రేపు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఓ సర్ ప్రైజ్ ను చిత్ర యూనిట్ సిద్ధం చేస్తుంది.మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నారు.దానికి సంబంధించిన ఓ అప్డేట్ ను రేపు ఉదయం 10 గంటలకు చిత్ర యూనిట్ విడుదల చేయనున్నది.ఈ మూవీలో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ వాయిదా పడిన ఈ మూవీ రిలీజ్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.