భారీ ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు ఎట్టకేలకు వైద్యురాలి హంతకులను చర్లపల్లి జైలుకు తరలించారు. గట్టి బందోబస్తు మధ్య నిందితులను పోలీస్ వాహనాల్లో తరలించారు.
మరోవైపు ఆందోళనకారులు వాహనాలకు అడ్డుగా వచ్చి నిరసన తెలిపారు. పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో వాహనాలపై రాళ్లు విసిరారు.
దీంతో షాద్‌నగర్ పరిసరాలన్నీ టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంకోవైపు నిందితులను శిక్షించకుండా.. ప్రజలపై లాఠీఛార్జ్ చేయడమేంటని ఆందోళనకారులు ప్రశ్నిస్తున్నారు.
నిందితులకు మెజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. మెజిస్ట్రేటే షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు నిందితులను విచారించారు. రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు..