రంగస్థలం చిత్రంలో తన నటనతో యావత్ సినీ అభిమానులను తన వైపు తిప్పుకున్న మెగా వారసుడు రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో రామ్ చరణ్ మన్యం బిడ్డ అల్లూరి సీతారామరాజు లాగా కనపడి ప్రేక్షకులను అలరించనున్నారు.ఈ చిత్రంలో రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.ఇక ఈ చిత్రం అనంతరం రామ్ చరణ్ ఓ కొత్త సినిమాను ఒప్పుకున్నారు.దానికి సంబంధించిన అప్డేట్ ను ఈరోజు సాయంత్రం 5.15 నిమిషాలకు విడుదల చేయనున్నారు.
ఈ చిత్రం రామ్ చరణ్ కెరియర్ లో 15వ చిత్రం కానున్నది.ప్రస్తుతం ఉన్న సమాచారం మేర ఈ చిత్రానికి తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారని,ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారని సమాచారం.ఒకపక్క హీరోగా వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మెగా పవర్ స్టార్ మరోపక్క మెగాస్టార్ సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
సాయంత్రం రామ్ చరణ్ మూవీ న్యూ అప్డేట్! ఇంతకీ దర్శకుడు ఎవరంటే??