పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. మంచి సంతానం కోసం, సంతానం లేని వాళ్ళు సంతా నం కలగడం కోసం ఈ వ్రతం జరుపు కుంటారు అని పురాణాలు చెబుతున్నాయి. వారసుడు కావాల నే కోరిక … తమ తరువాత ఆడపిల్ల ల బాగోగులు చూసుకోవడానికి ఒక మగ సంతానం కావాలనే కోరిక కొంతమందిలో బలంగా కనిపిస్తూ వుంటుంది. ఈ విషయంగా ఎక్కువకాలం నిరీక్షించవలసి వచ్చినప్పుడు, పుత్ర గణపతి వ్రతం జరుపుతుంటారు. త్రిగుణాత్మకం స్వరూపుడు , తైమూ ర్త్య భావనతో విరాజిల్లుతున్న వినాయకుడు వైదిక కాలం నుండి భారతా వనిలో ఆది దైవ స్వరూపం గా ఉపాసించ బడుతున్నాడు . ప్రకృతిలో రజస్తమో గుణాది స్వరూపు డైన విఘ్నేశ్వరుని ‘ గుణేశుడు ‘ అని అభివర్ణించారు. కాలక్రమేణ గణేశుడు అయినాడు . గాణాపత్యం సంప్రదాయానుసారం గణము అనగా సత్య రజస్తమో గుణ సమ్మేళనం. ఈ త్రిగుణాధిపతి విఘ్నేశ్వరుడు పురాణేతిహాసాల బట్టి సకల దేవతా గణాలకు అధిపతి కనుక గణపతి సార్థక నామధేయం కలిగింది. లింగ పురాణం ప్రకారం బలగర్వితులైన రక్కసులు, స్వర్గ లోకాన్ని ఆక్రమిం చి, దేవతలను అష్ట కష్టాలకు గురి చేయగా వారు పరమ శివుని ప్రార్థిం చగా, ఆయన రాక్షస సంహారానికి గణపతిని సృష్టించి, రాక్షసులను సంహరించ మనగా, అందులో తన ప్రమేయం లేదని, ఆగ్రహించిన పార్వతి, పరమేశ్వరునిపై కోపాన్ని గణపతిపై ప్రదర్శించి, ఏనుగు తలతో, బాన కడుపుతో, వికార రూపుడై ఉండునటు శపించగా, చింతా క్రాంతుడైన గణేశుని, శివు డూరడించి, సకల దేవత గణాధి పతిగా, సకల విఘ్న నివారణ దైవంగా అనుగ్రహించాడు. మరో కథనం ప్రకారం గజాసురుని సంహ రించి, పరమేశ్వరుని అనుగ్రహంతో పార్వతి చేత పిండి బొమ్మగా చేయబడి, ప్రాణాలు కోల్పోయిన గణపతి, గణాసురుని తలతో పునరుజ్జీవితుడైనట్లు ప్రచారంలో ఉంది. ఆ సమయంలో పరమేశ్వ రుడితో సహా దేవతలందరూ పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుని స్తుతించిన స్తుతిని విన్న అమ్మ వారు, ఎవరైతే ఈస్తుతిని గౌరీ సమేత గణపతిని ఫాల్గుణ శుక్లచవితి యందు పఠించి నువ్వులు, బెల్లము నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో అట్టి భక్తులందరికీ నాకే విధముగా అయితే పుత్రశోకము తొలగి పుత్రవృద్ధి కలిగినదో అదే విధముగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగునని జగదంబ పార్వతి వరమిచ్చినట్లు పురాణ కథనం.భాద్రపద శుద్ధ చవితి నుండి సరిగ్గా180 డిగ్రీలు అంటే 180 రోజులు అంటే ఆరు నెలలు గడిచే సరికి ఫాల్గుణ శుద్ధ చవితి వస్తుంది. ఆనాటికి వినాయక చవితికి గణ పతి నక్షత్ర సమూహం సూర్యాస్త మయం కాగానే ఉదయిస్తుంది. వేదంలో చెప్పిన సూత్రం ప్రకారం – ఆనాడు కూడా పూజ్యదేవత గణపతే. అందుకే ధర్మశాస్త్ర కారకులు ఆనాడు “పుత్ర గణపతి వ్రతం” అన్నారు.పూర్వం మహారాజులు … చక్రవర్తు లు వారసత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇచ్చిన కారణంగా వాళ్లంతా పుత్ర సంతానాన్ని ఎక్కువగా కోరుకునేవారు. తమ తరువాత తమ రాజ్య భారాన్ని కొడుకే స్వీకరించాలని వాళ్లు భావించే వాళ్లు. ఇక పున్నామ నరకం నుంచి తప్పించే వాడు పుత్రుడే అనే మహర్షుల వాక్యం కారణంగా కూడా వాళ్లు పుత్ర సంతానం కోసం ఆరాటపడే వాళ్లు. ఇందుకోసం వాళ్లు ‘ఫాల్గుణ శుద్ధ చవితి’ రోజున ‘పుత్ర గణపతి’ వ్రతాన్ని ఆచరించే వాళ్లు.అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల విశేషం కారణంగా పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. మొక్కు బడిగా కాకుండా ఎవరైతే అంకిత భావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతి కాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజున ఎవరైతే తమకు పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజి స్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.రాజులు తమ ప్రాభవాన్ని కోల్పోయినా … రాచరికాలు గత చరిత్రగా మిగిలిపోయినా ‘పుత్రగణపతి వ్రతం’ మాత్రం నాటి నుంచి నేటి వరకూ ప్రాచుర్యాన్ని పొందుతూనే ఉంది. ఫాల్గుణ శుద్ధ చవితి రోజున ఉదయాన్నే తల స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాల ను ధరించాలి. వాకిట్లో ముగ్గులు పెట్టి, గడపకు పసుపు రాసి కుంకుమ దిద్ది, గుమ్మానికి తోరణాలుకట్టి, పూజా మందిరాన్ని అలంకరించాలి. ఈ రోజున ఉప వాస దీక్షను చేపట్టి, స్వామి వారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకు ఇష్టమైన పండ్లను … పిండి వంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమ నిష్టలను ఆచరిస్తూ అంకిత భావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది.
