Monday, May 23, 2022
Homespecial Editionమలేరియా వ్యాధి పట్ల అవగాహన అవసరం

మలేరియా వ్యాధి పట్ల అవగాహన అవసరం

ప్రాణాంతక వ్యాధి మలేరియా పట్ల ప్రజలలో అవగాహన పెంచడం, చికిత్స చేయడం, నివారించడం గురించి ప్రజలకు అవగాహన కలిగించడం అత్యవసరం. మలేరియా అనే పేరు “మల అరియ” అనే ఇటాలియను పదాల నుండి పుట్టింది(Ronald Ross). “మల అరియ” అంటే చెడిపోయిన గాలి అని అర్ధం. చిత్తడి నేల ఉన్న చోట్ల మలేరియా అధికంగా ఉండటం వలన ఈ జ్వరాన్ని చిత్తడి జ్వరం అని కూడా పిలిచేవారు.

సర్ రోనాల్డ్ రాస్ (13 మే, 1857 – 16 సెప్టెంబర్, 1932) బ్రిటిష్ వైద్యుడు, శాస్త్రవేత్త. ఆయనకు మలేరియా పారసైట్ జీవిత చక్రానికి చెందిన పరిశోధనకు 1902లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రదానం చేయబడింది. 1897 లో ఒక దోమ యొక్క జీర్ణశయాంతర ప్రేగులలో మలేరియా పరాన్నజీవిని ఆయన కనుగొన్నప్పుడు మలేరి యా దోమల ద్వారా వ్యాపిస్తుందని ఋజువు చేసింది. ఈ వ్యాధిని ఎదుర్కొనే పద్ధతికి పునాది వేసింది. భారతీయ వైద్య సేవలో 1881 లో ప్రవేశించి 25 సంవత్సరాలు పని చేశాడు. తన సేవలోనే అతను సంచలనాత్మక వైద్య ఆవిష్కరణ చేశాడు.

Ronald Ross
Ronald Ross

1895 మార్చి 20న ఆయన లండన్ నుండి బయలుదేరి, ఏప్రిల్ 24న సికింద్రాబాదు చేరాడు. కస్టమ్ ఆఫీసులో తన సామాను క్లియర్ కావడానికి ముందే, అతను నేరుగా బొంబాయి సివిల్ హాస్పిటల్ కి వెళ్లి, మలేరియా రోగుల కోసం వెతుకు తూ రక్త నమూనాలు సేకరించడం ప్రారంభించాడు. రాస్ మే 1895 లో దోమల కడుపు లోపల మలేరియా పరాన్నజీవి ప్రారంభ దశలను గమనించి నప్పుడు తన పరిశోధ నలో మొదటి ముఖ్యమైన అడుగు వేశాడు. 1896 జూన్‌లో ఆయనను సికింద్రాబాద్‌కు బదిలీ చేశారు. రెండు సంవత్సరాల పరిశోధన వైఫల్యం తరువాత, జూలై 1897 లో అతను సేకరించిన లార్వా నుండి 20 వయోజన “గోధుమ” దోమలను సంవర్థనం చేయ గలిగాడు. మలేరియా పరాన్నజీవి జీవిత చక్రాన్ని సర్‌ రోనాల్డ్‌ రాస్‌ అనే శాస్త్రవేత్త సికింద్రాబాదు నగరంలో పరిశోధన చేస్తున్నప్పుడు 1897 ఆగస్టు 20న కనుగొన్నారు. తద్వారా ఆయనకు 1902లో నోబెల్‌ బహుమతి లభించింది. రోనాల్డ్‌రాస్.. మలేరియా పరాన్న జీవికి ప్లాస్మోడియం అని పేరు పెట్టారు. రొనాల్డ్ రాస్ భారతదేశం లోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అల్మోరాలో జన్మించాడు. ప్రస్తుతం “మినిస్టర్స్ రోడ్”గా పిలిచే రహదారిని 2000 సంవత్సరం వరకు “సర్ రోనాల్డ్ రాస్ రోడ్” అనేవారు.

మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వలన కలుగుతుంది. మనుషుల్లో ఆడ అనోఫీలస్ దోమ ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుం ది. పరాన్నజీవిని కలిగివున్న దోమ మనుషులను కరిచినపుడు అవి మనుషులతో చేరి వారి కాలేయం లో విభజన చెంది తదనంతరం ఎర్ర రక్తకణాలను నాశనం చేస్తాయి. ప్రపంచంలో ఏటా 500 మిలియన్ల జనాభా మలేరియా జ్వరాల బారిన పడి వారిలో 2.7 మిలియన్ల మంది మరణిస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తు న్నాయి. ప్లాస్మోడియం” అనే ప్రొటోజోవా పరాన్నజీవి మలేరియా వ్యాధి కారకము. ప్రోటోజోవాలు ఏకకణ జీవులు. వీటి నిర్మాణము బ్యాక్టీరియా కంటే క్లిష్టమైనది. బ్యాక్టీరియా చాలా సులువయిన నిర్మాణము కలిగి ఉంటాయి. వివిధ ప్లాస్ల్మోడియం స్పీసీస్లు మనుషు లలో వివిధ రకాల మలేరియాలను కలుగజేస్తాయి. అందులో … ప్లాస్మోడియం ఫాల్సిపారం, ప్లాస్మో డియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియై, ప్లాస్మోడియం ఒవేల్,
ప్లాస్మోడియం సెమీ ఒవేల్,
ప్లాస్మోడియం నోవెస్లి ముఖ్య మైనవి.

