రాధే శ్యామ్ షూటింగ్ ను వేగంగా పూర్తి చేస్తున్న ప్రభాస్. తన తదుపరి చిత్రం మహానటి ఫేం నాగ్ అశ్విన్ అనౌన్స్ చేసిన విషయం మనకి తెలిసిందే.అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక అప్డేట్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
వైజయంతి మూవీస్ తాజాగా తమ ట్విట్టర్ ఖాతా ద్వారా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రంలో భాగమైన కొందరు నటి నటులు, టెక్నీషియన్స్ డీటైల్స్ ను అభిమానులతో పంచుకుంది.ఈ చిత్రంలో ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకొనే కనిపించనున్నది.బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపిస్తుండగా,ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ స్వరాలు అందిస్తున్నారు.
సైన్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.గతంలో ఓ అభిమాని ప్రశ్నకు స్పందించిన నాగ్ అశ్విన్ తన చిత్రానికి సంబంధించి మొదటి అప్డేట్ జనవరి 29న, రెండో అప్డేట్ ఫిబ్రవరి 26న విడుదల చేస్తానని అన్నారు.అన్నట్టుగా ఈ చిత్రానికి సంభందించిన మొదటి అప్డేట్ ను జనవరి 29న విడుదల చేశారు.అలాగే ఆయన గతంలో అన్నట్టుగా రెండో అప్డేట్ ను చెప్పిన డేట్ కు రిలీజ్ చేస్తారో లేదో వేచి చూడాలి.
