలవలె పరమ పవిత్రమైనదని, ఆమూల్య సంగీత సంపదను రక్షించడం భారతీయుల ధర్మమని అన్నారు. త్యాగరాజ ప్రతికృతి సంగీత, సాహిత్య ప్రతినిధులని, ఆయనకు సంగీతం సాహిత్యం పై గల పట్టును సోదాహరణంగా వివరించారు.

అంతకు ముందు సంగీత విద్వాంసులు సంగీతజ్ఞులు, కళాకారులు లక్ష్మీ సమేత నారసింహ త్యాగరాజు మరియు చాచం క్రిష్ణయ్యల చిత్రపటాలను చేతబూని, నరహరి శర్మ త్యాగ రాజ వేషధారికాగా, దేవస్థాన సంకీర్తనం నిర్వహించి, దేవస్థానంలోని శేషప్ప కళా వేదికపై దేవ స్థానం వేద పండితులు రమేశ శర్మ, సాంప్రదాయ విధివిధాన పూజలొ నరించారు.

దేవస్థానం ఈఓ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ సత్తమ్మ, దేవస్థాన అభివృద్ది కమిటీ అధ్యక్షుడు రామయ్య, సభ్యులు ఇనగంటి రామ, నరేశ్, మహేశ్, సురేశ్, సురేందర్, బొజ్జా రమేశ్, ప్రవీణ్ శర్మ, ముత్యాల శర్మ, నాట్య మండలి కార్యదర్శి, సంగీత రత్న కొరిడె నరహరిశర్మ, సంజీవ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, కళాకారులు వేణుగోపాల్, సుబ్రహ్మణ్య శర్మ, వేణుగోపాల్, వెంకటేష్, సురేష్, బొజ్జా శంకర్, రాంకిషన్, శేఖర్ పాల్గొన్నారు. వైద్య నాథన్, నరహరి శర్మ, నర్సయ్య రేవతి, త్యాగ రాజ ఘన పంచరత్న మాలికను గానం చేశారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments