నాట్యం దేవతలు మానవులకు అందించిన కళగా చెబుతుంటారు.అలాంటి గొప్ప కళపై నాట్యం అనే తెలుగు చిత్రం రూపుదిద్దుకుంటుంది.ఈ చిత్రంలో ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ మరియు సత్యం కంప్యూటర్స్ అధినేత సత్యం రామలింగరాజు కోడలు సంధ్య రాజు ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ కామరాజు,భాను ప్రియ,రోహిత్ బెహల్ వంటి వారు కీలక పాత్రలలో కనిపించనున్నారు.ఈ చిత్రానికి రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహిస్తున్నారు.
రేపు ఈ చిత్ర టీజర్ ను సరిగ్గా 10.08 నిమిషాలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిలీజ్ చేయబోతున్నట్లు తాజాగా చిత్రయూనిట్ ప్రకటించింది.దీనితో ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రామిసింగ్ ఉంది.
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకపక్క చిత్రాలు చేసుకుంటూ మరోపక్క చిన్న బడ్జెట్ సినిమాల టీజర్ లు,సాంగ్స్ ను విడుదల చేస్తూ వారిని ఎంకరేజ్ చేయడం ఇండస్ట్రీకి శుభ పరిణామమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.