కామెడీ చిత్రాల హీరో సంపూర్ణేష్ బాబు నేటి ఉదయం ప్రమాదానికి గురయ్యారు.
ఆయన ప్రయాణిస్తున్న కారును టీఎస్ ఆర్ టి సి బస్సు ఢికొట్టినట్టు తెలుస్తుంది.
వివరాల్లోకి వెళితే నేటి ఉదయం కుటుంబ సభ్యులతో పాటుగా సంపూర్ణేష్ బాబు కారులో
ప్రయాణిస్తుండగా సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద ఆర్ టి సి బస్సు ఢీకొంది.
దీనితో సంపూర్ణేష్ తో సహా.. భార్య,కూతుళ్లకు స్వల్ప గాయాలయ్యాయని సమాచారం.
ప్రమాదం నుండి స్వల్వగాయాలతో బయటపడటంతో కుటుంబ సభ్యులతో పాటు
సంపూర్ణేష్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
మొదటి చిత్రం హృదయ కాలేయంతో కామెడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంపూర్ణేష్ బాబు
ఇటీవల కొబ్బరి మట్ట చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆయన ఓ కొత్త చిత్రం కొరకు ప్రస్తుతం సన్నద్ధం అవుతున్నారు.
నటుడు సంపూర్ణేశ్ బాబు కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు _Ts360news.com
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి