మానవ హక్కుల సంఘానికి తాజాగా నేర నిరోధక చర్యల్ని చేప్పట్టే బాధ్యతల్ని అప్పగించారు. ఈ బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వర్తించి తమ పదవులకు వన్నె తెస్తామంటున్నారు తెలంగాణ శాఖ చైర్మన్ రాంశెట్టి రామమూర్తి నాయుడు.
హైద్రాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ వేదికగా జరిగిన కార్యక్రమంలో జిల్లాలవారిగా అధ్యక్షులకు నియామక పత్రాలు అందజేశారు. తెలంగాణ మహిళా విభాగం చైర్ పర్సన్ గా చింత ఇందిరాదేవి, కె.నాగరాణి, ఎ.వైదేహి.. కమిటీ సభ్యులుగా, ఎస్.అరుణ లీగల్ అడ్వైజర్ గా నియామక పత్రాలు అందుకున్నారు. నేషనల్ చైర్మన్ డా: బి.శాంసన్, సీనియర్ వైస్ చైర్మన్ సురేష్ కుమార్ బెహరా, ఏపీ చైర్మన్ ఆర్.జె.రాజు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రయివేట్ ఉద్యోగ సంఘాల వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం రాములు తదితరులు పాల్గొన్నారు!!
జాతీయ మానవ హక్కుల-నేర నిరోధక సంఘం తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గం!! చైర్మన్ గా రాంశెట్టి రామమూర్తి నాయుడు- వైస్ చైర్మన్ గా డి.అమరేందర్ రెడ్డి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి