సత్కర్మలకు ఉద్దిష్టమైనది పురుశోత్తమ మాసం

Date:

అధిక మాసము చంద్ర మానము ద్వారానే వస్తుంది. చాంద్ర మానం అంటే చంద్ర కళలను (తిథులను) ఆధారంగా ఒక నెల రోజులను లెక్కించడము. సూర్యుడు ఏడాదిలో 12 రాశుల చక్రాన్ని పూర్తి చేస్తే చంద్రుడు రోజుకు ఒక నక్షత్రం చొప్పున నెలకు 27 నక్షత్రాల దగ్గరే వుంటాడు. సూర్యుడి చుట్టు భూమి తిరగడానికి 365 రోజులా, 6 గంటలు, 11 నిముషాలు 31 సెకెండ్లు. పడుతుంది. చంద్రునికైతే 324 రోజులే పడుతుంది. వీరిద్దరి మధ్య సుమారు 41 రోజులు తేడా ఉంది. ఈ వ్యత్యాసం వల్ల భూమి సూర్యుని చుట్టు 19 సార్లు తిరిగితే చంద్రుడు 235 సార్లు తిరుగు తున్నాడు. దాని వలన 19 సంవత్సరాలకు….. ఏడాదికి 12 మాసాల చొప్పున 228 మాసాలు రావలసి వుండగా 235 వస్తున్నాయి. అనగా చంద్రుడు 7 నెలలు అధికంగా తిరుగు తున్నాడని అర్థం. ఆ లెక్కన ప్రతి ముప్పై రెండున్నర సౌర
మాసాలకు ఒక చంద్ర మాసం అధికంగా.. వస్తుంది. ఈ విషయాన్ని మొట్ట మొదట గ్రహించిన వారు భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞలే. మూడు సంవత్సరాలకు ఒకసారి సూర్య చంద్రుల గతిలో కలిగే ఒక నెల భేదాన్ని సరిపెట్టడానికి పంచాంగ కర్తలు ఒక చంద్రుని మాసం అధికంగా కలపడం జరుగుతున్నది. చాంద్రమానం ప్రకారం సూర్యుడు ఒక రాశినుండి మరో రాశికి చేరే సమయం 29 రోజుల 12 గంటల 44 నిమిషాలు. అంటే సంవత్సరానికి ఈ లెక్కన 354 రోజులు 9 గంటల సమయం అవుతుంది. అంటే 365 రోజులకు దాదాపు 11 రోజులు తక్కువ. అందుకే ఈ వ్యత్యాసాన్ని సమం చేయడానికి మూడు సంవత్సరాలకు ఒక శూన్య మాసం ఏర్పడుతుంది. దీనికి అధిక మాసం పురుషోత్తమ మాసం, మలమాసం అని కూడా అంటారు. సూర్య సంక్రాంతి లేకుండా పోయిన చాంద్ర మాసానికి అధిక మాసం అని పేరు పెట్టారు. సాధారణంగా ఒక నెలను కొలవటానికి చంద్రుడు భూమి చుట్టూ తిరగడాన్ని ప్రమాణంగా తీసుకుంటూ వుంటాం. భూమి చుట్టూ చంద్రుడు ఒక్కసారి తిరిగితే అది నెల కింద లెక్క దానినే చాంద్ర మానం అని కూడా అంటారు. అయితే అలా 12 రాశులలో చంద్రుడు తిరిగిన సమయాన్ని మనం సంవత్సరం అని అనలేం. ఎందుకంటే, సూర్య మానానికి చంద్ర మానానికి మధ్య పదకొండుం పావు రోజుల తేడా వుంది కదా. అదే సూర్యుడు 12 రాశులలో ఒక్కో రాశిలో ఒక్కో నెల సంచరించడాన్ని సౌరమానం అంటాం. సూర్యుడు ఒక రాశిలో నుంచి మరో రాశిలోకి ప్రవేశించడాన్ని రాశి సంక్రమణం అంటారు. సౌరమానం, చంద్రమానాల్లో వున్న తేడా కారణంగా సూర్యుడు ఒకే రాశిలోనే ఒక నెల కంటే ఎక్కువ కాలం సంచరించాల్సి వస్తుంది. దానినే అధిక మాసం అంటాం. ఇందులో మొదటి నెలలో రవి సక్రాంతి వుండదు. ఒక్కో రాశిలో ఒక నెల పాటు తిరగాల్సిన సూర్యుడు…… రెండు నెలల పాటు ఒకే రాశిలో వుండటం వల్ల ఏర్పడేదే అధిక మాసం. మాసంలో పౌర్ణమి వచ్చినప్పటికీ, ఆ పౌర్ణమితో కూడుకున్నటు వంటి విశేష గుణగణాలు కనిపించవని పండితుల వివరణ. ఈ సమయంలో సంక్రమణం కూడా రాదు. అసంక్రాంతి, ద్విసంక్రాంతి వస్తుంది. ఏ మాసంలో అయితే సంక్రమణం ఉండదో ఆ మాసమే అధిక మాసం అని అంటున్నారు. చాంద్రమాన మాసం సౌరమాన మాసం కన్నా చిన్నది. కనుక ఒక్కొక్కప్పుడు ఒక చాంద్ర మాన మాసంలో సౌర మాసం ఆరంభం కావడం జరగకుండా పోతుంది. అటువంటప్పుడు ఇలా అధికంగా వచ్చే అధికమాసం శుభకార్యాలకు, ముఖ్యమైన దైవ కార్యాలకు పనికి రాదని నిషేధించారు. అధిక మాసము ఎప్పుడూ చైత్ర మాసము నుండి ఆశ్వయుజ మాసము మధ్య లోనే వస్తుంది. ఒక సారి అధిక మాసము వచ్చాక తిరిగి 28 నెలలకు మరోసారి వస్తుంది. ఆ తర్వాత 34, 35, 28 నెలలకు వస్తుంది. అధిక మాసం ముందు వచ్చి ఆ తర్వాత నిజ మాసం వస్తుంది. ఈ అధిక మాసాన్ని మైల మాసం అని అంటారు. అనగా ఈ అధిక మాసంలో ఎలాంటి శుభ కార్యాలు చేయ కూడదు. అయితే ఈ మాసంలో సకల దేవతలకు పూజలు మాత్రం చేయొచ్చు. ఎందుకంటే ఇవి శుభ కార్యాలు కాదు. ఈ అధిక మాసంలో పుణ్య కార్యాలైన సత్య నారాయణ వ్రతం, దేవుళ్లకు అభిషేకాలు, నవగ్రహ హెూమాలు, నవగ్రహ జపాలు, శాంతి పూజలు ప్రత్యేకించి భాగవత పారాయణం, రామాయణ పారాయణం, ఆంజనేయ స్వామికి సంబంధించి హనుమాన్ చాలీసా వంటివి కచ్చితంగా చేయాలి. ధర్మశాస్త్రం ప్రకారం అధిక మాసములో నిత్య, నైమిత్తిక కర్మలు, ఉపవాసం, ఏకభుక్తం, నక్తం, యాచితం మరియు దానం అనే ఆరు దేవకార్యములు చేయ వచ్చును. అపూర్వ తీర్థ గమనం, నామకరణం, అన్న ప్రాశన, చౌలము, అక్షరా భ్యాసము, ఉపనయన, వివాహాదులు, రాజాభిషేకము, నూతన అనుష్టానము, ప్రతిష్టలు, తత్సంబంధ ఉత్సవాలు, సర్వం ప్రాయ శ్చిత్తము, ఆశ్రమ స్వీకారము అలాగే కాలసహజ మైన కామ్యకర్మలు ఈ అధిక మాసములో చేయకూడదు. పండుగలు ఇతర శుభ కార్యాలు నిజమా సమందే కాని, అధిక మాసంలో చేయక పోవడం అనాదిగా ఆచరిస్తూన్న సంప్రదాయం. విశేషించి సర్వ సంపద సమృద్ధి, అనేక జన్మలలో చేసిన పాప నాశనానికి ప్రీతికై సూర్య నారాయణుని అర్చించడం సదాచారం. పురాణాది పఠనాలు, రాత్రి ఏకభుక్తం లేదా పగలు ఏకభుక్తం, ఉపవాసం, మౌన వ్రతం, అఖండ దీపారాధన తదితర సత్కర్మలు ఆచరించడం పరిపాటి. జూలై 18నుండి ఆగస్టు16వ తేదీ వరకు నెల రోజుల పాటు పాటించగల పురుషోత్తమ (శూన్య లేదా మల) మాసం మంగళ వారం ప్రారంభం అయింది. సకల చరాచర సృష్టి ప్రారంభమై 195,58,85,119 సంవత్సరాలు పూర్తి, 120 సంవత్సరం నడుస్తున్నట్లుగా ప్రాచీన గ్రంథాలు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న కలి యుగంలో 5,124వ సంవత్సరం, శాలివాహన శకంలో 1945, విక్రమార్క శకం 2080
నడుస్తున్నది. భారతీయ ప్రాచీన కాలగణన విధానం శాస్త్రీయ మైనది. ప్రతి సంవత్సరానికి 12 మాసాలు ఉంటాయి కాని, ఈసారి శోభక్రుతు నామ సంవత్సర శ్రావణ మాసం అధికంగా రావడం జరిగింది. దీని మాసాధిపతి శ్రీమహా విష్ణువు కనుక పురుషోత్తమ మాసమని పేరు. ఇది సూర్య సంక్రాంతి రహిత మాసం. ప్రతా చరణలో భాగంగా 33 కోట్ల దేవతలను సంతృప్తి పరిచేందుకు వారికి ప్రతినిధి యైన ప్రత్యక్ష దైవం సమస్య సౌర కుటుంబానికి పెద్దగా భావించే సూర్యునికి 33 అపూపములు, ఘృతము, పాయసం, భక్ష్యములు, దక్షిణలు ఉంచిన పాత్రలో, ఆవు నెయ్యి, బంగారమును కలిపి ప్రాత దానం చేయాలని, అలాగే 33 మందికి పాల, తాంబూల, మధుర పదార్థ, అన్న, దీప, శయ్య, గో, లక్ష్మీ నారాయణ ప్రతిమలు దానం చేయాలని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. సౌరమాస పరిధిలో చాంద్రమాసం ఇమిడినపుడు అది అధికమాసం అని అర్థమవుతున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...