Priyadarshi Rahul Ramakrishna: ప్రియదర్శితో తనను పోల్చొద్దంటున్న రాహుల్ రామకృష్ణ.. నెట్టింట దుమారం రేపుతున్న ట్వీట్?

Date:


ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ కమెడియన్ లుగా రాణిస్తూ దూసుకుపోతున్నారు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. వీరిద్దరితో పాటు వెన్నెల కిషోర్ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది.

 Rahul Ramakrishna Reply On Comparision With Priyadarshi Pulikonda-TeluguStop.com

ఇటీవల కాలంలో ఏ సినిమా విడుదల అయినా కూడా ఆ సినిమాలో ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ ల సంఖ్య తగ్గిపోవడంతో ఈ ముగ్గురు కమెడియన్లకు ప్రాముఖ్యత విపరీతంగా పెరిగిపోయింది.

అయితే ప్రియదర్శి( Priyadarshi Pulikonda ) ఇద్దరూ ఇద్దరే.తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఇది ఇలా ఉంటే తాజాగా రాహుల్ రామకృష్ణ( Rahul Ramakrishna ) తనను ప్రియదర్శితో పోల్చద్దు అంటున్నారు.ఈ మేరకు ట్విట్టర్ లో ఒక ట్వీట్ ని కూడా చేశారు రాహుల్ రామకృష్ణ.

సోషల్ మీడియాలో మీమ్స్ చేసే పేజ్ ఒకటి ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణను పోల్చుతూ పోస్ట్ చేసింది.బలగం సినిమాలో( Balagam ) ప్రియదర్శి నటనను, ఇంటింటి రామాయణం( Intinti Ramayanam ) సినిమాలో రాహుల్ రామకృష్ణ నటనతో పోల్చింది.

ఇద్దరూ తగ్గట్లేదు.యాక్టింగ్ కుమ్మేస్తున్నారు అని మీమ్స్ లో రాసుకొచ్చారు.

అయితే, ఈ పోస్ట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు రాహుల్.అంతేకాదు, ప్రియదర్శితో తనను పోల్చకండి అంటూ రాసుకొచ్చారు.ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని ట్వీట్ కూడా చేశారు.నా ఆప్తమిత్రుడు ప్రియదర్శి పులికొండ చాలా కష్టపడే వ్యక్తి.నటనకు మాత్రమే అంకితమైన వ్యక్తి.అతడిని ఈ విధంగా నాతో పోల్చడం అతనికి అవమానకరం.

అతని గొప్పతనాన్ని తక్కువ చేసినట్టే.ఈ పోలిక చాలా చీప్‌గా, చెత్తగా ఉంది.

నా స్నేహితుడికి నేనెప్పుడూ దన్నుగానే ఉంటాను అని రాహుల్ రామకృష్ణ రాసుకొచ్చారు.అయితే తన నటనా సామర్థ్యం గురించి రాహుల్ రామకృష్ణనే స్వయంగా ఒప్పుకోగా నెటిజన్స్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు.ప్రియదర్శితో పోలిస్తే రాహుల్ రామకృష్ణ తక్కువేమీ కాదని అంటున్నారు.ప్రిదయర్శికి వచ్చినన్ని మంచి సినిమాలు రాహుల్ రామకృష్ణకు పడలేదంతే అని చెబుతున్నారు.తమకు ఇద్దరూ నచ్చుతారని కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

ఒక్క ఫైట్ కోసం నాలుగున్నర కోట్లా?

అలాగే వందల సంఖ్యలో పహిల్వాన్లను కూడా రప్పించారట. లైటింగ్‌కు కూడా...

డ‌బుల్ ధ‌మాకాలు ఎన్ని బాబోయ్

దాని గురించి ఇంకా ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. ప‌వ‌ర్ స్టార్...

‘పిక్‌ ఆఫ్‌ ది డే’ ఇద్దరి అభిమానులదీ ఒకే మాట!

మళ్ళీ వీరిద్దరూ కలవడం వెనుక రీజన్‌ ఏమిటి.. అని అందరూ...

మహేష్ మొహమాటం ఫ్యాన్స్ ఇరకాటం

కేవలం మొహమాటం వల్లే మహేష్ ఇలా రిలీజ్ కాని సినిమాలకు...