Sunday, August 7, 2022
HomeLifestylespecial Editionకెమెరాకే ట్రిక్కులు నేర్పిన రాజన్ బాబు

కెమెరాకే ట్రిక్కులు నేర్పిన రాజన్ బాబు

అద్భుతమైన జ్ఞాపకాలు, తియ్యటి అనుభూతులు, మధుర ఘట్టాలు, గొప్ప సన్నివేశాలు, అపురూప సంఘటనలు, మనసు దోచే దృశ్యా లు, ఆలోచింప జేసే రూపాలు… అరుదైన చిత్రాలు…వెరసి ఫొటోగ్రఫీ. వెలకట్టలేని దృశ్యాలను పదికాలాల పాటు పదిలంగా మన కళ్ల ముందు ఉంచేది ఫొటో. వంద మాటలతో చెప్పలేనిది ఒక్క ఫొటో తో చెప్పడం సాధ్యం. అంతటి శక్తి వంతమైనది ఫొటోగ్రఫీ. అలాంటి శక్తిని వశం చేసుకుని ఫోటోతో అద్భుతాలు సృష్టించిన కెమెరా మాంత్రికుడు బండి రాజన్ బాబు. కెమెరాకే ట్రిక్కులు నేర్పిన నేర్పరి రాజన్ బాబు. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన రాజన్ బాబు తెలంగాణకు చెందిన వారు కావడం గర్వకారణం.
బండి రాజన్ బాబు (ఫిబ్రవరి 9, 1939 – ఆగష్టు 24, 2011) ప్రఖ్యాత ఛాయా చిత్రకారులు. దృశ్య ప్రధానమైన ఛాయా గ్రహణం లో పేరు తెచ్చుకొన్న బండి రాజన్ బాబు 1939, ఫిబ్రవరి 9 న అవిభక్త కరీంనగర్, నేటి జగిత్యాల జిల్లా కోరుట్లలో జన్మించారు. రాజన్ బాబంటే తొలుత గుర్తుకు వచ్చేవి అరకు లోయల్లో తీసిన బొండా గిరిజన మహిళల అగణిత ఛాయా చిత్రాలు. బాల్యంలో రంగులు వేయ డం, చిత్రాలను గీయడం పట్ల ఆసక్తిని కనబరిచిన రాజన్ బాబు,
మంచి చిత్రకారుడు కావల్సి ఉండ గా, కుంచె నుండి కెమేరాకు మార డం యాదృచ్ఛికం. బాల్యం నుంచి చిత్రకళ పై మక్కువ ఉన్న రాజన్, 7వ తరగతి చదువు తున్నప్పుడు తన కజిన్ బహుకరించిన సాధారణ కొడాక్ 620 కెమేరాతో తీసిన చిత్రా లు పెక్కుమంది ప్రశంసలు అందు కొని రాజన్ లోని ఛాయాగ్రాహ కుడిని వెలికి తీసింది. హైదరా బాదులోని జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కళాశాలలో కమర్షియల్ ఆర్ట్ (వ్యాపార చిత్రకళ) లో డిప్లొమా కోర్స్ లో చేరిన సమయంలో, రాజన్ బాబు ప్రఖ్యాత ఛాయాగ్రహ కుడు దివంగత రాజా త్రయంబక్ రాజా బహదూర్ ను కలవటం జరిగింది. రాజా త్రయంబక్ రాజా, రాజన్ బాబును కుంచె స్థానంలో కెమేరా పట్టుకోమన్న సలహా రాజన్ జీవితాన్ని మలుపు తిప్పింది. 5 సంవత్సరాల డిప్లొమా చేసి, కళాశాలలో డిస్టింక్షన్ లో ఉత్తీర్ణుడ యి, కళాశాల యాజమాన్యం మెప్పు పొంది అదే కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. తరువాత ఇక్రిశాట్ లో సైంటిఫిక్ ఫొటొగ్రాఫర్ గా పనిచేశారు. 1978 లో తన ఫొటో స్టుడియో స్థాపించి, రాజన్ స్కూల్ ఆఫ్ ఫోటోగ్రఫీ ప్రారంభించి ఎందరో విద్యార్థులను నిపుణులైన ఛాయా గ్రహకులుగా తీర్చిదిద్దారు.
ఛాయాగ్రహణంలో రాజన్ తొక్కిన కొత్త పుంతలు తనకు దేశీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది. 1987లో నగ్న చిత్రాలపై ఛాయా చిత్ర కళాకృతులను సమర్పించి రాయల్ ఫోటోగ్రఫీ సొసైటీ ఫెలోషిప్ పొందారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అకాడెమీ ఆఫ్ ఫోటోగ్రఫీ కార్యదర్శిగా ఉంటూ, భగవాన్ దాస్ తర్వాత లెన్స్ లైట్ అనే ఛాయా గ్రాహక పత్రికకు సంపాదకత్వం వహించారు.
డిజిటల్ ఛాయా గ్రహణానికి ముందు ఛాయాచిత్రాలు డార్క్‌ రూం (చీకటి గది) లోనే స్థిర రూపం దాల్చేవి. నెగటివ్ లు వృద్ధి చేయ టానికి, స్థిరపరచడానికై రాజన్ తానే రూపొందించుకొన్న రసాయ నిక సూత్రం పై ద్రవణాలు కలిపి డెవలపర్ తయారు చేసి, నెగటివ్ లను స్థిరపరిచేవారు. ఈ విధానంలో…చిత్రంలో, నలుపు, తెలుపులను ప్రస్ఫుటంగా చూపే హైడ్రోక్వినాన్ లేకుండా కేవలం మెటల్ తోనే ఫిల్మ్ ను వృద్ధిపరచి, స్థిరపరచి, నలుపు తెలుపులో ఎన్నో కళాఖండాలు సృష్టించారు. ఇది రాజన్ ప్రతిభకు నిదర్శనం. ఫొటొషాప్ లాంటి సాఫ్ట్వేర్లు లేని సమయంలో కూడా రాజన్ అద్భు తాలు చేశారు. తన కళా నైపుణ్యం తో తన ఛాయా చిత్రాలను పలు మార్లు వన్ మాన్ షో లో ప్రదర్శిం చి, పలువురి ప్రశంసలందు కున్నారు. రాజన్ తీసిన నగ్న చిత్రా లలో రసికత ఉంటుంది కాని అసభ్యతకు చోటు ఉండదు. అందుకే అవి రసజ్ఞుల ప్రశంసలు పొందాయి. కొడాక్ 620 తో మొదలుపెట్టిన రాజన్, తన విద్యార్థులకు ఛాయా గ్రహణ పాఠా లలో భాగంగా బోధించ టానికై, చాలా కెమేరాలు సేకరించారు. వాటిలో ఛాయాచిత్ర కారులలో హోదాకు చిహ్నమైన Hasselblad-medium-format camera కూడా ఉంది. ఫిల్మ్ కెమేరా Asahi Pentax నుంచి, ఛాయాగ్రహణం డిజిటల్ దిశగా సాగిన పయనంలో రాజన్ Canon 400D వాడే వాతు. ఛాయాగ్రహణ శాఖలలో ఒకటైన ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో కూడా రాజన్ తన సత్తా చూపారు. నగ్న చిత్రాలకు, అసభ్య చిత్రాలకు మధ్య ఒక గీత ఉంటుంది అనేవారు రాజన్ బాబు. ఛాయాగ్రహణం ఒక భాషైతే, అందు లోని వ్యాకరణమే Composition, Color, Space, Form, Proper Exposure, Angle and Light అని వివరించే వారు. ఈ మెళకువ గ్రహించిన వాడు మంచి ఛాయా గ్రాహకు డవుతాడని రాజన్ అంటుండే వారు. పిక్టోరియల్ ఫొటొగ్రఫీలో తనదైన ముద్ర వేసిన రాజన్ బాబు 2011, ఆగష్టు 24 న తన 73వ ఏట, అనారోగ్యంతో, హైదరాబాదులో మరణించారు. రాష్ట్ర, జాతీయ అంతర్జాతీయ వేదికలపై ఫోటో ప్రదర్శనలు ఏర్పాటు చేసి, లెక్కకు మించిన అవార్డులు, బహుమతులు సొంతం చేసుకున్న రాజన్ బాబు ఫోటోగ్రఫీ కళా కారునిగా చిరకాలం గుర్తుండి పోతారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments