యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ తన మూవీస్ తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నారు.ఈయన తన తదుపరి చిత్రం అక్కినేని నాగార్జున తో చేస్తున్నారు.ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది.ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది.
దీంతో ప్రవీణ్ సత్తార్ తన తదుపరి చిత్రం కోసం తయారు చేసుకున్న మూవీ స్టోరీని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు నేరెట్ చేశాడు.కథ బాగా నచ్చడంతో వరుణ్ తేజ్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఈ మూవీని బివి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించబోతున్నారు.నాగార్జునతో చేస్తున్న మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక ప్రవీణ్ సత్తార్ వరుణ్ తేజ్ తో ఈ మూవీ స్టార్ట్ చేయనున్నారు.
ఈలోపు వరుణ్ తేజ్ గని,ఎఫ్ 3 మూవీస్ షూటింగ్ లను కంప్లీట్ చేస్తారని సమాచారం.