స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన మిత్రుడు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రం చేస్తున్నారు.ప్రస్తుతం బన్నీ ఈ చిత్ర షూటింగ్ లో బాగా బిజీగా ఉన్నాడు.ఈ చిత్రంలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్న నటిస్తుంది.ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకర్షిస్తుంది.ఈ చిత్రంలో జగపతి బాబు,ప్రకాష్ రాజ్,సునీల్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చనున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం నుండి తాజాగా వచ్చిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అదేంటో ఇప్పుడు చూద్దాం.
పక్క మాస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేగంగా పూర్తి చేయాలని దర్శకుడు సుకుమార్ భావిస్తున్నారట.అందుకే పెద్ద గ్యాప్ ఇవ్వకుండా ఈ నెల 17వ తేదీ నుండి మూడవ షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారట.ఈ షెడ్యూల్ తమిళనాడులోని
తెన్కాసి లో జరగనున్నది.