Wednesday, November 30, 2022
Homespecial Editionవిశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన న్యూటన్

విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన న్యూటన్

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

అధునిక సైన్సును కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు న్యూటన్. గణిత శాస్త్రంలోనూ అంతటి ప్రతిభాశాలి, అంతటి ప్రభావశీలి మరొకరు లేరు. ఆయన కాలంలో ఆయననూ ఆయనలాంటి వారినీ ప్రకృతి తాత్వికులుగా పిలిచేవారు.

మానవ ప్రపంచానికి విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన “సర్ ఐజాక్ న్యూటన్” ఒక ఆంగ్ల భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఈయన ఓ సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం సైన్సుగా ఎలా పరిణామం చెందిందన్న అంశంపై చేసిన ఎనలేని కృషికిగానూ ఆధునిక ప్రపంచం అంతా ఆయనను “సైన్సు పితామహుడు”గా కీర్తించింది.

ప్రపంచంలోనే మేటి శాస్త్రవేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు అంతరిక్షంలోకి రాకెట్లలో రివ్వున దూసుకెళ్తున్నామంటే, అందుకే న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే కారణం.

విశ్వ రహస్యాలను మానవాళికి విశ్లేషించి చెప్పిన న్యూటన్ జనవరి 4, 1643వ సంవత్సరంలో ఇంగ్లండ్‌కు దగ్గర్లోగల ఉల్‌తోప్ అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు.

న్యూటన్ చిన్నప్పుడు స్కూల్లో చదువుకంటే ఇతర సైన్సు పుస్తకాలు చదవటం, పెద్ద వస్తువుల్ని చూసి వాటినే చిన్న సైజులో తయారు చేయటం లాంటి పనులు చేస్తుండేవాడు. అలా చిన్న చిన్న మిషన్లు, నీటి గడియారం, ఎండలో పనిచేసే గడియారంలాంటివి కూడా ఆయన తయారు చేశాడు. ఆయన చేతిలో రూపుదిద్దుకున్న ఈ వస్తువులన్నీ ఇప్పటికీ లండన్ రాయల్ సొసైటీ మ్యూజియంలో ఉన్నాయి.

1661 లో ఉన్నత విద్య కోసం కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో చేరిన న్యూటన్.. గణిత, భౌతిక, ఖగోళ శాస్త్ర పరిశోధనలపై మక్కువ పెంచుకున్నాడు. ఆ తరువాత అక్కడే ప్రొఫెసర్‌గా నియమితుడైన న్యూటన్‌, 1667లో పరావర్తన దూరదర్శినిని నిర్మించి సంచలనం సృష్టించాడు. చిన్నతనంలో చెట్టు నుంచి రాలిన యాపిల్‌ను గమనించిన న్యూటన్‌ అందుకు కారణాన్ని అన్వేషించే క్రమంలో గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

భూమి, చంద్రుడు, గ్రహాలు, సూర్యుడు సహా విశ్వంలోని వస్తువులపై గురుత్వ శక్తి ఎలా పని చేస్తుందో వివరిస్తూ విశ్వ గురుత్వ నియమాన్ని ప్రతిపాదిస్తూ, గమన సూత్రాలను నిర్వచించాడు.
గురుత్వాకర్షణ శక్తి గురించి, న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ప్రస్తావించాడు. తరువాతి మూడు శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్సు దృక్కోణంగా వెలుగొందిన యాంత్రిక శాస్త్రానికి తరువాత ఆధునిక ఇంజనీరింగ్ కూ ఈ గ్రంథమే పునాది. ఏదైనా ఒక వస్తువు యొక్క గమనం, భూమి మీదైనా లేక ఇతర గ్రహాలమీదైనా ఒకే రకమైన నియమాల మీద ఆధారపడి ఉంటుందని నిరూపించాడు. దీనికి ఆధారంగా కెప్లర్ నియమాలకూ మరియు గురుత్వాకర్షణ సిద్ధాంతాలకూ గల సామ్యాన్ని దృష్టాంతంగా చూపాడు. దీంతో సూర్య కేంద్రక సిద్ధాంతంపై పూర్తిగా అనుమానం తొలిగిపోవడమే కాకుండా ఆధునిక సైన్సు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది.
విజ్ఞాన శాస్త్ర రంగం మీదకు ఐన్ స్టయిన్ వచ్చేదాకా మూడు దశాబ్దాల పాటు శాస్త్ర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడు ఐసాక్ న్యూటన్. ఇప్పటికీ ఆయన చలన సూత్రాలు కొన్ని పరిమితులకు లోబడి సజావుగా పనిచేస్తోనే ఉన్నాయి

మొదటి సూత్రము
“బాహ్యబల ప్రయోగము లేనంత వరకు చలన స్థితిలో ఉన్న వస్తువు చలన స్థితిలోను, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనూ ఉంటుంది”. ఈ వస్తు ధర్మాన్ని జడత్వము అంటారు.
రెండవ సూత్రము
“ఒక వస్తువు ద్రవ్యవేగంలోని మార్పు ఆ వస్తువు పై ప్రయోగించిన బలానికి అనుపాతముగా ఉంటుంది. మరియు ఆ బలం ప్రయోగించిన దిశలో ఉంటుంది
న్యూటన్ మూడవ నియమం

చర్యకు ప్రతి చర్య సమనంగా ఉండి వ్యతిరేక దిశలో పనిచేయును.

భౌతిక శాస్త్ర భావనలను వివరిస్తూ “ప్రిన్సిపియా మేథమేటికా” అనే గ్రంథాన్ని రచించాడు. కాంతిపై న్యూటన్‌ చేసిన పరిశోధనల ఫలితంగా “దృశాశాస్త్రం” పుట్టింది.

మూడు శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్సు దృక్కోణంగా వెలుగొందిన యాంత్రిక శాస్త్రానికి తరువాత ఆధునిక ఇంజనీరింగ్ కూ ఈ గ్రంథమే పునాది. ఏదైనా ఒక వస్తువు యొక్క గమనం, భూమి మీదైనా లేక ఇతర గ్రహాలమీదైనా ఒకే రకమైన నియమాల మీద ఆధారపడి ఉంటుందని నిరూపించాడు. దీనికి ఆధారంగా కెప్లర్ నియమాలకూ, గురుత్వాకర్షణ సిద్ధాంతాలకూ గల సామ్యాన్ని దృష్టాంతంగా చూపాడు.

ఆయనకు 1672లో రాయల్‌ సొసైటీ ఫెలోషిప్‌ లభించింది. అప్పటి వరకూ ప్రకృతి శాస్త్రంలో ఒక భాగంగా ఉన్న భౌతిక శాస్త్రాన్ని న్యూటన్‌ ఆవిష్కరణలు, సిద్ధాంతాల వల్ల ప్రత్యేక శాస్త్రంగా గుర్తించారు. అందుకే న్యూటన్‌ను భౌతిక శాస్త్ర పితామహుడు అంటారు. 1705లో బ్రిటిష్‌ ప్రభుత్వం “సర్‌” అని బిరుదునిచ్చి సత్కరించింది. ఇక అప్పటినుంచి ఐజాక్ న్యూటన్ కాస్తా సర్ ఐజాక్ న్యూటన్‌గా మారిపోయారు.

ఆ తరువాత కూడా ఎన్నో మైలురాళ్లను అధిగమించిన న్యూటన్ తన 85 సంవత్సరాల వయస్సులో మార్చి 31, 1727న మరణించారు.

మరింత సమాచారం కోసం మా Filmimonks అప్ ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్కోండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments