5.1 C
New York
Sunday, May 28, 2023
Homespecial Editionఅలుపెరుగని కమ్యునిస్టు పోరాట యోధుడు మృత్యుం జయుడు

అలుపెరుగని కమ్యునిస్టు పోరాట యోధుడు మృత్యుం జయుడు

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

యజుర్వేద శాఖీయులు అయిన
పేరేప వంశజులు శ్రీకాకుళానికి ఇరవై కిలోమీటర్ల దూరంలోని పేరేప గ్రామ పరిసరాలలో పురోహితులుగా కాక, దేవాలయ ప్రతిష్ఠలు, కళ్యాణాలు చేయించే వేద పండితులుగా పేరెన్నిక గన్నారు. అలాంటి సనాతన వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, పక్కా కమ్యూనిస్టుగా పేరొందిన ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు పేరేప మృత్యుంజయుడు(Perepa Mruthyunjayudu). నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఆ త్యాగమూర్తి వర్ధంతి సందర్భంగా, లభ్యం అవుతున్న సమాచారం ఆధారంగా గుర్తు చేసుకునే చిరు ప్రయత్నం.

పేరేప మృత్యుంజయుడు (అక్టోబర్ 5, 1914 – మే 16, 1950) భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్య్ర సమర యోధుడు.
పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో పేరేప వెంకట సుబ్బయ్య, మహా లక్ష్మిలకు 1914, అక్టోబర్ 5 న జన్మించారు. ఆచంటలో మాధ్యమిక పాఠశాల చదువయ్యాక ధవళేశ్వరం వెళ్లి మేనమామ మొక్కపాటి శేషయ్య ఇంట్లో ఉంటూ రాజమండ్రి ప్రభుత్వ మోడల్‌ సెకండరీ స్కూలులో చదివి, చదువయ్యాక (1933- 34లో) పి.డబ్ల్యు.డిలో రోజు కూలికి మేస్త్రీగా పని చేశారు.1925 ప్రాంతంలో భానుమతి (1917)ని వివాహ మాడారు.

1936 లో నెక్కంటి నరసింహారావు, మీరా లతో పాటు కమ్యూనిస్టు పార్టీ సభ్యులయ్యారు. బస్సు డ్రైవరుగా పనిచేస్తున్న మీరాతో పాటు బస్సు కార్మికులను సంఘటిత పరచే కార్యక్రమం చేపట్టారు.1941-42 ప్రాంతంలో యంవియన్‌ కపర్దీని కూడా మోటారు కార్మిక సంఘ నిర్మాణంలో పాల్గొనేందుకు ప్రోత్సహించారు.1937-39 కాలంలో కాళీపట్నం రైతుల పోరాటానికి నాయకత్వం వహించిన అల్లూరి సత్య నారాయణ రాజు, ఉద్దరాజు రామం లతో కలిశారు. 1940-42 కాలంలో చినమల్లం గ్రామం వద్ద 60- 70 మంది పార్టీ కార్యకర్తలకు మృత్యుం జయుడు ప్రిన్సిపాలుగా నిర్వహించిన శిక్షణా శిబిరంలో సైద్ధాంతిక శిక్షణతో బాటు, ఇందుకూరి సుబ్బరాజు ఆధ్వర్యంలో కొంత మిలటరీ శిక్షణ కూడా యిచ్చారు. మృత్యుం జయుడు…వ్యవసాయ కూలీలతో ఆచంట నుంచి నరసాపురం తహశీల్దారు కార్యాలయానికి 1940లో ఆకలి యాత్ర నిర్వహించారు. 1940-42 మధ్య కొంత కాలం ఆయన జిల్లా పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఏలూరులో జిల్లా పోలీసు స్పెషల్‌ బ్రాంచి వారు ఆయనను అరెస్టు చేసి, స్థానిక జిల్లా సబ్‌ జైలులో 15 రోజులు రిమాండులో వుంచారు. 1944 – 45లో జైలు నుంచి విడుదల అయినాక పాలకొల్లులో కాపురం పెట్టారు. నరసాపురం తాలూకా పార్టీ కార్యదర్శిగా వుంటూ, జిల్లా ప్రజానాట్య మండలి ఆర్గనైజరుగా ఉన్నారు. అల్లు రామలింగయ్య, పినిశెట్టి శ్రీరామ మూర్తి, చలం మొదలగు కళాకారులను ప్రజానాట్య మండలిలోకి తెచ్చింది మృత్యుంజయుడే. నెక్కల పూడి సుబ్బాయమ్మ గారితో కలిసి అన్నా చెల్లెలు పాట (బెంగాలులో కరువు) వేదికల మీద పాడే వారు. చావుకు వెరవకురా అన్న పాట తరచు ఒంటరిగా కూడా పాడుకొంటుండే వారని చండ్ర సావిత్రమ్మ, కొండేపూడి రాధ తదితరులు చెపుతుండే వారు. పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, వావిలాల గోపాల కృష్ణయ్య లతో పాటు, ప్రత్యేకంగా తెలంగాణ పోరాటానికి సహాయం కూడ గట్టడానికి పి.సి.జోషి, పుచ్చలపల్లి సుందరయ్యలు వచ్చి ఆయనతో చర్చలు జరిపారు.