Ronald Ross
Ronald Ross

దోమ మనుషులను కరిచినపుడు అవి మనుషులతో చేరి వారి కాలేయంలో విభజన చెంది తదనంతరం ఎర్ర రక్తకణాలను నాశనం చేస్తాయి. ఎర్ర రక్తకణాలలో చేరిన 48 నుండి 72 గంటలలో ఈ పరాన్నజీవులు విభజన చెంది చిట్లిపోతాయి. దీనివలన ఫ్లూ, వణుకుతో కూడిన జ్వరం, అసాధారణ రక్తస్రావం, దీర్ఘ శ్వాస, రక్తలేమి చిహ్నాలు మరియు స్పృహ కోల్పోవడం జరుగుతుంది.
చలి జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, ఛాతిలో నొప్పిగా ఉండటం, దగ్గు, చెమటలు పట్టడం, వాంతు లు, విరేచనాలు, నీరసంగా ఉండటం, ఆయాసం మొదలైనవి మలేరియా లక్షణాలు. ప్రారంభ దశలోనే ఈ వ్యాధిని గుర్తించడం వల్ల మెరుగైన చికిత్స అందించ వచ్చు. దోమకాటుకు గురైన ఏడు నుంచి 18 రోజుల మధ్య ఈ లక్షణాలు కనిపిస్తాయి. రక్త నమూనాలను సేకరించి మైక్రోస్కో పిక్ ల్యాబోరేటరీ టెస్టులు లేదా ఆర్డీటీ టెస్టుల ద్వారా మలేరియా వ్యాధిని నిర్ధారిస్తారు.

1946నుండి మలేరియా అదుపు చేయడానికి డి.డి.టి వినియోగం మొదలయ్యింది. 1953లో 7 కోట్ల పైగా ప్రజలు మలేరియా బారిన పడ్డారు. 8 లక్షల వరకు మరణాలు అందువలన సంభవించాయి. అప్పుడు 1958లో జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమం ప్రారంభించారు. డాక్టర్లు రక్తపరీక్ష చేసి మలేరియా అని నిర్ధారిస్తారు. వ్యాధిగ్రస్తుని నుండి సేకరించిన రక్తం బొట్టును ఒక సన్నటి గాజు పలకపై ఉంచి, దానిపై గీంసా ద్రావకం వేస్తారు. దీనివలన డాక్టర్లు సూక్ష్మదర్శిని (మైక్రోస్కోపు) కింద మలేరియా జీవులను చూడ గలుగుతారు.

మలేరియా బారిన పడిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే.. వ్యాధి సోకకుండా జాగ్రత్త వహించడం మేలు. దోమలు ఉండకుండా చూసుకోవాలి. ఇందుకోసం పరిసరాలను పరిశుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి. మస్కిటో రిపెల్లెంట్స్ క్రీములు, స్ప్రేలు వాడటం ఉపకరిస్తుంది. ఘాటైన వాసనలను వెదజల్లే మొక్కలు, పుష్పాలను దోమలు ఇష్టపడవు. కాబట్టి బంతి రోస్‌మేరీ, పుదీనా మొక్కలను ఇంటి పరిసరాల్లో పెంచడం వల్ల దోమలు రాకుండా ఉంటాయి.

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకో వడం, ఎక్కువగా ద్రవాహారం తీసుకోవడం ముఖ్యం. తద్వారా రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమై, రోగాల బారిన పడకుండా ఉంటాం. వీధుల్లో అమ్మే అపరిశుభ్ర ఆహారం తీసుకోవడం మానేయాలి.

అధిక ప్రొటీన్లు ఉన్న పాలు పెరుగు, మజ్జిగ మలేరియా వ్యాధి ఉన్న వారు కణజాలాన్ని అధికంగా కోల్పోవడం వలన మలేరియా ఉన్నవారు తమ ఆహార ప్రణాళిక లో ప్రొటీన్లను చేర్చుకోవాలి. అధిక ప్రోటీన్ మరియు అధిక చెక్కెరలు ఉన్న ఆహార పదార్థాలు కణజాల నిర్మాణానికి దోహద పడతాయి. అధిక ప్రొటీన్లు ఉన్న పాలు, పెరుగు, మజ్జిగ, చేపలు, లస్సీ, చికెన్ సూప్, గుడ్లు మొదలైనవి తీసుకోవాలి.
ఎలాక్ట్రోలైట్స్ మరియు నీటిని కోల్పోవడం మలేరియా వ్యాధి ఉన్నవారిలో సర్వ సామాన్యం. కనుక పండ్ల రసాలు, సూపులు, గంజి, కొబ్బరి నీరు, పప్పు నీరు మొదలైనవి తీసుకోవడం శ్రేయస్కరం. బీట్ రూట్, క్యారెట్, బొప్పాయి, నిమ్మ జాతి పండ్ల విటమిన్ ఎ, విటమిన్ సి సమృద్ధిగా కలిగిన బీట్ రూట్, క్యారెట్, బొప్పాయి, నిమ్మ జాతి పండ్లయిన నారింజ, బత్తాయి, ద్రాక్ష, అనాసపనస, నిమ్మ మొదలైన ఆహార పదార్థాలతో పాటు బి- కాంప్లెక్స్ విటమిన్లు తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

రామ కిష్టయ్య సంగన భట్ల... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల… 9440595494
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

AllEscort