HomeLifestyleLife styleపాశ్చాత్య దేశాల్లో యోగా పితా మహుడు యోగానంద యోగి

పాశ్చాత్య దేశాల్లో యోగా పితా మహుడు యోగానంద యోగి

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

పరమహంస యోగానంద 1893 జనవరి 5 – 1952 మార్చి 7) భారతీయ సన్యాసి, యోగి, ఆధ్యాత్మిక గురువు. యోగానంద అమెరికాలో స్థిరపడ్డ ప్రధాన ఆధ్యాత్మిక గురువుల్లో ప్రథముడు. తన చివరి 32 సంవత్సరాలు అమెరికాలో గడిపాడు3. శ్రీయుక్తే శ్వర్ గిరికి ముఖ్య శిష్యుడిగా, యోగాభ్యాసాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేసి ఆయన భౌతిక వాదాన్ని, భారతీయుల ఆధ్యాత్మి కతను సమన్వయ పరచడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అమెరికాలో ఆయన యోగా ఉద్యమంపై వేసిన ముద్ర, లాస్ ఏంజిలస్ లో ఆయన నెలకొల్పిన యోగా సంస్కృతి, ఆయనకు పాశ్చాత్య దేశాల్లో యోగా పితా మహుడిగా గౌరవ స్థానాన్ని సంపా దించి పెట్టాయి.
1927 లో అప్పటి అమెరికా అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ చేత వైట్ హౌస్ ఆతిథ్యాన్ని అందుకున్న ప్రథమ భారతీయ ప్రముఖుడు కూడా ఆయనే. లాస్ ఏంజిలస్ టైమ్స్ అనే పత్రిక ఆయన్ను 20వ శతాబ్దపు మొట్టమొదటి సూపర్ స్టార్ గురువు అని అభివర్ణించింది.

యోగానంద 1893, జనవరి 5 న ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్లో ఒక సాంప్రదాయ బెంగాలీ కాయస్థ కుటుంబంలో జన్మించాడు. జన్మ నామం ముకుందలాల్ ఘోష్. చిన్న వయసు నుంచే ఆధ్యాత్మికతలో వయసుకు మించిన ఆసక్తిని, పరిణతిని కనబరిచేవాడు. పాఠశాల చదువు పూర్తయిన తర్వాత ఇల్లు వదలి వారణాసిలోని మహామండల్ సన్యాసాశ్రమం చేరాడు. 17 ఏళ్ళ వయసులో, 1910 సంవత్సరంలో శ్రీయుక్తేశ్వర్ గిరిని తన గురువుగా కను గొన్నాడు. యోగానంద శ్రీయుక్తేశ్వర్ గిరి శ్రీరాంపూర్ ఆశ్రమం లోనూ, పూరీ ఆశ్రమంలోనూ ఒక దశాబ్దం పాటు (1910-1920) శిక్షణ పొందా డు. 1914 లో కలకత్తాలోని స్కాటి ష్ చర్చి కళాశాల నుండి ఇంట ర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణుడై 1915, జూన్ లో బి. ఎ డిగ్రీకి సమానమైన డిగ్రీని పొందాడు. కళాశాల వదిలిపెట్టిన కొన్ని వారాలకు సాంప్రదాయికంగా సన్యాసాన్ని స్వీకరించాడు. శ్రీ యుక్తేశ్వరి గిరి ఆదేశానుసారం తన సన్యాస నామాన్ని స్వచ్చందంగా స్వామి యోగానంద గిరిగా మార్చు కున్నాడు. 1917 లో యోగానంద బాలుర కోసం పశ్చిమ బెంగాల్ లోని దిహికలో ఒక పాఠశాల ప్రారం భించాడు. ఆ పాఠశాల అమెరికాలో యోగానంద స్థాపించిన సెల్ఫ్ రియ లైజేషన్ ఫెలోషిప్ కు భారత దేశం లో అనుబంధ పాఠశాల అయి న యోగదా సత్సంగ సొసైటీగా మారింది.

అమెరికన్ యూనిటేరియన్ అసోసియేషన్ నుంచి బోస్టన్ లో జరిగే ప్రపంచ మత ఉదారవాదుల సభకు భారతదేశ ప్రతినిధిగా హాజరు కావాలని ఆహ్వానం అందింది. అందుకు గురువు శ్రీయుక్తేశ్వర్ గిరి అనుమతి కూడా వచ్చింది. 1920 లో బోస్టన్‌కు చేరుకున్న ఆయన తన ఉపన్యా సాలతో ఖండాంతర పర్యాటన చేశాడు. అంతర్జాతీయ మత సభల్లో ప్రసంగించాడు. ఆయన 1920 నుంచి 1952లో మరణించే దాకా అక్కడే ఉన్నాడు. సనాతన భారతదేశపు ఆధ్యాత్మిక బోధనలు, యోగాతత్వం, ధ్యాన సాంప్రదా యాలను ప్రచారం చేయడం కోసం సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అనే సంస్థను ప్రారంభించాడు. యోగా నంద తర్వాతి నాలుగు సంవత్సరా లు బోస్టన్ లో గడిపాడు.1924 లో సందేశాలిస్తూ ఖండాంతర పర్యటన లు చేశాడు. చివరికి 1925లో లాస్ ఏంజిలస్ లో స్థిరపడ్డాడు. అమెరి కాలో ఎక్కువ భాగం గడిపిన హిందూ ఆధ్యాత్మిక గురువుల్లో యోగానంద ప్రథముడు.