మృత్యుంజయుడు నరసాపురం తాలూకా పార్టీ కార్యదర్శిగా, జిల్లా ప్రజానాట్య మండలి ఆర్గనైజరుగా వున్నారు. రెండవ ప్రపంచ యుద్ధపు చివరి రోజుల్లో బెంగాల్‌ లో భీకరమైన కరువు, తెలంగాణ రైతాంగ పోరాటం నేపథ్యంలో నిత్యావసర వస్తువుల కటకట, దొంగ నిల్వలు, దొంగ రవాణా నివారణకు కృషి చేస్తూ, ఆకలి యాత్రలు నిర్వహించారు. బెంగాలు కరువు, తెలంగాణ పోరాటం గురించి అల్లు రామలింగయ్య, పినిశెట్టి శ్రీరామమూర్తి, చలం మొదలగు కళాకారులతో కలిసి,
ప్రజానాట్య మండలి ప్రదర్శనలు ఇచ్చేవారు. నెక్కల పూడి సుబ్బాయమ్మతో కలిసి ”అన్నా చెల్లెలు” పాట (బెంగాలులో కరువుకు సం బంధించి) వేదికల మీద పాడే వారు.

”చావుకు వెరవ కురా” అన్న పాట వేదికల నుంచి గంభీర స్వరంతో పాడడమే కాక, తరచు ఒంటరిగా కూడా పాడుకొంటుండే వారని చండ్ర సావిత్రమ్మ, కొండేపూడి రాధ చెప్పేవారు. నిజంగా జీవితంలో కూడా ఆయన ”చావుకి వెరవని” వ్యక్తి.

1945-46లో పాల కొల్లులో మునిసిపల్‌ కార్మికుల సమ్మె జయప్రదంగా జరగతంలో ఆయన పాత్ర ఉంది. 1946లోనే సాధారణ ఎన్నికలు జరిగిన క్రమంలో, పార్టీ అభ్యర్థి తరఫున పోలింగు ఏజెంటుగా మోటారు సైకిలు మీద నరసాపురం అసెంబ్లీ నియో జకవర్గం అంతా తిరిగారు.

భీమిరెడ్డి నర్సింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, వావిలాల గోపాల కృష్ణయ్య తెలంగాణ పోరాటానికి సహాయం కూడగట్టడానికి వెళ్ళిన సందరంగంలో పెద్ద బహిరంగ సభ జరిగింది. ఆ తర్వాత, పి.సి.జోషి, పి.సుందరయ్యలు ప్రత్యేకంగా ఆయనతో చర్చలు జరిపారు(Perepa Mruthyunjayudu).

అంతకుముందు ”ప్రజాశక్తి” వార పత్రిక, ద్వైవార పత్రికానున్న సందర్భంగా విరాళాలకి ప్రకటన వచ్చింది. ఆయన తనకి పెళ్లికి అత్తవారిచ్చిన వెండి మరచెంబు, కంచం అమ్మి పంపించారు.
1946లోనే మళ్లీ రహస్య జీవితం మొదలయింది. 1948లో గాంధీజీ హత్య తర్వాత మళ్లీ కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం జరిగింది. విజయవాడలో కమ్యూనిస్టు, ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్తల మధ్య ఘర్షణలు జరగగా, అరెస్టు అయి కైకలూరు సబ్‌ జైలులో దాదాపు 3 నెలలున్నాక తప్పించుకొని మళ్ళీ రహస్య జీవితంలోకి వెళ్ళారు.

1948లో పోలీసు చర్య తర్వాత తెలంగాణ లోనే కాక వెన్నుదన్నుగా వున్న కోస్తా ఆంధ్ర జిల్లాలలోనూ కమ్యూనిస్టు శ్రేణులు ఆత్మరక్షణ చేసుకొనే స్థితిలో పడ్డాయి. పార్టీ ఆదేశం ప్రకారం కామ్రేడ్స్‌ ఇతర ప్రాంతాలకి తరలి వెళ్ళారు. మృత్యుంజయుడు, సంకు అప్పారావు, మరి కొందరు, ఒరిస్సా వెళ్లేందుకు రాజమండ్రిలో ఒక రహస్య స్థావరానికి చేరారు. ఇంతలో స్థావరం యిచ్చిన వ్యక్తి ప్రభుత్వం యిచ్చే పారితోషికానికి ఆశపడి పోలీసులకి ఆచూకీ యిచ్చాడు.

సుందరయ్య ‘వీర తెలంగాణ విప్లవ పోరాటం– గుణపాఠాలు” ప్రకారం మిగతా వారిని పంపించి ఆయన ఖమ్మం ప్రాంతంలో పోరాట శ్రేణుల్లో చేరవలసి వచ్చింది(Perepa Mruthyunjayudu).

పట్టుబడిన వారందరూ చిత్ర హింసలకి గురయ్యారు. మృత్యుం జయుడు పట్టుబడిన కబురు తెలిసి అందరూ స్థావరం మార్చుకున్నారు.”మా స్థావరం ఆయనకు తెలుసు, వచ్చి మమల్ని కలుసుకోవలసి వుంది. ఆయన ఆ బాధలు భరించినందువల్ల మే బతికిపోయాం” అని రాజేశ్వరరావు, సుందరయ్య చెప్పేవారు. 1950 మే 16 బొమ్మూ రు మొట్ట దగ్గర చనిపోయినట్లు పత్రికల సమాచారం ఇచ్చాయి. కాల్చిన యస్‌.ఐ తనికెల సుబ్బారావు రిటైరైన తర్వాత… ఫొటోగ్రాఫర్‌ భూషణ్‌ను కలిసి, కానిస్టేబుళ్ళు మృత్యుంజయుని కాల్చడానికి నిరాకరించగా తాను కాల్చవలసి వచ్చిందని, ఆఖరి గుండు పేల్చే వరకూ ఆయన జయజయ నినాదాలు చేస్తూ నిలబడి వున్నారని చెప్పినట్లు సమాచారం.

అప్పటి సహచరులు, కొరియరులు ఎందరో తమ పిల్లలకు మృత్యుంజయుడు అని పేరు పెట్టు కున్నారు. రాజమండ్రి సెంట్రల్‌ జైలు దగ్గర రిక్షా కార్మికులు తమ కాలనీకి మృత్యుంజయ నగర్‌ అని పేరు పెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపు రంలో ”మృత్యుంజయ నగర్‌ కాలనీ’‘, గ్రంధాలయం ఏర్పడ్డాయి.

రామ కిష్టయ్య సంగన భట్ల.... 9440595494
రామ కిష్టయ్య సంగన భట్ల…. 9440595494

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments