Tuesday, August 9, 2022
HomeLifestylespecial Editionఅజరామరం రాజ్ గురు త్యాగం

అజరామరం రాజ్ గురు త్యాగం


హరి శివరాం రాజ్ గురు (1908 ఆగస్టు 24 – 1931 మార్చి 23) భారత స్వాతంత్ర్య సమర యోధుడు, ఉద్యమ కారుడు. ఆయన భగత్ సింగ్, సుఖ్ దేవ్ ల సహచరునిగా గుర్తింపు పొందాడు. 1928లో లాలా లజపతి రాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ వారిపై పగతీర్చుకోవడానికి, ఫిరోజ్ పూర్లో బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హతమార్చి నందుకు గాను 1931 మార్చి 23 న భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ లతో పాటు ఉరితీతకు గురైనాడు. రాజ్‌గురు మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో 1908 ఆగస్టు 24 న ప్రస్తుత పూణే సమీపంలో భీమా నది ఒడ్డున ఉన్న ఖేద్ గ్రామంలో వద్ద పార్వతి దేవి, హరినారాయణ దంపతులకు జన్మించాడు. ఆయన ఖేద్ వద్ద ప్రాథమిక విద్యను పూర్తిచేసి, తరువాత పూనా లోని న్యూ ఇంగ్లీష్ హైస్కూల్లో చదువుకున్నాడు.
అతను హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ సభ్యుడు. అతను బ్రిటిష్ పాలన నుండి భారత దేశం ఏ విధంగానైనా విముక్తి పొందాలని కోరుకున్నాడు. రాజ్‌గురు, భగత్ సింగ్, సుఖ్‌దేవ్‌లు సహ ఉద్యోగు లయ్యారు. అక్టోబర్‌ 30, 1928న సైమన్ కమిషన్‌ లాహోర్‌ రాగా, లాలా లజపతి రాయ్ అహింసతో, మౌనంగా సైమన్‌ వ్యతిరేక కార్య క్రమాన్ని నిర్వహించారు. మౌనంగా ఉద్యమిస్తున్న వారిపై పోలీసులు, అలాగే పోలీసు సూపరింటెండెంట్‌ జేమ్స్‌ ఏ స్కాట్‌ తను స్వయంగా లాల్‌జీ మీద దాడి చేసి, లాల్‌జీ ఛాతీ మీద లాఠీ తో స్కాట్‌ తీవ్రంగా కొట్టగా ఆ దెబ్బల తోనే లాల్‌జీ నవంబర్‌ 17న చని పోయారు. లజపతిరాయ్ హత్యకు ప్రతీకారార్థం విప్లవ కారులు శివరామ్ రాజ్‌గురు, జై గోపాల్, సుఖ్‌దేవ్ థాపర్‌లతో భగత్ సింగ్ చేతులు కలిపాడు. డీఎస్పీ జే.పీ. సాండర్స్ కనిపించి నప్పుడు పొరపాటుగా స్కాట్‌ అనుకుని, జైగోపాల్ ఆయన్ను కాల్చమంటూ సింగ్‌కు సంకేతాలివ్వగా స్కాట్‌కు బదులు సాండర్స్ హత మయ్యాడు. ఫిరోజ్ పూర్లో బ్రిటిష్ పోలీసు అధికారి జే.పీ సాండర్స్ ను హత మార్చినందుకు గాను వారికి 1930లో అక్టోబర్ 7వ తేదీని ఈ మరణ శిక్షను ఖరారు చేశారు.
1930 అక్టోబర్ 7 న న్యాయ స్థానం తీర్పును వెలువరించింది. తీర్పు 281 పేజీల్లో ఇవ్వబడింది. విచారణ ఎదుర్కొన్న భగత్ సింహ్, సుఖఃదేవ్, రాజగురులకు ఉరిశిక్ష విధించారు. ముగ్గురు స్వాతంత్ర్య సమర యోధులను 23 మార్చి 1931 న ఉరితీశారు. పంజాబ్‌ లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని సట్లెజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనివాలా వద్ద దహనం చేశారు. భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్‌ మరణం భారత స్వాతంత్ర్యోద్యమ కొనసాగింపుకు వేలాది మంది యువకుల్లో స్ఫూర్తిని నింపింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments