శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల కోసం ము చ్చింతల్ దివ్య క్షేత్రం ముస్తాబైంది. ఫిబ్రవరి 2 నుంచి 14వ తేదీ వరకు వేడుకలను కనీ వినీ ఎరుగని రీతి లో నిర్వహించ నున్నారు. ఉత్సవా ల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయు డు, ప్రధాని నరేంద్ర మోదీ, పలువు రు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్య మంత్రులు పాల్గొన నున్నా రు. ఫిబ్రవరి 2న ఉత్సవాలకు అంకురార్పణ, 3న అగ్ని ప్రతిష్ట, అష్టాక్షరి జపం; 5న ప్రధాని మోదీ రాక; రామానుజాచార్య మహా విగ్రహావిష్కరణ, జాతికి అంకితం; 8, 9 తేదీల్లో: ధర్మసమ్మేళనం; 9న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రాక; 10న సామాజిక నేతల సమ్మే ళనం; 11న సామూహిక ఉప నయ నం; 12న విష్ణు సహస్రనామ పారా యణం; 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాక; 14న మహా పూర్ణా హుతి ప్రధాన కార్యక్రమాలు జరగనున్నాయి.
రాజా ఆదరణ పొంది ప్రాబల్యాన్ని సంతరించుకున్న జైన, బౌద్ధ, శైవ మతాలు స్థానిక ఆచార వ్యవహా రాలలో కలసి, అనేకానేక శాఖలుగా విభజితాలై, వేర్వేరు సిద్ధాంతాలను ప్రతిపాదిస్తూ తమ శాఖలు గొప్ప వని నొక్కి చెబుతూ, మూల ఉపని షత్తుల సారాన్ని ప్రజలకు చేరువ చేయజాలని సమయాన, విశిష్టాద్వై తాన్ని ప్రతిపాదించి ఉద్దరించారు శ్రీ రామానుజాచార్యులు. త్రిమతాచార్యులలో, ద్వితీయు లైనా, కర్తవ్య నిర్వహణలో అద్వితీ యులు. అసమాన ధైర్యాన్ని ప్రదర్శించి, సాటిలేని భక్తి తత్పరు నిగా తత్వవేత్తగా, ఆస్తిక హేతు వాదిగా, పరమ యోగిగా, శంకర భగవత్పాదుల అద్వైత సిద్ధాంతం లోని దోషాలను సరిదిద్ది, నాటికి ప్రబల ప్రచారంలో ఉన్న సంప్రదా యాలన్నీ, దేవుడిని కొలవడానికి భిన్న మార్గాలే కాని, వైదిక మతానికి బదులుగా పాటించా ల్సినవి కానే కాదని నొక్కి చెప్పిన ధీశాలి ఆయన. రామానుజులు జన్మించే నాటికి చోళులు, శైవ మతాను యాయులు అయినప్పటికీ, వైదిక మతాలను వ్యతిరేకించ లేదు. చాళుక్యులు శైవ మతస్తులు అయి ఉండి, తర్వాత జైన మతాన్ని ఆలపించారు. హొయసల రాజులు, జైన, వీరశైవ మతాలను ఆదరించా రు. మౌర్యుల కాలానికి బౌద్ధం క్షీణ దశకు చేరుకుంది. మద్రాసుకు 30 మైళ్ళ దూరాన గల, శ్రీపెరుంబు దూరులో, హరిత గోత్రోధ్భవులు, ఆపస్తంభ సూత్ర, యజుర్వేద శాఖాధ్యాయులు, శ్రీమాన్ అసూరి సర్వ క్రతు కేశవ సోమయాజి దీక్షితార్, కాంతిమతి దంపతులకు కలియుగ సంవత్సరం 4118 క్రీస్తు శకం 1017 వైశాఖ శుక్ల పక్ష షష్టి గురువారం జనన మొందారు. కేశవ తన కుమారునికి, ప్రాథమిక విద్య స్వయంగా నేర్పగా, అనంతరం కాంచీపురానికి వెళ్లి యాదవ ప్రకా శుల వద్ద వేదాంతం అభ్యసించి, మూలానికి వ్యాఖ్యానం చేయడం లో గురు – శిష్యులకు భేదాభిప్రా యాలు కలువగా తమ విశిష్టాద్వై తాన్ని నెగ్గించుకున్నారు రామాను జులు. దీనితో గురువు కాశీకి కలసి తమతో పయనమైన, శిష్యుడిని చంపించే కుట్ర చేయగా, అది తెలు సుకుని, తప్పించుకొని కంచికి చేరా రు. శ్రీరంగంలోని వైష్ణవ గురువైన అలవందారు, రామానుజుని ప్రతిభ గురించి విని శిష్యుడైన, పెరియ నంబిని పంపగా, వెనువెంటనే ఆయన పయనమయ్యారు. రామా నుజుడు, శ్రీరంగం చేరే సమయా నికి, ఆలవందారు తుది శ్వాస వదిలారు. భౌతిక దేహ వేళ్లలో, 3 విచిత్రంగా ముడుచుకొని ఉండడా న్ని గమనించారు. ఆయన మూడు కోరికలు తీరకుండా ఉండిపోయా రని, అలవండారు శిష్యుల ద్వారా విని, మూడు కోరికలు అయిన, బ్రహ్మసూత్రాలకు, సహస్ర నామాల కు, తరువాయి మొళికి వ్యాఖ్యానా లు రాస్తామని, వాగ్దానం చేయడం తో మూడు వేళ్ళు తెరుచుకున్నా యని చెబుతారు. తర్వాత మధు రాంతకంలో పెరియ నంబికి శిష్యు లుగా మారారు. విద్యాభ్యాస సమయాన, తన భార్య గయ్యాలి తనం కారణంగా, గురువు శ్రీరంగం వెళ్లనందుకు నొచ్చుకున్న రామాను జులు, సంసార బంధం వీడి, సన్యాసాశ్రమం స్వీకరించారు. తిరు కోటి యార్ నంబి ప్రఖ్యాతి విని, తనను శిష్యునిగా స్వీకరించమని, ఆరు మార్లు ప్రాధేయ పడినా, ఫలితం లేక పోగా, ఏడవ సారి చేర బిలిచి, మంత్ర రహస్యం ఎవరికీ చెప్ప కూడదని వాగ్దానాన్ని పొంది, ఉపదేశం చేశారు. మోక్ష సంపాదన కు ఆ మంత్ర శక్తి సాధనం లేదని భావించి, ఒక వైష్ణవాలయం గోపు రం ఎక్కి, గురువుకు చేసిన ప్రమా ణాన్ని పక్కన పెట్టి, ఉపదే దేశిత మంత్రాన్ని, బహిరంగంగా ఎలుగెత్తి ప్రకటించారు. గురువు కోపంతో నరకానికి వెళతావు అని అన్నప్పు డు, జన సమూహానికి మోక్షం లభిస్తే, తాను ఒక్కడు నరకానికి వెళ్ళడానికి సిద్ధమని బదులు ఇచ్చారాయన. శిష్యుని ఉన్నత ఆదర్శానికీ, సంతోషించి, గురువు ఆశీర్వదించారు. అద్వైత వేదాంతి యగు, యజ్ఞమూర్తితో, శ్రీరంగంలో 16 రోజులు వాదించి, ఓడించగా, ఆయన శైవం పుచ్చుకున్నారు. బ్రహ్మ సూత్రాలకు భాష్యం, వేదాంత సారం, వేదాంత దీపం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, మొదలైన రచనలు చేశారు. తిరుపతి దేవస్థా నంలో పూజాదికాలపై, తగాదా రాగా రామానుజులు మధ్యవర్తిగా ఉండి, వైష్ణవ ప్రాబల్యానికి కట్టు దిట్టం చేశారు. చేసిన వాగ్దానం ప్రకా రం బ్రహ్మసూత్రాలకు వ్యాఖ్యానాలు రాయగా, పరాశర బట్టు చేత సహస్ర నామాలకు, తమ చుట్టమైన తిరుక్కురైప్పిరన్ చేత తిరువాయి మొలి మీద వ్యాఖ్యానాలు రాయిం చారు. కావేరీ తీర సాలిగ్రామం అనే చోట 12ఏళ్లు నివసించి, జైనులను ఓడించి, బిత్తి దేవుని వైష్ణవునిగా మార్చారు. చాత్తాద శ్రీవైష్ణవులు అమ్మం గార్ల కైంకర్యం చేసే సంప్రదా యాలను ఏర్పరిచారు. మేల్కో టలో, రామ ప్రియ అనే విగ్రహాన్ని తెప్పించి, ప్రతిష్టింపజేసి, రథోత్సవం నాడు ఆలయంలో పంచములకు ప్రవేశం కల్పించారు. శ్రీరంగంలో మత ప్రచారానికి 74 మంది శిష్యుల ను నియమించారు. వ్యాస సూత్ర భాష్యం గీతా భాష్యం, తర్క భాష్యం తదితరాలు రాయడం చేత “భాష్యకారుడు” అని త్రిదండి కావడం వల్ల “యతి రాజు” అని, “ఎంబరు మానారు” అని, లబ్ద ప్రతిష్టులు అయినారు. రామానుజులు ఆనాటి ఆచార వ్యవహారాలు, చాందసంగా మారి, సామాజిక ప్రగతికి అడ్డు రాకముం దే, గుర్తించి వాటిని, మానడమో, మార్చడమో చేయాలని కర్తవ్య నిర్దేశం చేశారు. గురువు చెప్పేదం తా గుడ్డిగా నమ్మక తర్కానికి గురి చేసి, తప్పో, ఒప్పో నిర్ణయించు కోవడం పాపం కాదని, హితవు పలికారు. సమాజ శ్రేయస్సు కన్నా, వ్యక్తిగత శ్రేయస్సు ముఖ్యం కాదని రామానుజులు నొక్కి చెప్పారు.
శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలకు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండ లం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళా శోభితమైన నిర్మాణాలు, వందకు పైగా ఆలయాల గోపురాలపై దేవ తా మూర్తుల మధ్య ప్రపంచ వ్యాప్తంగా కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత ఎత్తయిన విగ్రహాల్లో రెండోది అయిన 216 అడుగుల సమతామూర్తి భారీ లోహ విగ్రహంగా ఎర్పాటు చేశారు.
వాస్తవంగా పరమ హంస పరివ్రాజ కాచార్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సత్ సంకల్పంతో ముచ్చిం తల్ దివ్యక్షేత్ర పనులు 2016లో ప్రారంభమయ్యాయి. 45 ఎకరాల విస్తీర్ణంలో రూ.1000 కోట్లతో పనులు జరిగాయి. పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర నిర్మాణ శైలులను కలగలిపి వివిధ 2700 మంది శిల్పుల భాగస్వా మ్యంతో నిర్మాణాలు చేపట్టగా, ప్రధానంగా.. సమతామూర్తి 216 అడుగుల, 1800 కిలోల బరువు గల మహా పంచలోహ విగ్రహాన్ని 1600 భాగాలుగా తొమ్మిది నెలల కఠోర శ్రమ తో చైనాలో తయారు చేయించారు. మనదేశానికి తెచ్చాక చైనాకు చెందిన 60 మంది నిపుణులు విగ్రహ రూపునిచ్చారు. వెయ్యేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సమతామూర్తి మహా విగ్రహం చుట్టూ శ్రీవైష్ణవంలో దివ్యదేశాలుగా భావించే 108 పుణ్య క్షేత్రాలు, గర్భా లయాల ఆకృతిలో 108 ఆలయా లను నిర్మించారు. వీటిని అనుసం ధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని నిర్మిం చారు. సమతామూర్తి విగ్రహ దిగువ న భద్రవేదిక 54 అడుగులు, పద్మ పీఠం 27 అడుగులు, శ్రీరామాను జాచార్యుల విగ్రహం 108 అడుగు లు, స్వామి చేతిలోని త్రిదండం 27 అడుగుల ఎత్తు ఉన్నాయి. మహా విగ్రహం కింద విశాలంగా ఉన్న గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహ రూపంలో రామానుజులు నిత్యపూజామూర్తిగా దర్శనం ఇస్తారు. అలా వెయ్యేళ్ల క్రితం భారతావనిలో నడయాడిన సమతా మూర్తి జగద్గురు శ్రీరామాను జాచార్యులు నిత్య దర్శనమివ్వనున్నారు.
12 రోజుల పాటు జరిగే ఉత్సవాల గురించి సీఎం కేసిఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. చిన్న జీయర్ స్వామి తో పలు మార్లు చర్చించారు. కార్య క్రమాలలో భాగంగా 120 యాగ శాలల్లో 1035 హోమ గుండాలను సిద్ధం చేశారు. హోమంలో…రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని దేశీయ ఆవుల నుంచి సేకరించిన రెండు లక్షల కిలోల ఆవు నెయ్యిని వినియోగిస్తున్నారు. దేశ నలు మూలల నుండి 5 వేల మంది రుత్వికులు హోమాల్లో, పారాయ ణాల్లో, కోటి అష్టాక్షరి మహా మంత్ర జపాలలో పాల్గొంటున్నారు.