5.1 C
New York
Wednesday, March 29, 2023
HomeEntertainmentMovie Updates5 భాష‌ల్లో భారీగా విడుద‌ల‌కి సిధ్ధ‌మ‌వుతున్న‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ "పుష్ప"‌

5 భాష‌ల్లో భారీగా విడుద‌ల‌కి సిధ్ధ‌మ‌వుతున్న‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప”‌

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

అలావైకుఠ‌పురంలో లాంటి ఇండ‌స్ట్రి హిట్ త‌రువాత‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రంగస్థ‌లం‌ లాంటి ఇండ‌స్ట్రిహిట్ త‌రువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం లో ఆర్య‌, ఆర్య‌2 చిత్రాల త‌రువాత హ్యాట్రిక్ చిత్రం గా తెర‌కెక్కుతున్న చిత్రం పుష్ప‌. ఈ చిత్రాన్ని వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్  ప్రోడ‌క్ష‌న్ హౌస్ గా టాలీవుడ్ లో పేరుగాంచిన ‌ మైత్రీ మూవీ మేకర్స్ మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియా తో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ప్ర‌తి అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవ‌టం విశేషం. టైటిల్, ఫ‌స్ట్ లుక్‌, షూటింగ్ అప్‌డేట్ లు కి వ‌చ్చిన క్రేజ్ వ‌రల్డ్ వైడ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నే కాకుండా తెలుగు ప్రేక్ష‌కుల్ని కూడా విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మ‌న్య ప్రాంతం మారేడిమిల్లి డీప్ ఫారెస్ట్ లో పుష్ప షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ షూట్ షెడ్యూల్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు చిత్రంలో ఉన్న ఇతర తారాగణం పాల్గొంటున్నారు. ఈ షూటింగ్ కొసం వ‌ణికిస్తున్న చ‌లిలో అడ‌విప్రాంతం లో అల్లు అర్జున్ తో పాటు చిత్రం యూనిట్ అంతా తెల్ల‌వారుజామున 4 గంట‌ల‌కి లేచి షూటింగ్ కార్య‌క్ర‌మాల్లో బిజి అవ్వ‌టం విశేషం. ఎంత‌క‌ష్టమైనా స‌రే అభిమానుల‌కి, ప్రేక్ష‌కుల‌కి మంచి అవుట్‌పుట్ ఇవ్వాల‌నే ల‌క్ష్యంతో పుష్ప యూనిట్ అంతా ప‌నిచేస్తున్నారు. ఈ చిత్రం లో పుష్ప‌రాజ్ కి జోడిగా ర‌ష్మిక న‌టింస్తుంది. ర‌ష్మిక లుక్ కూడా చాలా నేచుర‌ల్ గా వుంటుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన ఆడియో హైలెట్ గా నిలుస్తుంది. అల్లు అర్జున్‌, సుకుమార్ , దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్ లో ఆడియో కి ఒక క్రేజ్ వుంటుంది. అలాగే మైత్రిమూవీస్‌, దేవిశ్రీప్ర‌సాద్ కాంబినేష‌న్ లో వ‌చ్చే ఆడియో కి ఓ క్రేజ్ వుంటుంది. ఇప్ప‌డు వీరందరి కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ పుష్ఫ ఆడియో కి క్రేజ్ వేరే లెవెల్ అనే చెప్పాలి. సినిమాటోగ్రాఫ‌ర్ మిరోస్లోవ్ కుబ బ్రోజెక్ విజువ‌ల్స్ అల్లు అర్జున్ అభిమానుల్ని, ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌చేసి తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల‌, క‌న్న‌డ మ‌రియు హింది భాష‌ల్లో ఏక‌కాలంలో విడుద‌ల అగ‌ష్టు 13న విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు నిర్ణ‌యించుకున్నారు. ఈ చిత్రం త‌ప్ప‌కుండా అన్ని త‌ర‌హ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్ట‌కునేలా తెర‌కెక్కిస్తున్నారు.

నటీనటులు :స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (హీరో)రష్మిక మందన్న (హీరోయిన్)

Stylish Star Allu Arjun and creative film-maker Sukumar’s Pushpa, bankrolled by Mythri Movie Makers to release simultaneously in 5 languages on 13th August
Stylish Star Allu Arjun and creative film-maker Sukumar are in rich vein of form as they have scored industry hits with Ala Vaikunthapurramuloo and Rangasthalam respectively. The duo previously collaborated for two blockbusters namely Arya and Arya 2. They are coming together again for pan-India project ‘Pushpa’ and Mythri Movie Makers, Muttamsetty media are jointly bankrolling it. The title and first look poster of the film had garnered a unanimously positive response from Allu Arjun’s fans and Tollywood followers alike. The shooting is presently going on at Maredumilli forest region, Andhra Pradesh and Allu Arjun, along with other lead cast is taking part in the same. In the ongoing schedule, Allu Arjun and the remaining unit members are braving freezing cold conditions and are shooting right from 4 AM in the morning. 
Talented young actress Rashmika Mandanna is pairing up with Allu Arjun who plays Pushpa Raj in the film. Devi Sri Prasad, Allu Arjun, and Sukumar have produced musical blockbusters in the past and they are collaborating again for Pushpa. Moreover, acclaimed cinematographer Miroslav Kuba Brozek’s visuals are said to be another major highlight of Pushpa.
Today, the makers of Pushpa have announced that the rustic action thriller will be hitting the big screens across the globe on 13th of August. The film will be simultaneously releasing in 5 languages namely Telugu, Tamil, Malayalam, Kannada, and Hindi. Also, a stunning poster of the film, showcasing Allu Arjun in a rugged look was released on the occasion. 
Star cast: Stylish star Allu ArjunRashmika Mandanna

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments