మలయాళ స్టార్ నివిన్ పాలీ హీరోగా నటించిన కొత్త సినిమా మహవీర్యర్. అసిఫ్
అలీ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ రచయిత ఎం ముకుందన్ రాసిన కథ
ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మహవీర్యర్ సినిమాను ఇండియన్ మూవీ
మేకర్స్ సంస్థతో కలిసి నివీన్ పాలీ తన సొంత ప్రొడక్షన్ కంపెనీ పాలీ
జూనియర్ పిక్చర్స్ పై నిర్మిస్తున్నారు. పీఎస్ షన్మాస్, నివీన్ పాలీ
నిర్మాతలు. అబ్రిడ్ షైన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా మహవీర్యర్
సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు.
మహవీర్యర్ సినిమా ఫాంటసీ, టైమ్ ట్రావెల్, న్యాయ సూత్రాల ప్రాధాన్యత వంటి
అంశాలు కలిసిన కథతో తెరకెక్కిస్తున్నారు. పాండమిక్ ఆంక్షల మధ్య
రాజస్థాన్, కేరళలో బ్యూటిపుల్ లొకేషన్స్ లో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు.
యాక్షన్ హీరో బిర్జు సినిమా తర్వాత నివీన్ దర్శకుడు అబ్రిడ్ షైన్
కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబడ్డి మహవీర్యర్ పై భారీ అంచనాలు
ఉన్నాయి.
లాల్, లలు అలెక్స్, సిద్ధిఖీ, శాన్వీ శ్రీవాస్తవ, విజయ్ మీనన్, మేజర్
రవి, మల్లిక సుకుమారన్, కృష్ణ ప్రసాద్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ – చంద్రూ సెల్వరాజ్, సంగీతం – ఇషాన్ చాబ్రా,
ఎడిటింగ్ – మనోజ్, ఆర్ట్ – అనీస్ నాడోడి, పీఆర్వో – జీఎస్కే మీడియా,
దర్శకత్వం – అబ్రిడ్ షైన్.