నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పట్టణానికి చెందిన పద్మ అనే మహిళ దుర్మరణం చెందింది.
ఇక వివరాల్లోకి వెళితే పద్మ అనే మహిళ తన సొంత పనులు చేసుకొని ఇంటికి వెళ్ళే క్రమంలో ఆర్మూర్ బస్టాండ్ ఎదురుగా గల గీతాభవన్ ఉడిపి హోటల్ ముందు నుండి నడుచుకుంటూ వెళ్తుండగా
బాల్కొండ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న పెళ్ళి బస్సు ఆ మహిళను వెనుక నుండి ఢీ కొట్టి దాదాపు 100 మీటర్లు లాక్కొని వెళ్లడంతో బస్సు టైర్ల కింద పడి రెండు భాగాలుగా విడిపోయి నుజ్జుఐ మరణించింది.
విషయం తెలుసుకున్న ఆర్మూర్ పోలీసులు సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకొని పరిస్థితిని సమీక్షించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,
ప్రమాదానికి కారణమైన బస్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నామని సీఐ రాఘవేందర్ తెలిపారు.


