5.1 C
New York
Sunday, April 2, 2023
HomeEntertainmentMovie Updatesపవన్ మేచ్చిన ఉప్పెన

పవన్ మేచ్చిన ఉప్పెన

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

‘ఉప్పెన’… మన చుట్టూ ఉన్న జీవితాల్ని చూపించే చిత్రం
• తొలి చిత్రంతోనే మంచి పాత్రలో నటించిన వైష్ణవ్ తేజ్ ప్రేక్షకుల మెప్పు పొందుతాడు
• దర్శకుడు బుచ్చిబాబు సానా… నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ వారికి  అభినందనలు
• ప్రముఖ కథానాయకులు ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ గారు

మన జీవితాల్ని… అందులోని భావోద్వేగాల్ని… మన చుట్టూ ఉన్న పరిస్థితులను కథగా తెర మీదకు తీసుకువచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువ కాలం గుర్తుంచుకొంటారు… ఆ కోవలోకి ‘ఉప్పెన’ చిత్రం చేరుతుంది అని ప్రముఖ కథానాయకులు, జనసేన అధ్యక్షులు ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. మన మట్టి పరిమళాన్ని అందించే ఇలాంటి చిత్రాలు ప్రతి ఒకరికీ నచ్చుతాయి అన్నారు. వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఉప్పెన’. మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ సంస్థలు
నిర్మిస్తున్నాయి . ఈ నెల 12వ తేదీన చిత్రం విడుదలవుతోంది. పవన్ కల్యాణ్ గారికి ఈ చిత్రం ట్రైలర్ ను, ప్రమోషనల్ కంటెంట్ ను చిత్ర కథానాయకుడు వైష్ణవ్ తేజ్, దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ చూపించారు. ట్రైలర్ ఎంతో ఆసక్తికరంగా ఉందని చిత్ర బృందాన్ని ప్రశంసించారు.
ఈ సందర్భంగా ‘పవర్ స్టార్’ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “వైష్ణవ్ తేజ్ హీరోగా తొలి చిత్రంలోనే చాలా మంచి పాత్రను ఎంచుకున్నాడు. మొదటి అడుగులోనే సవాల్ తో కూడుకున్న పాత్ర తీసుకున్న వైష్ణవ్ తేజ్ తప్పకుండా ప్రేక్షకుల మెప్పు పొందుతాడు. వైష్ణవ్ ‘జానీ’ చిత్రంలో బాల నటుడిగా… హీరో చిన్నప్పటి పాత్రను పోషించాడు. ఇప్పుడు హీరోగా ఎదిగాడు. ‘ఉప్పెన’లో వైష్ణవ్ చాలా ఆకట్టుకొనేలా ఉన్నాడు. దర్శకుడిగా బుచ్చిబాబు సానా ఈ కథను ఎంతో సమర్థంగా తెరకెక్కించారు అని అర్థం అవుతోంది. మనకు పరిచయం ఉన్న జీవితాలను… అందులోని ఎమోషన్స్ ను… మన నేటివిటీనీ కళ్ల ముందుకు తీసుకువచ్చే చిత్రాలు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటాయి. వీటికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ‘రంగస్థలం’, ‘దంగల్’ ‘లాంటి చిత్రాల్లో ఉండే ఎమోషన్స్ ఎక్కువ కాలం మనకు గుర్తుండిపోతాయి. ‘ఉప్పెన’ కథలోని ఎమోషన్స్ కూడా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయి.
మంచి కథను తెరకెక్కించిన దర్శకుడు బుచ్చి బాబుకీ, ఈ చిత్ర నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు, నటులకు నా అభినందనలు. ‘ఉప్పెన‘ ఘన విజయం సాధించాల”ని ఆకాంక్షించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments