తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవలు అందించిన ప్రసిద్ధ సాహితీవేత్త, అవధాన చక్రవర్తి రాళ్ళబండి కవితా ప్రసాద్. ఒకవైపు ఉద్యోగ రంగంలో సమర్థ అధికారిగా పేరు తెచ్చుకుంటూనే, మరో వైపు కవితా క్షేత్రంలో అందెవేసిన చేయిగా, అవధాన ప్రక్రియలో అసమాన ప్రతిభునిగా, నిర్విరామ సాధనలో సాటిలేని మేటిగా వినుతికెక్కిన నిరంతర కృషీవలుడు రాళ్ళబండి. అవధాన విద్యలో పరిపూర్ణత్వం కోసం అంకిత భావంతో చిత్తశుద్ధితో ధృఢ సంకల్పంతో శ్రమించి సిద్ధి పొందిన తాపసి ఆయన. కవిత్వం పట్ల మోజుతో తన పేరును తల్లిదండ్రులు పెట్టిన వేంకటేశ్వర ప్రసాద్ పేరును కవితా ప్రసాద్‌గా మార్చుకున్న కవితాభిమాని కవితా ప్రసాద్.
సాంప్రదాయ అవధానానికి ఆధునిక
పోకడలను నేర్పిన రాళ్ళబండి కవితా ప్రసాద్ కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం నెమలిలో 1961 మే 21న జన్మించారు. కవితా ప్రసాద్ నెమలిలో పదవ తరగతి వరకు చదివారు. తండ్రి కోటేశ్వరరాజు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో తరచూ బదిలీ అయ్యేవారు. ఆ క్రమంలో సత్తుపల్లిలో కవితా ప్రసాద్ డిగ్రీ చేశారు. అవధాన విద్య ఆరంభ వికాసాలపై ఉస్మానియా విశ్వ విద్యాలయంలో పీహెచ్‌డీ చేశారు. అనంతర కాలంలో ఇదే యునివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందారు.
కవితాప్రసాద్ చిన్నప్పటి నుంచే సాంస్కృతిక రంగం పట్ల ఆసక్తి కనబరిచారు. అవధాన విద్య పట్ల మక్కువ పెంచుకొని జీవితకాలం ఆ ప్రక్రియలో రాణించారు. దాదాపు 500కి పైగా అవధాన సభలను ఆయన నిర్వహించారు. అష్టావధానం, శతావధానం, ద్విశతావధానం, నవరసావధానం, తదితర విశిష్టమైన, అతి క్లిష్టమైన దశలను సమర్థంగా పరిచయం తెలుగు సాహితీ లోకానికి చేశారు. తెలుగు నేలపై గుబాళించిన ఈ ప్రాచీన సాహితీ ప్రక్రియలను ఎల్లలు దాటించారు. అమెరికాలోని తెలుగు భాషా, సాహితీ ప్రియులు ఆయన కోసం ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. ఈ కృషిలో కొంత ఆయన జీవితకాలం లోనే గ్రంథస్థం అయింది. అలా ఒంటరి పూలబుట్ట, పద్మ మంటపం, అగ్నిహింస, ఇది కవి సమయం తదితర సంపుటులను వెలువరించారు.
ఆధునిక నృత్య రూపక ప్రక్రియలో పంచకన్య, పంచకావ్యాలను రచించారు. ఈ రూపకాలను 24 గంటల్లోనే సిద్ధం చేసి ప్రముఖ నృత్య కారిణి మంజు భార్గవితో ప్రదర్శింప జేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
కవితాప్రసాద్ కృష్ణా జిల్లా, గంపలగూడెం మండలం, నెమలి గ్రామంలో 1961, మే 21వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు వేంకటేశ్వర ప్రసాదరాజు. కవిత్వం పట్ల మోజుతో తన పేరును కవితా ప్రసాద్‌గా మార్చుకున్నారు. తండ్రి కోటేశ్వర రాజు తెలుగు పండితులు. తల్లి పేరు రత్నవర్ధనమ్మ. సత్తుపల్లిలో గణితశాస్త్రం ఐచ్చిక అంశంగా పట్టభద్రులయ్యారు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో అవధాన విద్యపై మసన చెన్నప్ప పర్యవేక్షణలో పి.హెచ్.డి. చేశారు.
కవితా ప్రసాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చాలా తక్కువ మంది చేసే అవధాన విద్య మీద పి.హెచ్.డి పూర్తిచేశారు. ఒక పక్క గ్రూప్ 1 ప్రభుత్వ అధికారిగా ఉద్యోగం చేస్తూనే… మరోపక్క తనకెంతో ఇష్టమైన తెలుగు సాహిత్యంలో శిఖరాలను అందుకున్నారు. ఆశించిన గమ్యాన్ని చేరుకున్నారు. ఆయన
500కు పైగా అవధానాలను నిర్వహించారు. వాటిలో అష్టావధానాలతో పాటుగా శతావధానాలు, ద్విశతావధానాలు ఉన్నాయి. సంప్రదాయ అవధానంతో పాటు కథ, వచన కవిత, గణితం వంటి అనేక ప్రక్రియలను అవధానంలో చొప్పించారు.
ఒక సందర్భంలో 25 నిమిషాలలో విచిత్ర అష్టావధానం చేసి అసమాన ప్రతిభను ప్రదర్శించారు. పండితుల మెప్పు పొందారు.
వరంగల్ లోని భద్రకాళి దేవాలయంలో ఏకదిన శతకరచన ధార అనే కార్యక్రమాన్ని చేపట్టి ఒకే రోజులో ఆశువుగా శతకాన్ని చెప్పారు. ఆశుకవితా ఝరి పేరుతో గంటకు 500 పద్యాలు ఆశువుగా చెప్పి ఔరా అనిపించు కున్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-1 అధికారిగా సాంఘిక సంక్షేమ శాఖలో వివిధ రకాల సేవలను అందించారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖలో సుదీర్ఘ కాలం సాంస్కృతిక విభాగంలో అనేక హోదాల్లో సేవలు అందించారు. రెండు పర్యాయాలు సంచాలకులుగా పనిచేశారు. ఆయన పర్యవేక్షణలో నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో జరిగాయి. తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శిగా ఆయన పనిచేశారు. ఆ కాలంలో ‘సప్తగీతధామ’, ‘కవిసార్వభౌమ’ పేరిట వేంకటేశ్వర సంకీర్తనలను రచించి సీడీ రూపంలో అందించారు. దాదాపు పాతికేళ్ల తరువాత ప్రతిష్టాత్మకంగా జరిగిన మహాసభలకు సమన్వయ కర్తగా వ్యవహరించారు. నాటి రాష్ట్ర మంత్రి కడియం శ్రీహరి వద్ద పీయస్ గా బాధ్యతలు నిర్వర్తించారు. కవితా ప్రసాద్ 2015 మార్చి 15న హైదరా బాదులో హృద్రోగంతో మరణించారు.
అవధానంలో అసమాన ప్రతిభుడు రాళ్ళబండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి
RELATED ARTICLES