Monday, May 23, 2022
HomeLife styleDevotionalకన్నుల పండువగా సహస్ర కలశాభిషేకం

కన్నుల పండువగా సహస్ర కలశాభిషేకం

సుప్రసిద్ధ ప్రాచీన పుణ్య క్షేత్రమైన ధర్మపురి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నిర్వహి స్తున్న నరసింహ నవరాత్రి ఉత్సవాలలో అంతర్భాగంగా. బుధవారం సహస్ర కలశాభిషేక మహోత్స కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. దేవస్థానం ఏసి,ఇఓ సంకటాల శ్రీనివాస్ మార్గ దర్శకత్వంలో, ఇందారపు రామయ్య నేతృత్వంలోని అభివృద్ది కమిటీ సభ్యుల సమక్షంలో, ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ, ముత్యాల శర్మ, సంతోష్ శర్మ, రాజగోపాల శర్మ, సంపత్ శర్మ, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచార్య, నరసింహ మూర్తి, అరుణ్, రమణాచార్య, వంశీ, విజయ్, కిరణ్, అశ్విన్, నవీన్, ఈసందర్భంగా ప్రత్యేక పూజలొనరించారు(Sahasra Kalasabhishekam). ఉదయాత్పూర్వం మంగళ వాద్యాలతో, వేద మంత్రాలతో, పవిత్ర జలాలను కొని తెచ్చారు.

Sahasra Kalasabhishekam
Sahasra Kalasabhishekam

దేవ స్థానంలోని ప్రధానాల యమైన శ్రీయోగానంద లయంలో అప్పటికి సిద్ధం చేసి ఉన్న సహస్ర కలశాలలో పవిత్ర జలాలను పోసి, మూల విరాట్టుకు కలశాభిషేకాన్ని వేదమంత్ర సంప్రదాయ యుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వాస్తు, క్షేత్ర పాలక, యోగిని, బ్రహ్మాది మండల నవగ్రహ, సుదర్శన, వరుణాది స్థాపిత దేవతా హెూమాలు, జయాది హెూమాలు, శ్రీలక్ష్మీ నరసింహ సహస్ర నామార్చనలు, పురుష సూక్త, శ్రీసూక్త, కల్పోక్షన్యాస, పంచోప నిషత్ యుక్త అభిషేకాలు, రామాయణం భారత, భాగవతాది పురాణ, లక్ష్మీసూక్త సంపుటీకరణ పారాయ బలిదానాలు, పూర్ణాహుతి, ఇత్యాది క్రతువులు సాంప్రదాయ రీతిలో గావించారు. ఈసందర్భంగా యోగనంద, ఉగ్ర లక్ష్మీ నరసింహా లయాలలో అభిషేకాలు నిత్య అర్చనలు, కల్యాణోత్సవం, నవరాత్రి పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

రామ కిష్టయ్య సంగన భట్ల... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల… 9440595494
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

AllEscort