రాగతి పండరి పేరు చెబితే వెంటనే గుర్తుకు వచ్చేవి నవ్వు తెప్పించే కార్టూన్లే. ఆమె పేరు తెలియని సాహి త్య అభిమానులు ఉండరం టే అతిశయోక్తి కాదేమో. వ్యంగ్య చిత్రాలతో నవ్వించాలనే లక్ష్యంతో అన్ని అడ్డంకులను అధిగమించి జీవిత ఆశయం నెరవేరుకున్న అపురూప కళాకారిణి. సామాజిక అంశాలను ప్రతిబింబించే కార్టూన్లు గీస్తూ మన్ననలు, పురస్కారాలూ అందుకున్న కార్టూనిస్టు రాగతి పండరి. విధి వంచితయై, నాలుగ డుగులు వేసి చుట్టూ ఉన్న ప్రపం చంలో స్వేచ్ఛగా తిరిగే భాగ్యానికి నోచుకోక పోయినా అన్నింటిని అవగాహన చేసుకొని హాస్యంలో రంగరించి లక్ష్యాన్ని చేరుకున్న ఘనత, అసమాన ప్రతిభ ఆమెకే సొంతం.రాగతి పండరి (జూలై 22, 1965 – 19 ఫిబ్రవరి, 2015) తెలుగు వ్యం గ్య చిత్రకారులలో రాశి లోనూ, వాసి లోనూ సమానమైన కీర్తి ప్రతిష్ఠలను ఆర్జించుకున్న ఏకైక మహిళా కార్టూనిస్టు. అంతే కాదు, అనతి కాలంలోనే తెలుగు వ్యంగ్య చిత్ర కళా రంగంలో ఎనలేని పేరు తెచ్చుకుని, ఆ రంగంలో అగ్రగణ్యు లైన బాపు, జయదేవ్ ల సరసన నిలబడ గలిగిన స్థాయి చేరుకున్న గొప్పతనం ఆమెది. ఆ గొప్పతనం వెనక అకుంఠిత దీక్ష, అంకిత భావంతో కృషి, వ్యంగ్య చిత్ర కళ మీద ఎనలేని ప్రేమ, నిరంతర పరిశ్రమ ఉన్నాయి. దురదృష్ట వశాత్తూ, ఆమెకు చిన్నతంలో వచ్చిన పోలియో మూలంగా శారీర కంగా బలహీను రాలైనా, ఆ బలహీ నతను అధిగమించి, మానసిక ఒత్తి డిని అతిక్రమించి, తనకు ఇష్టమైన కళకే అంకితమై, కార్టూన్లు గీసి అందరి మన్ననలు పొందారు. ఆమె కార్టూనులో ఏ మూల వెదికినా తేట తెలుగు దనమే, ఏ చోట స్పృశిం చినా తేనెల తెలుగు మాటలే దర్శనం ఇస్తాయి. పండగలు, పబ్బా లు, అల్లుళ్ళు, ఆడ పడుచులు, దొంగలు, పోలీసులు, ఆఫీసులు, పార్కులూ, ఆమె తాకని విషయం లేదు, లాగని తీగ లేదు, నడవని డొంక లేదు. తెలుగు వ్యంగ్య చిత్ర రంగంలో అనేక వ్యంగ్యచిత్ర ధారా వాహికలు వార పత్రికలలో నిర్వ హించిన ఘనత ఆమెదే. పన్నెండు వేలకు పైగా కార్టూన్లు వేసిన ఏకైక మహిళగా ఆమె గుర్తింపు పొందారు. రాగతి పండరి 1965 సంవత్సరం జూలై 22 న విశాఖ పట్టణంలో రాగతి గోవిందరావు, శాంతకుమారి దంపతులకు జన్మించారు. చదువు ఇంటి వద్దనే కొనసాగింది. అతి చిన్న వయసులోనే పోలియో వచ్చి, శారీరక లోపం ఏర్పడినా, పట్టు దల, ధైర్యం కలిగి జీవితాన్ని ఆత్మ విశ్వాసంతో, కఠోర పరిశ్రమతో ఎదుర్కొని, కార్టూన్ రంగంలో అగ్ర గణ్యుల సరసన చేరారు. ఆమె తన వ్యంగ్య చిత్ర ప్రస్థానాన్ని 1973లో తన 8వ ఏటనే మొదలు పెట్టారు. బాల్యంలోనే వ్యంగ్య చిత్రాలు ప్రచురణ ప్రారంభ మయ్యింది. 1980-1990 దశకాల మధ్య కొన్ని వేల వ్యంగ్య చిత్రాలను శరపరం పరగా చిత్రించారు. పాఠకుల మనసులను దోచుకున్నారు. అన్ని ప్రముఖ వార, మాస పత్రికలలో ఈమె కార్టూన్లు ప్రచురించ బడ్డా యి. పండుగల సందర్భాలలో పత్రికల సంపాదకులు ఆమె కార్టూన్లను కోరుకుని, అడిగి తెప్పించుకుని తమతమ పత్రికలలో ప్రచురించేవారు. రాగతి పండరి ఆలోచన వచ్చిందే తడవుగా కాగితంపై పెన్సిల్‌తో గీతలు కూడా గీసు కోకుండా నేరు గా స్కెచ్ పెన్నుతోనే కార్టూన్ వేసే వారు. ఆ క్రమంలో ఐదు పది నిమి షాల స్వల్ప వ్యవధి లోనే కార్టూన్ గీసే విభిన్నమైన శైలి ఆమెది. జయదేవ్ గురువుగా భావించి ఆయన శైలిలో కొద్దిరోజుల పాటు కార్టూన్లు వేసినా, వేగంగా తనదం టూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరు చుకుని ఆమె గీత చూడగానే గుర్తుపట్టేలా శైలిని ఏర్పరుచు కున్నారు. రాగతి పండరి కార్టూన్లలో ఆడవారిని గయ్యాళి భార్య గానో, అత్త గానో మాత్రమే కాకుండా, అనేక ఇతర పాత్రలను, సృష్టించి, చూపించారు. కుదురైన చక్కటి చిత్రీకరణ, గుండ్రటి చేతివ్రాత, తేట తెలుగులో సంభాషణలు ఆమె వ్యంగ్య చిత్రాల ప్రత్యేకత. తెలుగు వ్యంగ్య చిత్రరంగంలో అనేక వ్యంగ్య చిత్ర ధారావాహికలు వార పత్రికల లో నిర్వహించిన ఘనత ఆమెది. సమకాలీన వ్యంగ్య చిత్రాకారు లలో, వార్తా పత్రికలలో పనిచేస్తూ ఉన్న కార్టూనిస్ట్‌లను మినహాయిస్తే, రాజకీయ వ్యంగ్య చిత్రాలు వేసే ఏకైక ఫ్రీలాన్స్ కార్టూనిస్టు ఆమె. ‘రాజకీయ చెదరంగం’ అన్న పేరుతో ఒక దశాబ్దం పైగా రాజకీయ వ్యంగ్య చిత్రాలను ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురించబడటం తనకెంతో ఆనందం కలిగించిందని ఆమె చెపుతుండే వారు. ఆమె వ్యంగ్య చిత్రాలు హాస్యం ప్రధానం గా, ఆకర్షణీయంగా ఉండి, మానవ ప్రవృత్తిలో ఉన్న ద్వంద్వ అలోచానా విధానం, సాఘిక దురాచారాల పట్ల విమర్శల తో కూడి పాఠకులను నవ్వులలో ముంచెత్తటమే కాకుం డా, ఆలోచించటానికి కూడా ఉద్యు క్తులను చేస్తాయి.2001 సంవత్సరం ఉగాది పురస్కారం ఆంధ్ర ప్రదేశ్ అప్పటి గవర్నర్ సి.రంగరాజన్ చేతుల మీదుగా అందుకున్నారు.రాగతి పండరి కార్టూన్ సామ్రా జ్యాన్ని మొత్తం తన కైవసం చేసుకు న్న ఏకైక మహిళ కార్టూనిస్టుగా పేరు ప్రఖ్యాతుల నార్జించారని ఆమె గురు తుల్యులు కార్టూనిస్టు జయ దేవ్, వ్యాఖ్యానించారు. కాలక్రమే ణా, తనకంటూ స్వంత శైలి ఏర్పరుచుకుని, చాలామంది మగ తెలుగు కార్టూనిస్టులు, వృత్తి పరంగా అసూయ పడేలా దూసుకు వచ్చిన ఒకే ఒక మహిళా కార్టూని స్టుగా కార్టూనిస్టు రామకృష్ణ అభివ ర్ణించారు. కార్టూన్ల సాధనలో మొదట్లో తాను గీసిన చిత్రాలను చెన్నైలో నివసించే కార్టూనిస్టు జయదేవ్‌కు పండరి పంపితే మెచ్చు కోవడమే కాకుండా, ఆయన జవాబు రాస్తూ, కార్టూన్లను అవసరమైన సలహాలు, సూచనలు చేశారు. స్వయంగా విశాఖపట్నం వచ్చి తన శిష్యురాలిని అభినందిం చారు.. బాపు అంతటి గొప్ప చిత్రకారుడు రచన మాస పత్రికలో 2005లో ప్రచురించిన వినాయక చవితి కార్టూన్ మెచ్చుకొంటూ లేఖ రాసి, పండరి కార్టూన్‌కు బాపు బొమ్మ గీయడం విశేషం.2015 ఫిబ్రవరి 19 న విశాఖ పట్టణంలో ఊపిరి తిత్తులకు సంబంధించిన వ్యాధితో కన్ను మూశారు. ఆమె కోరిక ప్రకారం కుటుంబ సభ్యులు ఆమె అవయ వాలను సావిత్రిబాయి పూలే మెమోరియల్ ట్రస్ట్ ద్వారా దానం చేశారు.
