టాలీవుడ్ టాప్ హీరోలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్.ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ కు చేరిందట.ఈ ఏడాది మే కల్లా ఈ చిత్రం షూటింగ్ పూర్తి అవ్వనున్నది.
ఈ మూవీలో బాలీవుడ్ ప్రముఖ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.తాజాగా ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.దీంతో బాలీవుడ్ లో ఆయన న్యూ లుక్ ఎలా ఉండబోతుందో అని చర్చ జరుగుతుంది.
