న్యూఢిల్లీ నుంచి బయలుదేరిన ఎన్‌హెచ్ఆర్‌సీ బృందం హైదరాబాద్ చేరుకుంది. మరికాసేపట్లో ఈ బృందం షాద్‌నగర్ ఎన్‌కౌంటర్ ప్రాంతానికి వెళ్లనుంది. ఆ తర్వాత మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న నిందితుల మృతదేహాలను కూడా ఈ బృందం పరిశీలించనుంది.
ఇప్పటికే మృత దేహాలకు పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి అయింది. జ్యూడిషియల్‌లో ఉన్న నిందితులను పోలీస్ కస్టడిలోకి తీసుకున్నారు. కస్టడికి తీసుకున్న తర్వాత ఎన్‌కౌంటర్ జరిగిన నేపథ్యంలో.. తెలంగాణ పోలీసులు, సైబరాబాద్ కమిషనర్‌కు ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది.
ఎన్‌హెచ్ఆర్‌సీ బృందం ఎన్‌కౌంటర్ జరిగిన సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఎం జరిగిందన్నదానిపై నివేదికను తయారు చేయనుంది. ఈ నేపథ్యంలో ఎన్‌హెచ్ఆర్‌సీ బృందానికి సహకరించేందుకు సైబరాబాద్ పోలీసులు ఒక బృందాన్ని సంఘటనా ప్రదేశంలో సిద్ధంగా ఉంచారు.