Monday, May 23, 2022
HomeLife styleHealthయోగ విద్యకు భారత దేశంలో పునర్వైభవం

యోగ విద్యకు భారత దేశంలో పునర్వైభవం

పరదేశీయ పాలన నుండి విముక్తి పొంది, భారత దేశం స్వతంత్ర దేశంగా రూపు దిద్దుకుని 75 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ప్రత్యేక సందర్భాన్ని పురస్కరిం చుకుని, భారత దేశవ్యాప్తంగా అమృత మహోత్సవాలు” జరుపుకుంటున్న తరుణమిది(Revival of yoga education). మరిచిపోలేని ఈ చారిత్రక నేపథ్యంలో, యోగా అమృతోత్స వాలను, భారత కేంద్ర నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది.

యోగా అనే పదం సంస్కృతం నుంచి వచ్చింది. “యుజ” అనే పదం నుంచి వచ్చింది. యుజ అంటే దేన్నయినా ఏకం చేయడం.. లేదా చేరడం అని అర్థం. అంటే.. శరీరాన్ని, మనసును ఏకం చేయడమే యోగా ఉద్దేశం. ప్రపంచ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా జరుపు కోవడం ఆనవాయితీగా వస్తున్నది. జూన్ 21నే యోగాడేను జరుపు కోవడానికి అసలు కారణం… జూన్ 21.. ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉన్న రోజు. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఆ రోజుకు పగలు ఎక్కువగా ఉన్న రోజుగా ప్రత్యేకత కూడా ఉంటుంది. ఆ గుర్తింపు తోనే .. అదే రోజును “అంతర్జాతీయ యోగా దినోత్స వం”గా జరుపు కోవాలని నిర్ణయించారు.

Revival of yoga education
Revival of yoga education


యోగా ఇప్పటిదేమీ కాదు.. దాదాపు 5000 ఏళ్ల నాటి చరిత్ర ఉంది యోగాకు. యోగను శాస్త్రీయంగా క్రోడీకరించిన వారిలో ఆద్యుడు పతంజలి. అష్టాంగ యోగా, అయ్యంగార్, విన్యాస యోగా కూడా ఈ క్రమంలో రూపు దిద్దుకున్నవే. ‘అష్టాంగ యోగ’ను పతంజలి మహర్షి సిద్ధం చేశారని చెబుతారు. ఉపనిషత్తులలోను, భగవద్గీతలోను యోగా ప్రస్తావన ఉంది. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకే ఉందని పరిశోధనల్లో తేలింది.
యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. యోగా వల్ల కలిగే ఆ ప్రయోజనాల గురించి ప్రజలను చైతన్యం చేయడమే “యోగా డే” ముఖ్య ఉద్దేశం.
యుగయుగాలుగా మన సనాతన భారత సంప్రదాయంలో ఇమిడి ఉండి, పూర్వికులెందరో తమ శారీరక, మానసిక ఉల్లాసానికి అనాదిగా ఆచరించిన సాధనం ‘యోగ సాధన’. ప్రాచీన కాలం నుండి ఎందరో మునులు, యతులు, ఋషులు, యోగులు తమ తపోనిష్టకు అనారోగ్యం అడ్డు కాకుండా కనిపెట్టిన ‘’ఆసనాలు’’, ఆచరించిన శ్వాస సంబంధిత ‘’ప్రాణాయామాలు’’, క్రమంగా మనకు ‘యోగా’ పాఠాలుగా మారాయి అనడం అతిశయోక్తి కాదు… ఆ కాలంలోనే ‘పతంజలి’ మహర్షి మన వేదాలు, ఉపనిష త్తుల ఆధారంగా స్వయంగా ‘యోగ దర్శిని’ అనే గ్రంథాన్ని రచించారు. ఈ తాళ పత్ర గ్రంథం ఆధారంగానే ప్రపంచ వ్యాప్తంగా, ఎందరో యోగా గురువులు తమ సాధనలను, అనుభవాలను రంగరించి వేలాది యోగా పుస్తకాలను రంచించారు. ఇంకా రచిస్తూనే ఉన్నారు.
పతంజలి మహర్షి భావనలో యోగా అనేది ‘అష్టాంగ యోగం’. అంటే ఈ యోగా అనే శాస్త్రాన్ని ‘’యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం, సమాధి’’ అనే ఎనిమిది భాగాలుగా విశ్లేషించి చెప్పారు పతంజలి మహర్షి. ఈ ప్రాచీన పద్దతులను ఆచరిస్తూ విశ్వవ్యాప్తంగా ఎందరో యోగ సాధకులుగా, యోగా గురువులుగా కొనసాగుతున్నారు.

Revival of yoga education
Revival of yoga education


యోగాకు సంబంధించిన యోగ శాస్ర్తాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది భారతీయులే. భారత దేశంలో పురుడు పోసుకున్న యోగా నేడు ప్రపంచమంతా పాకింది. ఐదు సహస్రాబ్దాలకు పైగా భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైన యోగవిద్యను యావత్ ప్రపంచం ఎప్పటి నుంచో అనుసరిస్తుంది.

2500 ఏళ్ల క్రితం సాధువులు యోగా సాధనలు చేసేవారని యూనివర్సిటీ ఆఫ్ లండన్‌‌కు చెందిన పరిశోధకుడు, సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ జిమ్ మల్లిన్‌సన్ అభిప్రాయం. ఆయన యోగా చరిత్ర మీద అధ్యయనం చేస్తున్నారు.
అప్పట్లో స్థిరంగా ఒక భంగిమలో ఉంటూ యోగా చేసేవారని, ప్రస్తుతం యోగా శిక్షణ కేంద్రాల్లో మనం చూస్తున్న శారీరకపరమైన ఆసనాలు అప్పట్లో ఉండేవి కాదని మల్లిన్‌సన్ వివరించారు.

యోగాను ప్రపంచ వ్యాప్తం చేయడం కోసం ప్రతి సంవత్సరం యోగాడేను నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ఒక నినాదంతో యోగా డేను నిర్వహిస్తారు. గడచిన శతాబ్ద కాలంలో ప్రపంచీకరణలో భాగంగా యోగా కూడా అనేక రూపాలు తీసుకుంది. విభిన్నమైన కొత్త ఆసనాలు ఆచరణలోకి వచ్చాయి. చాలా దేశాల్లో యోగాకు ప్రాధాన్యత కూడా బాగా పెరిగింది.

జూన్ 21 న యోగా దినోత్సవం జరపాలని ఐక్యరాజ్య సమితికి ప్రధాని మోదీ సూచించారు. 2014లో మోదీ ఐక్యరాజ్య సమితికి ప్రతిపాదించడంతో… తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015లో నిర్వహించారు. 2015, జూన్ 21న ప్రపంచ వ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా డేను నిర్వహించారు. భారత్‌లో ప్రధాని మోదీ.. న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో నిర్వహించారు. ఆ వేడుకలకు చాలా దేశాలకు చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు హాజర య్యారు. ఆరోజు ప్రధాని మోదీతో పాలు వేల మంది యోగా చేశారు. 84 దేశాల నుంచి వచ్చిన నేతలతో పాటు మొత్తం 35,985 మంది ఆరోజు మోదీతో పాటు యోగా చేసి రెండు గిన్నిస్ రికార్డులను నెలకొల్పారు.

జూన్ 21… యోగా దినోత్సవానికి వంద రోజుల ముందు నుండే.. యోగా సంబంధిత కార్యక్రమాల నిర్వహణకు కేంద్ర మోడీ ప్రభుత్వ నిర్ణయానికి అంకురార్పణ జరిగింది. నరేంద్ర మోడీ నేతృత్వంలో, అన్ని మంత్రిత్వ శాఖలు భాగస్వాములై అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దేశంలోని పేరెన్నిక గన్ని 75 ప్రాచీన వారసత్వ కేంద్రాలలో ఏకకాలంలో యోగా కార్యక్రమా లను నిర్వహించి ప్రపంచ యోగా దినోత్సవానికి మరింత ప్రాచు ర్యాన్ని అందించ బోతున్నది.

దేశ వ్యాప్తంగా యోగా సన్నాహక సమావేశాలు, సంబరాలకు దేశం వేదికగా మారింది. వంద రోజుల పాటు జరిగే, 100వ కౌంట్ డౌన్ యోగా మహోత్సవ కార్యక్రమం హరియాణా రాష్ట్రంలో మార్చి 14న కేంద్ర మంత్రి సోదోవాల్ ప్రారంభించారు. 75వ కౌంట్ డౌన్ ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటపై నిర్వహించారు. 50వ కౌంట్ డౌన్ ఉత్సవాలను అస్సాం రాష్ట్రం కాగా, 25 కౌంట్ డౌన్ యోగా ఉత్సవాలకు హైదరాబాద్ వేదిక అవుతున్నది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా, మే 27వ తేదీ ఉదయం హైదరా బాద్ పీపుల్స్ ప్లాజాలో ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

రామ కిష్టయ్య సంగన భట్ల... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల… 9440595494
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

AllEscort