Thursday, December 8, 2022
Homespecial Editionపాత్రికేయ దిగ్గజం పొత్తూరి

పాత్రికేయ దిగ్గజం పొత్తూరి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

పొత్తూరి వెంకటేశ్వరరావు… తెలుగు పత్రికా పాఠకులకు సుపరిచితమైన పేరు. అయిదు దశాబ్దాలకు పైగా పత్రికా రంగంలో మమేకమై, తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన తెలుగు జర్న లిజానికి సాధికారిక గుర్తు ఆయన. విలువలకు ప్రాదాన్యత ఇచ్చి, కట్టుబడి, ఎన్నడూ రాజీ పడని అరుదైన వ్యక్తిత్వం ఆయనది. ఒక ట్రెండ్ సెట్టర్ గా నేటి తరానికి అచ్చమైన స్వచ్చమైన మార్గదర్శి పొత్తూరి.
1934 ఫిబ్రవరి 8వ తేదీన గుంటూరులో జన్మించిన డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు 1957లో ఆంధ్ర జనతా పత్రికలో తొలిసారిగా ఆయన పాత్రికేయుడిగా, తొలి అడుగు వేశారు. ధృఢ చిత్తులై, వృత్తి నిబద్దత, నిజాయితీ, బాధ్యతల విషయంలో ఎన్నడూ వెనకడుగు వేయనే లేదు.

ఈనాడు, ఆంద్రభూమి, ఆంధ్రప్రభ, వార్త దినపత్రికల్లో ఎక్కడ పని చేసినా తన ప్రత్యేక ముద్రలు వేశారు. పొత్తూరి ఐదు దశాబ్దాలకు పైగా తెలుగు పత్రికా రంగంలో అనేక యాజ మాన్యాలను, సంఘటనలను, సందర్భాలను,
పరిణామాలను, మార్పులను గమనించారు. తనదైన ప్రత్యేక శైలి సంపాదకీయాలు రాశారు. పొత్తూరి అంటే ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమి అధ్యక్షుడిగా వ్యవహరించారు. తెలుగు భాషా వికాసానికి, సాహిత్యాభివృద్ధికి నిరంతర కృషి చేశారు. ఎందరో సాహితీ వేత్తలకు వెన్నుదన్నుగా నిలిచి నిలిచి భాషాభ్యున్నతికి చేయూత అందించారు.

దాదాపు నూట యాబై యేళ్ళ తెలుగు పత్రికా చరిత్ర గురించి సంపూర్ణ అవగాహన కలిగి, స్వయంగా ఒక సకల విషయ సంగ్రహ నిధిగా నిలిచారు.
పత్రికా రచనల పట్ల, తెలుగు సాహిత్యం పట్ల అయన అంకిత భావం సాటిలేనిది. అందుకే
తెలుగు పత్రికా రంగంలో మేటి సంపాదకులుగా పొత్తూరి గుర్తింపు పొందారు. సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, చమత్కార, జ్ఞాన, విజ్ఞాన, రాజకీయ ఒక్కటేమిటి పాత్రికేయులకు ఉండాల్సిన అన్ని అంశాలలో అపారమైన జ్ఞాన సంపన్నులుగా అసమాన ప్రతిభ కనబరిచారు.

“నాటి పత్రికలు విలువలు పాటించేవి. సంపాదకులు నడిపించేవారు. నేడు పరిస్థితి వేరు. యజమానులే నడిపిస్తున్నారు. పత్రికల ప్రతులు ఎక్కువ సంఖ్యలో అమ్ముకోవడానికి తాపత్రయ పడుతున్నారు. విలువలు పడి పోయాయని” తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండే వారు. యాజమాన్యాల భావజాలాలు అనుగుణంగా కాకుండా, సర్వ స్వతంత్రులుగా వ్యవహరించే వారు. కొన్ని సందర్భాలలో యాజమాన్యం ఆంక్షలు విధించితే, రాజీ పడక, రాజీనామా చేసి వెళతానని నిక్కచ్చిగా చెప్పేవారు పొత్తూరి వెంకటేశ్వరరావు. ఆయన వ్యాస పరంపర ఎంతో విలువైన సమాచారాన్ని విలువ కలిగిన సమాచార యుక్తంగా సామాన్య భాషలో, సూటిగా ఆకర్షణీయంగా ఉండేవి. తుదిశ్వాస వరకు జర్నలిజం విలువలకు కట్టుబడి తనదైన విలక్షణ వ్యక్తిత్వానికి దర్పణంగా నిలిచిన ధన్యజీవి పొత్తూరి.

నాటి పత్రికల మేటి విలువలు ,
చింతన, చిరస్మరణీయులు, కాశీనాధుని నాగేశ్వరరావు, పారమార్ధిక పదకోశం తదితర రచనలు చేశారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నక్సలైట్లతో జరిపిన చర్చల్లోపౌర స్పందన వేదిక సభ్యుడిగా పొత్తూరి క్రియాశీల పాత్ర పోషించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణలకు గౌరవ సంపాదకత్వం కూడా వహించారు. లోకాయుక్త కమిటీలో జ్యుడీషల్ సభ్యుడిగా, సలహాదారుగా పొత్తూరి పనిచేశారు. పొత్తూరి వెంకటేశ్వరరావు బ్రిటీష్ లైబ్రరి సభ్యత్వం కలిగి ఉన్న అపురూప గౌరవం దక్కించు కున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పొత్తూరి రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక రాష్ట్ర వాదనకు ఆయన మద్దతు తెలిపారు. 2020 మార్చి 5న పొత్తూరి లోకాన్ని వదిలి వెళ్లారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments