ఆఫ్ఘన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు. తాజాగా పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ లో రషీద్ ఖాన్ ఆడిన షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఈ షాట్ ను చూసినవారంతా రషీద్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.కానీ ఓ మహిళ క్రికెటర్ ఈ షాట్ ను తనకు నేర్పించాలని ట్విట్టర్ వేదికగా రషీద్ ను కోరింది.ఇంతకీ ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఇంగ్లాండ్ మహిళ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ సరా టేలర్ తాజాగా రషీద్ ఖాన్ ఆడిన షాట్ కు ఫిదా అయ్యింది.దీనితో ట్విట్టర్ వేదికగా ఈ షాట్ ను తనకు నేర్పించాలని కోరింది.ప్రస్తుతం ఆ ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.ఆ వీడియో పై మీరు కూడా ఓ లుక్ వేయండి.