5.1 C
New York
Sunday, May 28, 2023
HomeLifestyleDevotionalమల్లికార్జున స్వామి దేవాలయం –సలేశ్వరము

మల్లికార్జున స్వామి దేవాలయం –సలేశ్వరము

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

దట్టమైన నల్లమల్ల అడువులలో వెలసిన అత్యంత పురాతన శైవ క్షేత్రం సలేశ్వరము(Saleswaram) . హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గం లో దట్టమైన అడవి మార్గం లో మన్ననూర్ నుండి సుమారు 30 కి మీ దూరం లో అడవి లోపల ఈ క్షేత్రం కొలువై ఉంది.
దట్టమైన అరణ్యం లో ,చుట్టూ కొండలు ,మద్య మద్య లో ప్రవహించే సెలయేర్లు మద్యలో ఎంతో రమణీయంగా వెలసిన క్షేత్రం సాలేస్వర (Saleswaram)క్షేత్రం . పై నుంచి పారే నిటి సెలయేర్ల తో స్నానమాచరించి స్వామీ వారిని దర్సిన్చికుంటారు . ఈ నిటి తో స్నానం చేస్తే సకల రోగాల నయమవుతాయని భక్తుల విశ్వాసం . ఇ క్షేత్రం లోనే మహాదేవుడి ఆర్జనుడి శౌర్య పరాక్రమలు పరీక్షించిన ప్రదేశంగా చెప్పబడుతోంది.

ఈ క్షేత్రం(Saleswaram)లో స్వామి వారు లింగాకారం లో తెజోలింగాస్వరుపుడిగా కొలువై ఉన్నాడు . ప్రాచిన కాలం నుంచి ఇక్కడ నివసించే చెంచులే ఆలయ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు . అరణ్యం లో లబించే ఆకుల,అలములు,పండ్లు స్వామి వారికి నైవిద్యంగా సమ్పర్పిస్తారు.స్వామి వారి సన్నిది కి చెరువు లో వీరభద్ర స్వామి దేవాలయం,గంగమ్మ తల్లి కొలువై ఉన్నారు .

ఆలయానికి చెరువు లో పుట్ట ఉంది చైత్ర శుద్ధ త్రయోదశి నుండి బహుళ తదియా వరకు స్వామి వారి వార్షికోత్సవాలు నిర్వహిస్తారు . చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు వెన్నెల కాంతి స్వామి వారి పైన పడుతుందట అందుకే ఆ రోజు స్వామి వారిని చూడటానికి చాల మంది భక్తులు వస్తారు .

సాదారణ రోజుల్లో ఇక్కడికి వెళ్ళడానికి వీలు లేదు చైత్ర శుద్ధ పౌర్ణమి కి 5 రోజులు ఇక్కడ వెళ్ళడానికి
సదుపాయాలు కల్పిస్తారు . జీవిత కాలం లో తప్పకుండ ఒకసారి అయిన దర్సించాల్సిన క్షేత్రం ఇది

సమీపం లో క్షేత్రం :-
మన్ననూర్ నుండి 50 మీ దూరం లో మల్లెలతీర్తం కొలువై ఉంది . 400 అడుగులు లోతులో ఎంతో రమణీయంగా ఉంటుంది

అర్జునుడు శివుడితో ఎందుకు యుద్ధం చేయాల్సి వచ్చింది

ధర్మరాజు ఇంద్రుడి దగ్గర ఉన్న అస్రాలను తీసుకురమ్మని చెప్పగా అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్లి ఇంద్రుడిని అస్రాలను ఇవ్వమని అడుగగా, అప్పుడు ఇంద్రుడు అర్జునుడితో నీవు శివుడిని ప్రసన్నం చేసుకోగలితే ఆ అస్రాలు నీకు లభిస్తాయని షరతును పెడతాడు. ఇంద్రుడు చెప్పిన మాట ప్రకారం అర్జునుడు ఇంద్రకీలా పర్వతాన్ని చేరి శివుడి కోసం తపస్సు చేస్తుంటాడు. అప్పుడు శివుడు అర్జునుడిని పరీక్షించాలని భావించి తానె స్వయంగా ఒక కిరాతకుడిగా మారి త్రిశూలాన్ని విల్లుగా మార్చుకొని మారువేషంలో వస్తాడు.మూకాసురుడిని ఒక పంది రూపంలో అర్జునుడి దగ్గరికి పంపగా, మూకాసురుడు అర్జునుడి తపస్సుని భంగం కలిగించడానికి చాలా విధాలుగా ప్రయత్నించగా, తపస్సు భంగం కలిగిన అర్జునుడు పంది రూపంలో ఉన్న మూకాసురుడి పైన బాణాలు వేస్తాడు. ఆ సమయంలోనే కిరాతకుడు రూపంలో ఉన్న శివుడు కూడా మూకాసురిడిపైన బాణాలు వేస్తాడు. అప్పుడు మూకాసురుడు చనిపోగా అది నేను వేసిన బాణాల వలెనే చనిపోయిందని కిరాతకుడి రూపంలో ఉన్న శివుడు అనగా, లేదు నేను వేసిన బాణాల వలెనే అది చనిపోయినదని అర్జునుడు అంటాడు.
అప్పుడు కిరాతకుడు జంతువులను వేటాడేది మేము, దానిని చంపింది నేనే అంటూ వాదించగా అర్జునుడికి కోపం వస్తుంది. ఆ మాటలు కాస్త ఇద్దరి మధ్య యుద్దానికి దారి తీస్తుంది. అర్జునుడు శివుడితో యుద్దానికి దిగి బాణాలను సందిస్తుండగా ఒక్క బాణం కూడా శివుడిని ఏమి చేయలేకపోతాయి. అప్పుడు శివుడు ఒకే ఒక్క బాణాన్ని అర్జునుడి పైకి సందించగా ఆ దెబ్బకి అర్జునుడు కింద పడిపోతాడు. అయినా అర్జునుడు తన ఓటమిని అంగీకరించకుండా బాణాలను సందించబోతుండగా ఒక్కసారిగా మూల్లోకాలన్నీ కంపించాయి. నాలుగువైపులా ఘోర గాలులు వీస్తూ, భూ ప్రపంచం అంతా వినాశనం అవుతున్నట్టు కనిపించింది. ఆ సమయంలో అర్జునుడికి అర్ధం అవుతుంది అక్కడ ఉన్నదీ కిరాతకుడు కాదు ఆ రూపంలో ఉన్న శివుడు అని అర్ధం చేసుకొని తన తప్పుని తెలుసుకొని శివుడు కాళ్ళమీద పడి క్షమించమని వేడుకుంటాడు. శివుడు చిరునవ్వుతో ఆశీర్వదించి, పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి అదృశ్యమవుతాడు. ఇలా ఈ విధంగా శివుడు అర్జునుని అనుగ్రహించేందుకు ఒక పరీక్షను పెట్టి, కిరాతకుని రూపాన్ని ధరించాడు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments