సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరో హీరోయిన్లు నటీనటులు సినిమాలలో నటిస్తున్న సమయంలో తోటి నటీనటులతో హీరో హీరోయిన్లతో ప్రేమలో పడి ఆ తర్వాత వారిని పెళ్లి చేసుకున్న వారు చాలామంది ఉన్నారు.అందులో కొందరు మాత్రమే విడాకులు( Divorce ) తీసుకుని విడిపోయారు.
ఇంకొందరు ఇప్పటికీ అలాగే కలిసి ఉన్నారు.కానీ కొందరి హీరోయిన్లు చిన్న వయసులోనే భర్తలకు దూరమయ్యి ఆ తర్వాత నరకమనుభవించిన వారు చాలామంది ఉన్నారు అని చెప్పవచ్చు.
మరి ఆ హీరోయిన్ లు ఎవరు అన్న విషయానికి వస్తే.క్వీన్ రేఖ ( Rekha )ఢిల్లీ పారిశ్రామికవేత్త ముఖేష్ అగర్వాల్‌ను వివాహం చేసుకున్నారు.

పెళ్లయిన కొద్ది రోజులకే అతను ఆత్మహత్య చేసుకున్నాడు.అయితే ముఖేష్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే ప్రశ్న ఇప్పటికీ మిస్టరీగా ఉంది.అనంతరం రేఖ 1973లో హీరో వినోద్ మెహ్రాను ( Vinod Mehra )మళ్లీ పెళ్లి చేసుకున్నట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.కానీ అతను కూడా గుండెపోటుతో మరణించాడు.
నటి కైకేషన్ పటేల్( Kaikesan Patel ) వ్యాపారవేత్త ఆరిఫ్ పటేల్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది.ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, అర్హాన్, నుమైరే.
సంతోషంగా సాగుతున్న వైవాహిక జీవితంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది.భర్త, పిల్లలతో సంతోషంగా సాగుతున్న ఆనందం కైకేషన్ పటేల్ కు ఎంతో కాలం నిలవలేదు.

ఆరిఫ్ 2018లో అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు.సునీల్ దత్ మన్ కా మీట్ సినిమాతో లీనా చందావర్కర్( Leena Chandavarkar ) బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.ఆమె 1975లో సిద్ధార్థ్ బందోద్కర్ ను వివాహం చేసుకుంది.అయితే పెళ్లయిన కొద్ది రోజులకే చనిపోయాడు.ఆ తర్వాత లీనా 1980లో కిషోర్ కుమార్‌ను వివాహం చేసుకుంది.పెళ్లయిన ఏడేళ్ల తర్వాత అతను కూడా చనిపోయాడు.
అప్పటికి లీనా వయసు 37 ఏళ్లు.భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ( Shanti priya ) వెండి తెరపై అక్షయ్ కుమార్ సౌగంధ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.1999 లో నటుడు సిద్ధార్థ్ రాయ్‌ని వివాహం చేసుకుంది.అయితే శాంతికి 35 ఏళ్లు ఉన్నప్పుడు ఆమె భర్త సిద్ధార్ రాయ్ మరణించాడు.
అలాగే నటి విజయేతా పండిట్( Vijayeta Pandit ) ఆదేశ్ శ్రీవాస్తవలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.అయితే ఆదేశ్ క్యాన్సర్ బారిన పడి పోరాడి పోరాడి మరణించాడు.అయితే విజయేత మళ్ళీ పెళ్లి చేసుకుండా తన పిల్లలను ఒంటరిగా పెంచి పెద్దచేసింది.
