సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలో 13 రోజుల పాటు నిర్వహిస్తున్న శ్రీలక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో ప్రధాన
ఘట్టమైన రథోత్సవ వేడుకలు బుధవారం సాయంత్రం నుండి రాత్రి వరకు వైభవోపేతంగా జరిగాయి. దేవస్థానం ఎస్.ఈఓ శ్రీనివాస్, అభివృద్ది కమిటీ అధ్యక్షుడు రామయ్య, సభ్యుల ఆధ్వర్యంలో, రథోత్సవం సందర్భంగా దేవస్థాన వంశపారంపర్య పౌరోహితులు కందాళై పురుషోత్తమాచార్య, యాజ్ఞకులు ఆస్థాన వేద పండితులు రమేశ్ శర్మ ఆచార్యత్వంలో మద్యాహ్నం 3 గంటలకు ముందుగా వేద మంత్రాలతో, మంగళవాద్యాలతో దేవస్థానం ముందుభాగాన, సర్వాం గసుందరంగా అలంకరించి ఉంచిన మూడు రథాలపై శ్రీలక్ష్మీనరసింహ, శ్రీవేంకటే శ్వర, శ్రీరామలింగేశ్వర స్వాములను ఆసీనుల గావించి బలిహరణం, అష్టదిక్పాలకుల పూజ, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను దేవస్థాన పౌరోహితులు కందాళై పురుషోత్తమా చార్య, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశశర్మ పర్యవేక్షణలో అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పరచిన క్యూలైన్ల ద్వారా అశేష భక్తులు, రథాలపైకి నిచ్చెనల ద్వారా వెళ్ళి రథా రూఢులైన స్థానిక దైవాలను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వేదమంత్ర ఘోషలు, మంగళ వాద్యాలు, జయజయ ధ్వనాల మధ్య దేవ స్థానంనుండి ఇసుకస్థంభం మీదుగా పురపాలక సంఘ కూడలి వద్ద గల నంది విగ్రహం వరకు నారసింహ, వేంకటేశ్వర, రామలింగేశ్వర రథాలను వరుసగా నిలిపి భక్తజనం అనుసరించగా, రథాలను ఊరేగించగా ముత్తయిదువులు రోడుకిరువైపులా నిలిచి మంగళ హారతులు పట్టారు. రాత్రి 7గంటలకు మంత్రి కొప్పుల ఈశ్వర్… జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత తదితర ప్రముఖులతో కలిసి రతారూడు లయిన స్వామి దర్శనం చేసుకొని కంకణాలు కట్టు కున్నారు. అనంతరం దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలొనరించి గోదావరికి ఊరేగింపుగా వెళ్ళి చక్రతీర్ధ మంగళ స్నానాలు ఆచరిం చారు. చక్రతీర్ధం అనంతరం రాత్రి దేవస్థానానికి చేరుకున్నారు. ధర్మపురి సి ఐ కోటేశ్వర్, ఎస్ ఐ కిరణ్, సిబ్బంది ప్రణాళిక బద్ధంగా వ్యవహరించారు.
వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES