కె.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్,శృతి హాసన్ జంటగా నటిస్తున్న చిత్రం సలార్.ఈ చిత్రం నుండి మరోమారు తాజా అప్డేట్ వచ్చింది అదేంటో ఇప్పుడు చూద్దాం.
నిన్న తమ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్ గా ఫైనల్ అయ్యిందనే విషయాన్ని బయటపెట్టిన మూవీ టీం.తాజాగా ఈరోజు నుండి చిత్ర షూటింగ్ ను వెళ్ళారు.దానికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం సలార్ షూటింగ్ రామగుండం,పెద్దపల్లి ప్రాంతంలో జరుగుతుంది.
రాధే శ్యామ్ చిత్రం తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ తో ఓ చిత్రం చేస్తున్నాడు.ఇందులో దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది.తాజాగా ఈ చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన పేర్లను వైజయంతి మూవీస్ బయటపెట్టింది.
ఒకేసారి రెండు భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న ప్రభాస్ ను చూసి ఫ్యాన్స్ ఫుల్ కుష్ అవుతున్నారు.