తాజాగా ఇండియన్ డ్రెస్సింగ్ రూంలో జరిగిన ఓ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది.ఇందులో రవిచంద్రన్ అశ్విన్,హార్దిక పాండ్య, కుల్దీప్ యాదవ్ లు హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి.
ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ వెర్సెస్ ఇండియా టెస్ట్ సీరీస్ లో మూడవ టెస్ట్ ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్ లో జరగనున్నది.ఈ పిచ్ కు సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ పింక్ బాల్ టెస్ట్ లో ఎవరు విజయం సాధిస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురచూస్తున్నారు.రెండో టెస్ట్ లో 317 పరుగులతో ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించిన భారత్ తమ మొదటి టెస్ట్ ఓటమికి సరైన రివెంజ్ తీర్చుకుంది.