– ఎమ్మెల్యే పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్‌రెడ్డి అనారోగ్యంతో మృతి
– నివాళులర్పించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ
నవ తెలంగాణ – పటాన్ చెరు
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పుత్రశోకంలో మునిగిపోయారు. ఎమ్మెల్యే పెద్ద కుమారుడు గూడెం విష్ణువర్ధన్ రెడ్డి(35) గురువారం ఉదయం హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో అనారోగ్యంతో మతి చెందారు. కుమారుడి మరణంతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డితో పాటు కుటుంబీకుల రోదనలు అందరినీ తీవ్రంగా కలిచి వేశాయి. నిన్నమొన్నటి వరకు అందరితో కలిసి మెలిసి ఉంటూ ఆప్యాయంగా పలకరించిన విష్ణువర్ధన్ రెడ్డి మరణ వార్తతో.. సన్నిహితులు, స్నేహితులు, బంధుమిత్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు. మృతునికి భార్య కిరణ్మయితో పాటు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. గురువారం ఉదయం ఆస్పత్రి నుంచి ఎమ్మెల్యే నివాసానికి విష్ణు భౌతికకాయాన్ని తీసుకువచ్చారు. సాయంత్రం నాలుగు గంటలకు ఎమ్మెల్యే సొంత స్థలం జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ పక్కన విష్ణువర్ధన్ రెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో రాష్ట్ర మంత్రులు మహమ్మద్ అలీ, తన్నీరు హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ వెన్నవరం భూపాల్ రెడ్డి, మహిళా కార్పొరేషన్ చైర్మెన్ సునీతా లక్ష్మారెడ్డి, రాష్ట్ర అటవీ అభివద్ధి సంస్థ చైర్మెన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, మదన్ రెడ్డి, మాణిక్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ రమణ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, కుర్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.