తర్వాత 25 సంవత్సరాల పాటు అక్కడే ప్రాంతీయంగా మంచి గుర్తింపు పొందడమే కాక తన ప్రభావాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. ఒక సన్యాసి సాంప్రదాయాన్ని ఏర్పాటు చేసి శిష్య పరంపరకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. అక్కడక్కడ పర్యటిస్తూ బోధనలు చేశాడు. కాలిఫోర్నియాలోని పలు ప్రాంతాల్లో తమ సంస్థ కోసం ఆస్తు లు కొన్నాడు. వేలాది మందిని క్రియా యోగంలోకి ప్రవేశింప జేశాడు.1935లో భారత దేశానికి వచ్చిన ఆయన, మహాత్మా గాంధీని కలిసి ఆయనను క్రియాయోగంలో ప్రవేశ పెట్టాడు. ఆనందమయి మా, నిరాహార యోగిని గిరిబాల, భౌతిక శాస్త్రవేత్త సి. వి. రామన్, లాహిరీ మహాశయుల శిష్యులను కొంత మందిని కలిశాడు.తిరిగి లండన్ వెళ్లి, యోగా తరగతులు నిర్వహించాడు. చారిత్రాత్మక స్థలాలు దర్శించాడు. అక్కడ నుంచి 1936 అక్టోబరున అమెరికాకు వెళ్ళి, అమెరికన్ శిష్యులను కలుసుకుని తన బోధన లు, రచనా కార్యక్రమాలు తిరిగి కొనసాగించాడు.1952 కల్లా SRF భారతదేశం లో, అమెరికాలో కలిపి 100కి పైగా కేంద్రాలు నెలకొల్పారు. ప్రస్తుతం అమెరికాలో ప్రతి ప్రధాన నగరం లోనూ కేంద్రాలున్నాయి. ఆయన బోధించిన సరళ జీవనం, ఉన్నత మైన ఆలోచన అనే విధా నం వివిధ నేపథ్యాలు కలిగిన పలు వురు జిజ్ఞాసువులను ఆకట్టుకుంది.

1946 లో ఆయన రాసిన ఒక యోగి ఆత్మకథ విమర్శకుల ప్రశంసల నందుకుని ఇప్పటిదాకా 40 లక్షల ప్రతులకుపైగా అమ్ముడు పోయింది. హార్పర్ కోలిన్స్ సంస్థ 20వ శతాబ్దపు అత్యంత ప్రజాదర ణ పొందిన 100 పుస్తకాల్లో ఈ పుస్తకాన్ని చేర్చింది. ఈ పుస్తకం క్రమం తప్పకుండా అనేక పున ర్ముద్రణలు జరుపుకుని అనేక లక్షల మంది జీవితాలను మార్చినదిగా పరిగణించ బడుతోంది.


1946 లో ఆయన అమెరికాలో మారిన వలస చట్టాల ప్రకారం పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోగా, 1949లో అంగీకరించ బడి అధికారికంగా అమెరికా పౌరుడయ్యాడు. 1952 మార్చి 7 న యోగానంద అమెరికాలో భారత రాయబారి వినయ్ రంజన్ సేన్ గౌరవార్థం లాస్ ఏంజిలెస్ లోని బిల్ట్‌మోర్ హోటల్లో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నని, తన ఉపన్యా సం ముగించి, తాను రాసిన మై ఇండియా నుంచి కొన్ని వాక్యాలు చదివాక, తన చూపును ఆజ్ఞా చక్రంపై కేంద్రీకరించాడు. వెంటనే ఆయన శరీరం నేలమీద పడి పోయింది. ఆయన అనుచరులు తమ గురువు మహాసమాధి చెందినట్లు ప్రకటించారు.

1946 లో ఆయన ఆత్మకథను ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అనే పేరుతో ఆంగ్లంలో రాశాడు. ఈ పుస్తకం 50 పైగా భాషల్లోకి అనువాదమైంది. తెలుగులో ఒక యోగి ఆత్మకథ పేరుతో అనువదించారు. 1999 లో జరిపిన సర్వేలో ఈ పుస్తకం 20 వ శతాబ్ద పు అత్యుత్తమ ఆధ్యాత్మిక గ్రంథా ల్లో ఒకటిగా, స్థానం పొందింది.

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (YSS) 1917 లో యోగానంద భారత దేశంలో స్థాపించిన సంస్థ. దీన్నే 1920 లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ (SRF) పేరుతో అమెరికాకు విస్తరించారు. SRF/YSS ప్రధాన కార్యాలయం లాస్ ఏంజిలెస్ లో ఉంది. ఈ సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా 500 కి పైగా దేవాల యాలు, కేంద్రాలు ఉన్నాయి. 175 దేశాల నుంచి ఈ సంస్థలో సభ్యులు ఉన్నారు. భారత దేశంలో YSS 100 కి పైగా కేంద్రాలు, ఆశ్రమాలను నడుపుతోంది. నవంబరు 15, 2017 న భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, జార్ఖండ్ గవర్నరు ద్రౌపది ముర్ము, ముఖ్య మంత్రి రఘుబర్ దాస్‌తో కలిసి రాంచీలోని యోగదా సత్సంగ శాఖను సందర్శించారు.

పరమహంస యోగానంద జ్ఞాపకంగా 1977 లో భారత ప్రభుత్వం ఆయన పేరున తపాలా బిళ్ళను విడుదల చేసింది. మార్చి 7, 2017 నాడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరో స్మారక తపాలా బిళ్ళను విడుదల చేశారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments