R. Narayana Murthy : ఆర్.నారాయణమూర్తి కోపంతో ఒకేసారి లిక్కర్ బాటిల్ ఎత్తేశాడు..ఎందుకో తెలుసా ?

Date:


ప్రజల్లో చైతన్యం రగిలించడానికి విప్లవ సినిమాలు తీస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు ఆర్.నారాయణ మూర్తి( R.Narayana Murthy ).ఎర్రసైన్యం, చీమలదండు, వీర తెలంగాణ, పోరు తెలంగాణ వంటి సినిమాలను అద్భుతంగా తెరకెక్కించడమే గాక వాటిలో నటుడిగా కనిపించి అలరించాడు.తన భావాలను సినిమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ వారిని ఎంతో మెప్పించాడు.

 Why R Narayana Murthy Got Angry-TeluguStop.com

ఆర్.

నారాయణమూర్తి ఇతర దర్శకులకు చాలా భిన్నంగా ఉంటాడు.నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ హిట్లు సాధిస్తూ కోట్ల ఆస్తి సంపాదించినా ఎప్పుడూ ఒక్క కారు కొనుక్కోలేదు.

అంతేకాదు తనకంటూ మంచి ఇల్లు కూడా కూడా నిర్మించుకోలేదు.చివరికి పెళ్లి కూడా చేసుకోకుండా ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.

తాజాగా ఇలాంటి గొప్ప దర్శకుడు, నటుడు గురించి రైటర్, డైరెక్టర్ కనగాల జయకుమార్ ఒక ఆసక్తికర విషయం పంచుకున్నాడు.

Telugu Dasari Yana Rao, Dasari Padma, Jayakumar, Yana Murthy, Sambasivarao-Movie

డైరెక్టర్ జయకుమార్( Director Jayakumar ) మాట్లాడుతూ.దాసరి నారాయణరావు భార్య దాసరి పద్మ( Dasari Padma ) ఆర్.నారాయణమూర్తికి బంధువు అవుతారని తెలిపారు.అందువల్ల దాసరి నారాయణరావుతో ఆర్.నారాయణమూర్తి ఎప్పుడూ చాలా క్లోజ్ గా ఉండేవారని చెప్పుకొచ్చారు.ఆయన సలహాతోనే నారాయణమూర్తి డిగ్రీ కూడా పూర్తి చేశారని వెల్లడించారు.అయితే ఒక రోజు దాసరి వద్ద పనిచేసే సాంబశివరావు నారాయణమూర్తిని రెచ్చగొట్టాడని జయకుమార్ తెలిపాడు.

Telugu Dasari Yana Rao, Dasari Padma, Jayakumar, Yana Murthy, Sambasivarao-Movie

ఏ విషయంలో రెచ్చగొట్టాడని ఇంటర్వ్యూయర్ అడగగా.జయకుమార్ సమాధానం ఇస్తూ.“ఒక రోజు సాయంత్రం వేళ దాసరి వద్దకు ఆర్.నారాయణమూర్తి వెళ్లారు.ఆ సమయంలో అతని దగ్గర పనిచేసే వారితో పాటు సాంబశివరావు డ్రింక్ చేస్తున్నాడు.నారాయణమూర్తిని చూసి ఒక పెగ్గు ఆల్కహాల్ తాగాలని మొదట సాంబశివరావు అడిగాడు.కానీ తనకు అసలు మందు అలవాటు లేదని సున్నితంగా నారాయణరావు తిరస్కరించాడు.దాంతో సాంబశివరావు నువ్వసలు మగాడివేనా, మందు తాగలేవా అని రెచ్చగొట్టాడు.

ఆ మాట అనడంతో ఆర్.నారాయణమూర్తికి బాగా కోపం వచ్చింది.అంతే, వెంటనే పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని సగం వరకు రా ఆల్కహాల్ కొట్టేశాడు.ఆ తర్వాత తన రూమ్‌కి వచ్చి గోడం పట్టుకుని అలానే కింద పడిపోయాడు.” అని చెప్పుకొచ్చాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

మంచు మనోజ్ కోసం మాస్ మహారాజా

ఓటిటిలో బలంగా ఎదగాలని చూస్తున్న ఈటీవీ లోకల్ గా ఆహాను...

సౌందర్య శోభనను మర్చిపోతే ఎలా

దీంట్లో దివంగత సౌందర్య ఒరిజినల్ లో నటించిన శోభనకు ఎంత...

శ్రీలీల సెలవుపై రామ్ పేలిపోయే కామెంట్

రామ్ ఎంత సరదాగా అన్నా అందులో నిజం లేకపోలేదు. శ్రీలీల...

చంద్రముఖి 2 అసలు ట్విస్టు చెప్పేశారు

ప్రస్తుతానికి బజ్ పెద్దగా లేకపోయినా చేతిలో ఉన్న అయిదు రోజుల్లో...