వృద్ద పాత్రలలో జీవం పోసిన నిర్మలమ్మ తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో.. సినిమాల్లో ఆమెను చూడగానే మమతానురాగాలకు ప్రతిరూపమైన తల్లిగా, అమ్మమ్మగా, బామ్మగా, ఇంటికి పెద్ద దిక్కుగా, అందరికీ ఆత్మీయురాలిగా అనిపిస్తుంది. నిర్మలమైన, కరుణతో నిండిన స్త్రీమూర్తి ఆమెలో కనిపిస్తుంది. అలాంటి అరుదైన విశిష్టతను చేకూర్చుకున్న నటీమణి నిర్మలమ్మ.నిర్మల నటించిన తొలి నాటకం ప్రేమలీల’, పద హారేళ్ల వయసులో నిర్మల అభిరుచికి తగ్గట్టుగా సక్కుబాయి’ నాటకంలో నటించే అవకాశం వచ్చింది. తర్వాత పలు నాటకాల్లో తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించి పలువురి ప్రశంసలు పొంద గలిగింది. రంగస్థలం మీద కేవలం నటించడమే కాకుండా శాస్త్రీయ సంగీతాన్ని సైతం రాగయుక్తంగా ఆలపించేవారు. ‘ఆకలి’ నాటకంలో బిచ్చగత్తె పాత్రను సహజశైలిలో ధరించినందుకు తన కళ్లు చెమ్మగిల్లాయని ప్రముఖ హిందీ నటుడు పృథ్వీ, రాజ్ కపూర్ సభాముఖంగా ఆశీర్వదించడం మరిచి పోలేని మధురానుభూతిగా నిర్మల జ్ఞప్తికి తెచ్చుకునే వారు. అలాగే విశ్వనాథ సత్యనారాయణ ‘వేయిపడగ’ నాటకంలో గిరిజ పాత్ర అపూర్వంగా ధరించావని అభినందించారాయన.రంగస్థలం నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్రంలోను, అనేక నాటకసంస్థల్లోను, సొంతంగా ఏర్పాటు చేసిన ఉదయిని అండ్ రాఘవ కేంద్రంద్వారా నిర్మల పలు నాటకాలను ప్రదర్శించారు.వాటిలో ‘ఆకలి’, ‘ఆత్మవంచన’, ‘కరువు రోజులు ‘చింతామణి’, ‘కన్యాశుల్కం’, ‘ఏకవీర’, ‘వేయిపడగలు’ ఎన్నో ఉన్నాయి. రంగస్థలం మీద ఆకాశవాణి లోను ఆమెతో నటించిన వారిలో రామచంద్ర కాశ్యష్, కె.వి.ఎస్.కర్మ, రామన్న పంతులు, కె.విశ్వనాథ్, కె.వెంకటేశ్వరరావు తదితర ప్రముఖులందరు ఉన్నారు. ఇక 1948లో జరిగింది. ప్రతిభ సంస్థ ఘంటసాల బల రామయ్య స్వీయ దర్శకత్వంలో ‘నిర్మించిన ‘గరుడ గర్వభంగం’ చిత్రంతో ఆమె తొలి సారి కెమెరా ముందు నిల్చున్నారు. అప్పుడు ఆ చిత్రానికి లభించిన పారితోషికం 500రూపాయలు. ఆమె తొలి చిత్రం నుంచి వెనుతిరిగింది లేనే లేదు. సినీనటి నిర్మలమ్మ తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజనటి. నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు. నిర్మలమ్మ అసలు పేరు రాజమణి. స్వస్థలం కృష్ణా జిల్లా బందరు. చిన్ననాటి నుంచి నాటకాలంటే ఆమెకు ప్రాణం. ఆదే ఆమె సినీరంగ ప్రవేశానికి ద్వారాలు తెరిచింది. 1943లో తన పదహారేళ్ల వయసులో గరుడ గర్వభంగం సినిమాలో చెలికత్తె పాత్రలో తొలిసారి నటించారు. ఆ తరువాత సుమారు వెయ్యి సినిమాల్లో నటించారు. మూడు తరాలకు చెందిన నటులతో ఆమె నటించిన రికార్డు ఉంది. తన కన్నా పెద్దవారైన నాటి నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, యస్వీ రంగారావు ల నుంచి నేటి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించారు.నిర్మలమ్మకు పందొమ్మిదేళ్ళ వయసులో జీవీ కృష్ణారావుతో వివాహం జరిగింది. ఈయన ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేసేవాడు. ఆమె దత్త పుత్రిక పేరు కవిత. అల్లుడు డి.యస్. ప్రసాద్.కాకినాడలో కరువు రోజులు అనే నాటకం చూసిన అలనాటి బాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ కపూర్ నిర్మలమ్మను గొప్ప నటివవుతావని చెప్పాడు. ఈ సంఘటనను నిర్మలమ్మ చాలా సందర్భాల్లో గుర్తు చేసుకునేది.నిర్మలమ్మ ఆడపెత్తనంలో హీరోయిన్ గా చేయాల్సింది. కానీ అది కుదర్లేదు. తర్వాత ఆమె గరుడ గర్వభంగంలో హీరోయిన్ గా చేసింది కానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. కానీ ఆమెకు నటిగా పేరు తెచ్చింది మాత్రం మనుషులు మారాలి అనే చిత్రం. ఆ సినిమా శతదినోత్సవాలకు వెళ్ళిన హిందీ నటుడు ప్రాణ్. నువ్వు శోభన్ బాబుకే అమ్మ కాదు. భారత్ కీ మా! అని అన్నాడు. అప్పట్లో ఆయనతో నాలుగు ముక్కలు హిందీలో మాట్లాడలేక పోయానని ఆమె విచారిస్తుండేది. ఏక వీర నాటకంలో గిరిక పాత్రను వేసిన నిర్మలమ్మను చూసిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ… “పిచ్చిమొద్దూ! నీలో ఇంత నటన ఉందని అనుకోలేదు” అంటే అమాయకంగా నవ్విందట నిర్మలమ్మ.శంకరాభరణం, యమగోల, పదహారేళ్ల వయసు, మావిచిగురు, గ్యాంగ్ లీడర్, శుభసంకల్పం, ఆపద్బాంధవుడు, స్వాతిముత్యం తదితర చిత్రాల్లో వయసు మీద పడినా ఓపికతో నటించిన ఆమె అనంతరం ఆరోగ్య కారణాలతో నటన విరమించు కున్నారు. స్నేహం కోసం చిత్రం తరువాత ఆమె దాదాపు నటించటం మానేశారు. ఎస్వీ కృష్ణారెడ్డి బలవంతం మీద ఆమెను చివరి చిత్రం ప్రేమకు ఆహ్వానంలో నటించడానికి ఒప్పించాడు. మయూరి, సీతారామరాజు సినిమాలకు నంది అవార్డులను అందుకున్నారు.”షూటింగ్ విరామ సమయంలో మమ్మల్ని తల్లిలా ఆదరించేది. అందకూ మేమందరం ఆమెను ఆప్యాయంగా నిర్మలమ్మ (నిర్మల+అమ్మ) అని పిలుచుకునే వాళ్ళం”. అని అక్కినేని నాగేశ్వరరావు తరుచుగా చెప్పేవారు.ఆరోగ్యం విషమించి హైదరాబాదులో 19 ఫిబ్రవరి, 2009 రోజున మృతిచెందారు.
